Janaki Kalaganaledu August 2nd Episode: మల్లిక నడుము విరిగేలా చేసిన జ్ఞానాంబ.. జానకి కోసం రామ మరో పాఠం!

జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. మల్లిక vs జ్ఞానాంబ సీన్స్ అయితే నవ్వుతో పాటు న్యూ ట్విస్టులను క్రియేట్ చేస్తోంది. ఇక ఏమాత్రం బోర్ కొట్టినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ట్విస్టులను వాడుకుంటూ సీరియల్ ను కొనసాగిస్తున్నారు. భార్య జానకి ఐపీఎస్ చదువు కోసం భర్త రామ తీసుకున్న నిర్ణయం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అలాగే జానకి , రామ లవ్ సీన్స్ బ్యూటీఫుల్ గా కొనసాగుతున్నాయి. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న ఆశయం మొదలైంది. అయితే అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 96వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

వారికి అడ్డుగా మల్లిక

వారికి అడ్డుగా మల్లిక

జనాకికి ఐపీఎస్ చదివించాలని రామ ఇటీవల ఆమె కోసం పుస్తకాలను కూడా తీసుకున్నాడు. ఇక వారికి అడ్డుగా మల్లిక నిత్యం ఏదో ఒక నిప్పు పుట్టించాలని ప్లాన్ చేస్తోంది. కానీ ప్రతి సారి మల్లిక ప్లాన్ డిజాస్టర్ అవుతోంది. ఎలా ఆలోచించినా కూడా జ్ఞానాంబ చేతిలో చివాట్లు మాత్రం తప్పడం లేదు.

ఎన్ని సార్లు చెప్పినా కూడా..

ఎన్ని సార్లు చెప్పినా కూడా..

ఇంటి ముందు ఉదయాన్నే సూర్యోదయం అయినా కూడా ముగ్గు కనిపించకపోవడంతో జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. ముగ్గు వేయకుండా మల్లిక ఎక్కడికి వెళ్లిందని జ్ఞానాంబ ఆగ్రహానికి లోనవుతుంది. ఇలా నిర్లక్ష్యం చేయవద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రతిసారి ఇలానే చేస్తుందని ఈసారి అస్సలు వదిలి పెట్టకూడదని ఫిక్స్ అవుతుంది.

నీళ్ల కోసం వెళ్ళాను అంటూ..

నీళ్ల కోసం వెళ్ళాను అంటూ..

దీంతో జ్ఞానాంబ తనే ముగ్గు వేయడానికి రెడీ అవుతుంది. ఇంతలో అక్కడికి మల్లిక భర్త విష్ణు వస్తాడు. నువ్వు వేస్తున్నావేంటి అమ్మా అని అడగడంతో నీ భార్య ఎక్కడికి పెత్తనం చేయడానికి వెళ్లిందని కసురుకుంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన మల్లిక నీళ్ల కోసం వెళ్ళాను అంటూ అబద్ధం చెబుతుండగా ఆ బిందె అప్పుడే కింద పడుతుంది. అందులో నీళ్లు ఉండవు.

నడుము నొప్పి వచ్చేలా

నడుము నొప్పి వచ్చేలా

మల్లికకు బుద్ధి చెప్పాలని జ్ఞానాంబ బలమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి శిక్ష వేయాలని అప్పుడే విష్ణును అడుగుతుంది. ఇక అతను రథం ముగ్గులో తాడు గీత గీయమని అంటాడు. ఇక జ్ఞానాంబ మన స్వీట్ షాప్ వరకు వేయాలని ఆర్డర్ వేస్తుంది. మధ్యలో జానకి వచ్చి మల్లికను కాపాడాలని చూసినప్పటికి వర్కౌట్ కాదు. దీంతో మల్లికకు నడుము నొప్పి వచ్చేలా ఆ శిక్షను అనుభవిస్తుంది.

నేను నేర్పిస్తాను అంటూ

నేను నేర్పిస్తాను అంటూ

ఇక ఇప్పటి నుంచి ఉదయాన్నే ఇంటి ముందు నువ్వే ముగ్గు వేయాలని జ్ఞానాంబ జానకికి వివరిస్తుంది. అయితే ముగ్గు వేయడం రాని జానకి మనసులో కంగారుపడుతూ సరేనని చెబుతుంది. ఇక ఆ ముగ్గును నేర్చుకోవాలని వాకిట్లోకి వచ్చి అత్త వేసిన ముగ్గును గమణిస్తుంటుంది. ఇంతలో రామ వచ్చి భయపడాల్సిన అవసరం లేదని నేను నేర్పిస్తాను అంటూ మరోసారి భరోసా ఇస్తాడు.

100కు డయల్ చేస్తానని బెదిరింపులు

100కు డయల్ చేస్తానని బెదిరింపులు

ఇక జ్ఞానాంబ మనసు గెలుచుకోవాలని ప్లాన్ వేసిన మల్లిక ఇంట్లో గోధుమలన్ని కూడా నేను ఒక్కదాన్నే విసురుతాను అని అంటుంది. దీంతో జ్ఞానాంబ అనుమానం వ్యక్తం చేసినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక వాటిని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లిన మల్లిక భర్త విష్ణు ద్వారా తెలివిగా విసిరిపిస్తుంది. లేకపోతే 100కు డయల్ చేస్తానని బెదిరిస్తుంది.

Recommended Video

Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
రామ మరో పాఠం..

రామ మరో పాఠం..

మరోవైపు జానకి కూడా అత్త చెప్పిన ముగ్గు పనిని సక్రమంగా పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు రామ సహాయం కూడా తీసుకుంటుంది. ఎవరు గుర్తు పెట్టకుండా ఉండాలని రామచంద్ర చీరను ముసుగులా తగిలించుకుని వస్తాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ ఆమె భర్త గోవిందరాజుతో బయటకు వెళ్లాలని అనుకుంటుంది. మరి జానకి, రామ వారి కంట పడతారా లేక ఎప్పటిలానే తప్పించుకుంటారా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X