For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 25th Episode: రిస్క్ తీసుకున్న జానకి.. జ్ఞానాంబ పరువు పోయేలా మల్లిక ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరగబోతోంది. అత్త కోడళ్ల మధ్య ప్రేమ మధ్యలో కోపాలు మోసాలు బయటపడే సమయం దగ్గరలోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. అత్త జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి సిరియల్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అలాగే జానకి, రామచంద్ర పాత్రలు కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జ్ఞానాంబకు తెలియకుండా ఆమె కొడుకు రామచంద్ర భార్యను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని కష్టపడుతున్నాడు. ఇక ఆ తరువాత అబద్దాలు అంటేనే గిట్టని జ్ఞానాంబకు రోజుకొక అబద్ధం చెబుతూ అందరిని షాక్ కు గురి చేస్తుంటారు. వారు రోజుకో అబద్దాన్ని దాటుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో జ్ఞానాంబ ప్రతి క్షణం అనుమానాలు వ్యక్తం చేస్తుండగా జానకి మనసులో ఆందోళన నెలకొంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 112వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  మరింత పెరిగిన మల్లిక కోపం

  మరింత పెరిగిన మల్లిక కోపం

  ఒకవైపు అత్త కోపం మరోవైపు మల్లిక కూడా తీవ్ర స్థాయిలో అసహన వ్యక్తం చేస్తుండడం వలన జానకి తన డ్రీమ్ విషయంలో కంగారు పడుతుంది. మల్లికకు , జానకికి మధ్యలో గొడవలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందనే పాయింట్ ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తోంది. జానకిని అత్త మెచ్చుకోవడం ఏమాత్రం నచ్చలేదని మల్లిక తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక అదే సమయంలో వెనకాల నుంచి మల్లిక మాటలు విన్న జానకి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. జానకి హెచ్చరిక చేయడంతో మల్లిక మనసులో మరింత కోపం రగులుతోంది.

  జానకిని అస్సలు వదిలిపెట్టవద్దని..

  జానకిని అస్సలు వదిలిపెట్టవద్దని..

  జానకిపై కోపంతో ఉన్న చిన్న కోడలు మల్లిక ఎలాగైనా మరోసారి కోపాన్ని తీర్చుకోవాలని అనుకుంటుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా జానకిని అస్సలు వదిలిపెట్టవద్దని అనుకుంటుంది. ఈ క్రమంలో జానకి ఐపీఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ విషయం జ్ఞానాంబకు తెలియకుండా కేకులు నేర్చుకుంటున్నానని అబద్ధం చెప్పి కోచింగ్ సెంటర్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఈ విషయం పూర్తిగా తెలియని మల్లిక ఏదో జరుగుతోందని అదేంటో తప్పకుండా తెలుసుకోవాలని వారిపై ఫోకస్ పెడుతుంది.

  జానకి చదువు కోసం..

  జానకి చదువు కోసం..

  మొత్తానికి జానకి రామచంద్రతో కలిసి ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. ఇక అదే సమయంలో వారిని ఫాలో అయిన మల్లిక అనుకోకుండా దారిని మిస్ అవుతుంది. ఆటోలో ఫాలో అయినప్పటికీ జానకి రామచంద్రన్ ఎక్కడికి వెళ్లారో ఆమెకు అర్థం కాదు. చివరకు తన భర్త విష్ణుకి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. అయినప్పటికీ జానకి రామచంద్ర ఎక్కడికి వెళ్లారో అర్థం కాదు. జానకి తన ఐపీఎస్ కోచింగ్ సెంటర్ వద్ద తన స్నేహితుడిని కూడా రామచంద్రకు పరిచయం చేస్తోంది. ఇక అదే సమయంలో కాలేజీ ఫీజు గురించి భర్తకు చెప్పాలని అనుకుంటుంది కానీ ఆ భారీ ఫీజులను కట్టడం సాధ్యం కాదేమో అని మళ్ళీ జానకి మౌనంగా ఉంటుంది. రామచంద్ర మాత్రం చాలా తక్కువగానే ఉంటుందని అవి నేను తప్పకుండా కాడతానని సమాధానం ఇస్తాడు.

  జ్ఞానాంబ మాటలకు భయపడిన మల్లిక

  జ్ఞానాంబ మాటలకు భయపడిన మల్లిక

  ఇక మరోవైపు మల్లిక తన భర్తతో కలిసి జానకి రామచంద్ర, జానకి లను కనిపెట్టాలని తిరుగుతూ ఉంటారు. ఇంతలో జ్ఞానంబ నెంబర్ నుంచి వారికి ఫోన్ కాల్ వస్తుంది. ఇంట్లో నువ్వు లేవు షాప్ లో మీ ఆయన కూడా లేడు. ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారని నాకు అర్థం అయింది 5 నిమిషాల్లో ఇద్దరూ ఇంటి వద్ద ఉండాలని ఆదేశాలు జారీ చేస్తుంది.ఆ మాటలకు మల్లిక భయంతో ఇంటికి రావడానికి సిద్ధమవుతోంది.

  5లక్షల ఆర్డర్..

  5లక్షల ఆర్డర్..

  ఒక రాజకీయ నాయకుడు జ్ఞానాంబ దగ్గరికి వచ్చి ఒక పార్టీ మీటింగ్ ఉందని ఎలాగైనా ఒక రోజులో 1000 మందికి సరిపడా స్వీట్లు తయారు చేయాలని చెబుతాడు. అడ్వాన్స్ గా 5 లక్షలు కూడా ఇస్తామని అంటారు. అయితే ఆ ఆర్డర్ తీసుకోవడం సాధ్యంకాదని ఒక రోజులో అయ్యే పని కాదని జ్ఞానాంబ తిరస్కరించే ప్రయత్నం చెబుతుంది. ఇక ఇంతలో కాఫీ తీసుకుని వచ్చిన పెద్ద కోడలు జానకి, అత్త మాటలకు విరుద్ధంగా ఆ ఆఫర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కష్టపడితే ఈ ఆర్డర్ ను విజయవంతంగా పూర్తి చేయవచ్చని అవసరమైతే మరో పది మంది పని వాళ్ళు కూడా తీసుకుందాం అని చెబుతుంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  మరొక రిస్క్ లో పడిన జానకి..

  మరొక రిస్క్ లో పడిన జానకి..

  మన స్వీట్స్ కి చుట్టుపక్కల ఊర్లో మంచి పేరు ఉంది కాబట్టి త్వరగా చేసి ఇవ్వగలిగితే మరింత పేరు వస్తుందని జానకి అర్థమయ్యేలా చెబుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం మాట పోతే ఇన్నేళ్లు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుందని కూడా అంటుంటుంది. కానీ జానకి అలా ఏమీ జరగదని అంటుంది. ఇక ఈ ప్లాన్ ఎంత మాత్రం సక్సెస్ అవ్వకూడదని మరోవైపు మల్లిక తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. జానకి ఆలోచన ప్రకారం వరకు పది మంది పని వాళ్ళు రావాల్సి ఉండగా జానకి వారిని రానివ్వకుండా చేస్తుంది. ఎవరికి తెలియకుండా వారికి ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి వెనక్కి పంపేస్తుంది. ఎవరు కూడా సమయానికి రాకపోవడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. జానకి చేసిన పని వల్ల తల దించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆర్డర్ సమయానికి ఇవ్వలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పమని అంటుంది. ఇక జానకి మళ్ళీ ఏదైనా కొత్త తరహా ఆలోచనను అమలు చేస్తుందో లేదో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 113:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X