For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 26th: మల్లిక ప్లాన్ చెడగొట్టిన విష్ణు.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 375 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

   జాగ్రత్తగా ఉండాలి అని..

  జాగ్రత్తగా ఉండాలి అని..


  వారసుడి కోసం జ్ఞానాంబ ఎంతగానో ఆలోచిస్తుంది. ఇక అదే సమయంలో చిన్న కోడలు మల్లిక నెల తప్పినట్లు చెప్పడంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. దీంతో ఆనందాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలని కూడా అందరిని పిలిచి భోజనాలు పెట్టిస్తుంది. కానీ మల్లిక మాత్రం నిజంగా నెల తప్పదు. డబ్బులు ఇచ్చి పక్కింటి నీలావతి చేత నెల కడుపు వచ్చినట్లు అబద్ధం చెప్పిస్తుంది. ఇక ఆ ఆనందంలోనే మల్లికా ఇంట్లో ఏ పనులు కూడా చేయదు. అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అత్తగారు ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు. ఇక కావాల్సింది తింటూ మల్లికా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే జానకి పై నింద వేయాలని అనుకుంటుంది.

  జానకి ఎంట్రీతో..

  జానకి ఎంట్రీతో..


  ఇక ఇంటికి వచ్చిన నీలావతి మొదట మల్లికను అప్పుగా డబ్బులు అడుగుతుంది. అలాగే నువ్వు ఆడుతున్న నాటకం గురించి ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. దీంతో మల్లిక ఇంత నాటకం ఆడుతున్న దాన్ని కడుపు పోయిందని డ్రామా క్రియేట్ చేయలేనా.. నా కడుపు పోవడానికి జానకి ఏదో చేసింది అని అబద్ధం చెబుతాను అని అంటుంది. ఇక అప్పుడే జానకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెతో పాటు రామచంద్ర కూడా పక్కనే ఉంటారు. ఇక వాళ్ళు అసలు నిజం తెలుసుకున్నట్లు మల్లిక ఆశ్చర్యపోతుంది. అలాగే పక్కనే ఉన్న నీలావతి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది.

  షాక్ లో ఊపిరి పీల్చుకున్న మల్లిక

  షాక్ లో ఊపిరి పీల్చుకున్న మల్లిక

  అయితే మల్లిక మాట్లాడుకున్న మాటల గురించి జానకి ఆమె భర్త రామచంద్ర అంతగా వినరు. అంతేకాకుండా జానకి ప్రత్యేకంగా కొన్ని ఫోటోలను కూడా తెస్తుంది. నువ్వు పండంటి బిడ్డకు జన్మనివ్వాలి కాబట్టి ఈ ఫోటోలను నిరంతరం చూస్తూ ఉంటే అందమైన బిడ్డ పుడతాడు అని జానకి ఒక ఫోటోను ఇస్తుంది. ఇక అసలు నిజం తెలియలేదు అని వీళ్ళు నేను మాట్లాడుకుంటున్న మాటలు కూడా సరిగ్గా వినలేదు అని మల్లి ఊపిరి తీసుకుంటుంది.

  ఫ్రూడ్ సలాడ్ తో కన్నింగ్ ప్లాన్

  ఫ్రూడ్ సలాడ్ తో కన్నింగ్ ప్లాన్

  ఇక తర్వాత జానకి మంచితనాన్ని చూసిన అత్త మామగారు ఇద్దరూ కూడా మెచ్చుకుంటారు. నీకు ముందుగా పిల్లలు కాకపోయినాప్పటికీ కూడా నీతోటి కోడలు విషయంలో చాలా చక్కగా ఆలోచిస్తున్నావు అని వాళ్ళు ఆనంద పడుతూ ఉంటారు. అయితే మల్లిక మాత్రం జానకి విషయంలో పైకి మంచిగానే నటిస్తూ నిత్యం ఏదో ఒక నింద వేయాలని అనుకుంటుంది. అదే తరహాలో ఫ్రూట్ సలాడ్ కలిపి ఇచ్చే సమయంలో మల్లిక మరొక దారుణమైన ప్రణాళిక రచిస్తుంది. జానకి మల్లిక కోసం ప్రత్యేకంగా ఫ్రూట్స్ సలాడ్ కలిపే తినాలని చెబుతుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా ఉంటుంది.

  బొప్పాయి పండు కలిపి?

  బొప్పాయి పండు కలిపి?


  అయితే జానకి తెలియకుండానే ఆ ఫ్రూట్స్ సలాడ్ లో మల్లిక ముందుగానే బొప్పాయి పండు కలుపుతుంది. ఇక తర్వాత మల్లికా అది తింటూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా మల్లిక వాటిని తినకూడదు అని చెబుతుంది. ఎందుకంటే తల్లిగా ఉన్నవారు బొప్పాయి పండు తినకూడదు అని అది చాలా ప్రమాదం అని కూడా చెప్పడంతో జానకి తనకు కావాలని ఇచ్చి ఉండవచ్చు అని మల్లికా అనుమానం వ్యక్తం చేస్తుంది. తనకు ముందుగా పిల్లలు కారేమో అని కారణం చేత అసూయ చెంది ఇలా ఇచ్చి ఉండవచ్చు అని కూడా ఉంటుంది. అయితే ఆ విషయంలో మామ గోవిందరాజులు మాత్రం జానకి పై అలాంటి అబద్ధాలు చెబితే ఏమాత్రం నమ్మలేము అని అంటాడు. తప్పకుండా జానకి ఇలాంటి పని చేసి ఉండదు అని కూడా అంటాడు. జానకి కూడా ఆ బొప్పాయి నేను కలపలేదని అంటుంది.

  ట్విస్ట్ ఇచ్చిన విష్ణు

  ట్విస్ట్ ఇచ్చిన విష్ణు

  ఇక తర్వాత మల్లిక భర్త విష్ణు వచ్చి ఆ బొప్పాయి పండు నేనే కలిపాను అని చెబుతాడు. నిజానికి తల్లిగా ఉన్నవారు బొప్పాయి పండు తింటే మంచిది కాదన్న విషయం నాకు తెలియదు అని ఏదో ఆరోగ్యానికి మంచిది కదా అని అందులో కలిపాను అని అంటాడు. అందుకు తల్లికి క్షమాపణలు కూడా చెబుతాడు. ఇక తర్వాత విష్ణు తన భార్యను గదికి తీసుకువెళ్ళి నువ్వు అందులో బొప్పాయి పండు కలపడం నేను చూశాను అనవసరంగా వదినపై నింద వేయడానికి ప్రయత్నం చేశావు అది ఎంత మాత్రం మంచిది కాదు అని చెబుతాడు.

   రామచంద్ర ఆందోళన

  రామచంద్ర ఆందోళన


  అయినప్పటికీ కూడా మల్లిక అతని మాటలు పట్టించుకోకుండా తనకంటే పెద్ద కోడలిని ఎక్కువగా ప్రేమగా చూస్తున్నారు అని అందుకే నేను ఆ విషయంలో తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. ఇక మల్లిక తీరుకలకు భర్త రామచంద్ర కూడా కొంత ఆందోళన చెందుతాడు. అలాగే ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని అని జనాకికి చెబుతాడు. కానీ జానకి మాత్రం ఆ విషయంలో మల్లికపై మంచి అభిప్రాయంతోనే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో మల్లికా ఇంకా ఇలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial August 26th Episode 375
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X