For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 31st Episode: మరోసారి ముద్దు పెట్టి షాక్ ఇచ్చిన జానకి.. న్యూ లవ్ స్టోరీ స్టార్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మెల్లమెల్లగా అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. రెగ్యులర్ అత్త కోడళ్ల గొడవలు మాత్రమే కాకుండా రామ, జానకి మధ్యలో వస్తున్న క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో కంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. మొదట్లో ఈ సీరియల్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. రాశి రీ ఎంట్రీ అనుకున్నంతగా లేదని కూడా అన్నారు. అయితే 50 ఎపిసోడ్స్ అనంతరం సీరియల్ కాన్సెప్ట్ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యింది.

  యువతకు కూడా నచ్చే విధంగా అందమైన ప్రేమ సన్నివేశాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ డైలీ సీరియల్ సరికొత్త మలుపులతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తోంది. అన్ని రకాల ఎమోషన్స్ అత్త జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి సిరియల్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 116వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

   ప్రతి క్షణం ఒక అనుమానం

  ప్రతి క్షణం ఒక అనుమానం

  జ్ఞానాంబకు తెలియకుండా ఆమె కొడుకు రామచంద్ర తీసుకుంటున్న నిర్ణయాలు కథలో సరికొత్త ట్విస్టులను క్రియేట్ చేస్తున్నాయి. తన భార్య జానకిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని రామచంద్ర రోజుకో అబద్ధం చెబుతున్నారు. చదువు పూర్తయ్యే వరకు ఇంట్లో ఎవరికీ చెప్పకూడాదని రామచంద్ర ప్లాన్ వేస్తాడు. ఇక అబద్దాలు అంటేనే గిట్టని జ్ఞానాంబకు రోజుకొక అబద్ధం చెప్పాల్సి వస్తోంది. జ్ఞానాంబ ప్రతి క్షణం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుండం డేంజర్ జోన్ లో పడుతుంది. అదే సమయంలో ఆమె అత్త మనసును గెలుచుకునే విధంగా కొన్ని ఛాలెంజింగ్ నిర్ణయాలు కూడా తీసుకుంటోంది.

  రాఖీ సందర్భంగా..

  రాఖీ సందర్భంగా..

  రాఖీ పండుగ సందర్భంగా జ్ఞానాంబ అందరినీ హాల్ లోకి రమ్మని పిలుస్తుంది. వెన్నెలతో అన్నయ్యలకు రాఖీ కట్టించాలని అనుకుంటుంది. అయితే ఇక ఈ క్రమంలో జానకి తన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని బాధపడుతూ ఉంటుంది. జానకిని పిలిచినా రాకపోవడంతో మళ్ళీ రామచంద్ర వెళ్లి పిలుచుకు వస్తాడు. వెన్నెల తన ముగ్గురు అన్నయ్యకు రాఖీ కడుతుంది. రామచంద్ర మంచి బహుమతి కూడా ఇస్తాడు. ఇక అదే సమయంలో రెండవ అన్నయ్య విష్ణుకు కూడా రాఖీ కట్టాలని వెళుతుంది. ఇక మల్లికా విష్ణుకి తన చీర కొంగు లో ఉన్న 50 రూపాయలు ఇవ్వాలి అని అంటుంది. ఆ డబ్బులు తీసుకున్న వెన్నెల నాకు నీ నుంచి ఏమి వద్దు నువ్వు సంతోషంగా ఉంటే చాలని అంటుంది.

  జానకి ఎమోషనల్

  జానకి ఎమోషనల్

  ఇక మల్లిక తన పుట్టింటికి వెళ్లాలని అనుకుంటుంది. తన తమ్ముడికి రాఖీ కట్టాలని జ్ఞానాంబ అనుమతి కోసం వెళుతుంది. కానీ జ్ఞానాంబ మల్లిక తమ్ముడిని ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక అప్పుడే మల్లిక తమ్ముడు ఇంటికి వచ్చి అందరిని ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. ఇక మల్లిక తన తమ్ముడికి రాఖీ కడుతుంటే. అయితే జానకి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టాలని అనుకుంటుంది. కానీ అతను అమెరికాలో ఉండడంతో బాధపడుతుంది. దగ్గరలో అన్నయ్యలు ఎవరు లేకపోవడం వలన ఆమె కొంత బాధ కలుగుతుందని రామచంద్రం కూడా అర్థమవుతుంది.

  ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర

  ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర

  ఇక మరోవైపు మల్లిక జానకిని తన సూటి పోటీ మాటలతో మరింత బాధకు గురి చేస్తుంది. జ్ఞానాంబ అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ తొడి కోడలికి ధైర్యం చెబుతున్నట్లు అంటుంది. వెంటనే రామచంద్ర కలుగజేసుకుని జానకి గారు తన అన్నయ్యకు రాఖీ కట్టారు అని చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అదెలా అని అందరూ ఆశ్చర్యపోతున్న సందర్భంలో వెంటనే అమెరికాలో ఉన్న జానకి అన్నయ్యకు రామచంద్ర వీడియో కాల్ చేస్తాడు. జానకి పంపినట్లుగా రామచంద్ర అమెరికాకు రాఖీలు పంపడంతో వాళ్ళు ఎంతగానో సంతోషంగా ఉంటారు. జానకి అన్నయ్య వదిన కూడా ఎమోషనల్ అవుతారు.

  మరొక కొత్త లవ్ స్టొరీ

  మరొక కొత్త లవ్ స్టొరీ

  ఇక మరో వైపు జానకి కలగనలేదు సీరియల్ లో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ కాబోతున్నట్లు అర్థమవుతోంది. మల్లిక తమ్ముడు, అలాగే వెన్నెల మధ్యలో ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. వెన్నెల తన బావ తో సరదాగా సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు అని కూడా అడుగుతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక మా తమ్ముడికి కోటి రూపాయల కట్నం ఇచ్చే అమ్మాయిని చూస్తాను అని అంటుంది. కట్నం తీసుకోవడం తప్పని చెప్పిన కూడా అలాంటి విషయం గురించి మల్లిక లెక్కచేయదు.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  ముద్దు పెట్టిన జానకి

  ముద్దు పెట్టిన జానకి

  ఇక మరోవైపు రామచంద్ర షాపులో బేరాలు ఆడుతుండగా ఇప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన జానకి ముద్దు పెడుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు భార్య పెట్టిన ముద్దు మత్తులో కొంతసేపటి వరకు కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక ఎందుకు అని అడగ్గానే జానకి కొంత ఎమోషనల్ అవుతుంది. తన అన్నయ్య కు రాఖీ పంపిన విషయం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంటుంది.

  మళ్ళీ మా అన్నయ్య నాతో మాట్లాడడేమో అనుకున్నాను. కానీ మీ వల్ల మళ్ళీ ఇది సాధ్యమైంది అంటూ వివరణ ఇస్తుంది.ఇక మరోవైపు ప్రత్యేకమైన పూజ కోసం కుటుంబ సభ్యులంతా కలిసి ట్రాక్టర్ లో వెళ్తారు. ట్రాక్టర్ ను గోవిందరాజులు నడుపుతుండగా పక్కనే జ్ఞానాంబ కూర్చుంటుంది. వెనకాల కుటుంబ సభ్యులంతా కూడా ఉంటారు. చూస్తుంటే మరో పండగ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వాతావరణంలో జానకి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 117
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X