For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 30th Episode: అత్త ముందు మరో మెట్టు ఎక్కిన జానకి.. మల్లికకు మరో దెబ్బ!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గతంలో కాస్త నిరుత్సాహం తెప్పించినప్పటికీ ప్రస్తుతం ఈ డైలీ సీరియల్ సరికొత్త మలుపులతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తోంది. అన్ని రకాల ఎమోషన్స్ అత్త జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి సిరియల్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక జానకి, రామచంద్ర పాత్రలు కూడా జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తల్లి జ్ఞానాంబకు తెలియకుండా కొడుకు రామచంద్ర తీసుకుంటున్న నిర్ణయాలు కథలో సరికొత్త ట్విస్టులను క్రియేట్ చేస్తోంది.

  భార్యను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని రామచంద్ర తల్లి దగ్గర రోజుకో అబద్ధం చెబుతున్నారు. అబద్దాలు అంటేనే గిట్టని జ్ఞానాంబకు రోజుకొక అబద్ధం చెబుతూ అందరిని షాక్ కు గురి చేస్తుంటారు. జ్ఞానాంబ ప్రతి క్షణం అనుమానాలు వ్యక్తం చేస్తుండం జానకి కూడా కొంత డేంజర్ జోన్ లో పడుతుంది. ఇక అదే సమయంలో ఆమె అత్త మనసును గెలుచుకునే విధంగా కొన్ని ఛాలెంజింగ్ నిర్ణయాలు కూడా తీసుకుంటోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 116వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  గోతులు తొవ్వే ప్రయత్నం

  గోతులు తొవ్వే ప్రయత్నం

  అత్త జ్ఞానాంబ ముందుగా వచ్చిన మల్లిక పై కోపాన్ని చూపిస్తూ.. కొత్తగా వచ్చిన పెద్ద కోడలిపై ప్రేమను ఆప్యాయతలను చూపడంతో సరికొత్త గోడవలు మొదలవుతాయి. అత్త అంటే భయం అంటూనే మరోవైపు నుంచి మల్లిక గోతులు తొవ్వే ప్రయత్నం చేస్తోంది. జానకిని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు నెట్టేసి తన పెత్తనం చూపించాలని అనుకుంటుంది. కానీ ఆమెకు జ్ఞానాంబ పెద్దగా అవకాశం ఇవ్వకుండా చేస్తుంది.

  జ్ఞానాంబ హెచ్చరిక

  జ్ఞానాంబ హెచ్చరిక

  జానకికి సంబంధించిన ప్రతి విషయంలోను ఎదో ఒక ప్లాన్ వేసి ఆమెకు బ్యాడ్ నేమ్ తెప్పించాలని అనుకుంటుంది. ఇక ఇటీవల వెయ్యిమందికి స్వీట్స్ చేసే ఆఫర్ ను అత్తకు నచ్చకపోయినా కూడా ఒప్పుకున్న జానకి తప్పకుండా మనం చేయగలం అని ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. మరో పదిమంది పనివాళ్లను కూడా మాట్లాడిస్తుంది. అయితే ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మొదటికే మోసం వస్తుందని జ్ఞానాంబ ముందే జానకిని హెచ్చరిస్తుంది.

  మల్లిక వేసిన ప్లాన్ రివర్స్

  మల్లిక వేసిన ప్లాన్ రివర్స్

  అయితే జానకి ఒప్పుకున్న ఛాలెంజ్ ను మల్లిక చెడగొట్టాలని అనుకుంటుంది. అందుకే అలా మాట్లాడిన పనివాళ్లను రావద్దని వాళ్లకు ముప్పై వేలు కూడా ఇస్తుంది. కానీ మల్లిక వేసిన ప్లాన్ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అవుతుంది. ఆమె అనుకున్నట్లుగా ఎక్కడా జరగదు. మళ్లీ సమయానికి మరో పది మంది పని వాళ్ళు స్వీట్స్ చేయడానికి వస్తారు ఇక అనుకున్న సమయానికి జానకి 1000 మందికి సరిపడా స్వీట్లు తయారు చేసి ఆర్డర్ చేస్తుంది. దీంతో జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. కేవలం తన గురించి ఆలోచించకుండా కుటుంబం కోసం కూడా ఎంతగానో ఆలోచిస్తోందని మన షాప్ కు ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిందని కూడా పోగొడుతుంది.

  మరో చిచ్చు పెట్టాలని

  మరో చిచ్చు పెట్టాలని

  మల్లికా ఆ మాటలకు మరింత కోపం తెచ్చుకుంటుంది. 30 వేలు పెట్టి ప్లాన్ వేస్తే మొత్తం రివర్స్ అవుతుంది. ఇక మల్లికను కూడా మరోసారి సూటిపోటి మాటలతో జ్ఞానాంబ కౌంటర్ కూడా వేస్తుంది. ఇక జానకి అత్తల మధ్య ప్రేమను మరింత పెరగడంతో ఎలాగైనా మళ్లీ వారి బంధాలు చెడగొట్టాలని చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఉదయమే రాఖీ పండుగ ఉండడంతో నేలమ్మ అందరినీ హాల్ లోకి రమ్మని పిలుస్తుంది. తన అన్నయ్యకు రాఖీ కట్టించాలని అనుకుంటుంది ఇక ఈ క్రమంలో జానకి తన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని బాధపడుతూ ఉంటుంది.

  అన్నయ్య ప్రేమకు వెన్నెల ఎమోషనల్

  అన్నయ్య ప్రేమకు వెన్నెల ఎమోషనల్

  ఎంత పిలిచినా రాకపోవడంతో మళ్ళీ రామచంద్ర వెళ్లి పిలుచుకు వస్తాడు. ఇక వెన్నెల తన ముగ్గురు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతోంది. రామచంద్ర కూడా తన చెల్లెలిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఒక మంచి బహుమతి కూడా ఇస్తాడు. అందుకు వెన్నెల కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఒకవైపు అన్నలా అండగా ఉంటూ మరోవైపు నాన్నలా బాధ్యతగా చూపిస్తావు. అమ్మ లాంటి ప్రేమ కూడా కనిపిస్తుంది అని వెన్నెల కంటతడి పెట్టుకుంది.

  మరోసారి తప్పు చేసిన మల్లిక

  మరోసారి తప్పు చేసిన మల్లిక

  ఇక అదే సమయంలో రెండవ అన్నయ్య విష్ణుకు కూడా రాఖీ కట్టాలని వెళుతుంది. అయితే అప్పుడే మల్లికా విష్ణుకి చెవిలో ఒక విషయాన్ని చెబుతుంది. మీ అన్నయ తరహాలో ఖరీదైన కనుక ఇవ్వకండి అంటూ 100 లేదా 50 రూపాయలు చేతిలో పెట్టాలని సలహం ఇస్తుంది. అయినప్పటికీ విష్ణు తన జేబులో డబ్బులు తీస్తుండగా అప్పుడే వచ్చిన మల్లిక తన చీర కొంగు లో ఉన్న 50 రూపాయలు ఇవ్వాలి అని అంటుంది. ఇక మల్లికా తీరుపై జ్ఞానాంబ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి మల్లిక చేసిన పనికి ఇంట్లో వారు ఏ విధంగా స్పందిస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  అన్నయ్య కోసం జానకి ఆలోచన

  అన్నయ్య కోసం జానకి ఆలోచన

  అయితే జానకి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టాలని అనుకుంటుంది. కానీ అతను అమెరికాలో ఉండడంతో బాధపడుతుంది. దగ్గరలో అన్నయ్యలు ఎవరు లేకపోవడం వలన ఆమె కొంత బాధ కలుగుతుందని రామచంద్రం కూడా అర్థమవుతుంది. మరోవైపు మల్లిక తన మాటలతో మరింత బాధకు గురి చేస్తుంది. ఈ క్రమంలో లో వెంటనే రామచంద్ర కలుగజేసుకుని జానకి గారు తన అన్నయ్యకు రాఖీ ఎప్పుడో కట్టారు అని చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రామచంద్ర ఎందుకు ఆ మాట అన్నాడు అని తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 116
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X