For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 31st: అఖిల్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన జెస్సి.. జానకి అనుమానాలు

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 378 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో జెస్సి ఎంట్రీ

  కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో జెస్సి ఎంట్రీ

  మల్లిక తల్లి కావడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అంతే కాకుండా ఈసారి కృష్ణాష్టమిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని జ్ఞానాంబ చెప్పడంతో గోవిందరాజులు కూడా అందుకు ఒప్పుకుంటాడు. చుట్టుపక్కల వారిని కూడా పిలిచి భోజనాలు పెట్టించాలని అనుకుంటారు. ప్రత్యేకంగా కోలాటం ఆడే ఏర్పాట్లు చేస్తారు. ఇక ఉట్టి కొట్టడం అఖిల్ కు కూడా సాధ్యం కాకపోవడంతో చివరికి రామచంద్ర అతనికి సహాయం చేస్తాడు. తన భుజాలపై తమ్ముడిని ఎక్కించుకొని ఉట్టిని కొట్టేలా చేస్తాడు. ఇక అదే సమయంలో అక్కడికి ఆటోలో జెస్సి వస్తుంది.

  జానకి అనుమానం

  జానకి అనుమానం

  అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో అఖిల్ ప్రేమించిన అమ్మాయి జెస్సి గర్భవతి అవుతుంది. అఖిల్ కి నిజం చెప్పాలని జెస్సి అక్కడికి వస్తుంది. ఇక అఖిల్ హఠాత్తుగా ఆమెను అక్కడి నుంచి ఇంటి వెనకాల వైపుకు తీసుకువెళ్తాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను నిన్ను తర్వాత కలుస్తాను అని అంటాడు. అయితే ఆ తర్వాత జెస్సి గర్భవతి అయ్యాను అని చెబుతుంది. దీంతో ఒక్కసారి అఖిల్ మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే కిటికీలోనుంచి జానకి చూస్తుంది. ఇక జెస్సి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని వాళ్ళిద్దరూ ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు అని అనుమానిస్తుంది.

  మళ్ళీ అఖిల్ అబద్ధాలు

  మళ్ళీ అఖిల్ అబద్ధాలు

  ఇక అఖిల్ ఆ సమయంలో చాలా టెన్షన్ గా ఉన్నట్లుగా జానకి గమనిస్తుంది. ఇక అఖిల్ జెస్సి మధ్యలో ఏం జరిగిందని వీలైనంత తొందరగా ఆ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక అఖిల్ టెన్షన్ పడుతూ బయట హడావిడిగా తిరిగుతూ ఉండడంతో జానకి అడుగుతుంది. కానీ అఖిల్ మాత్రం అసలు విషయం చెప్పడు.

  జెస్సి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. కానీ అందుకు అఖిల్ ఆమె ఎదో తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి నన్ను క్యాజువల్ గా కలిసింది అని మరో అబద్ధం చెబుతాడు. ఇక జానకి మరింత అనుమానిస్తుంది. అఖిల్ ను అంత ఈజీగా నమ్మడానికి వీలు లేదని వెంటనే అతని బెడ్ రూమ్ ని చెక్ చేస్తుంది. అఖిల్ చేడు దారులు తిరగకుండా ఉండాలి అని అత్త మామ అలాగే రామగారు అతని మీదే ఆశలు పెట్టుకున్నారు కాబట్టి అఖిల్ ని మంచి దారిలో పెట్టాలని జానకి ఆలోచిస్తుంది.

  జానకి కండిషన్

  జానకి కండిషన్

  ఇక ఆ తరువాత అఖిల్ బుక్స్ తీస్తుండగా అప్పుడే గదికి అఖిల్ వస్తాడు. జానకి వదిన తన గదికి ఎందుకు వచ్చిందో అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఒక పుస్తకంలో జెస్సితో దిగిన ఫొటోలు ఉంటాయి. అవి వదిన చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

  ఇక జానకి పుస్తకాలు తీస్తూ ఉండడంతో అప్పుడే అఖిల్ వచ్చి దాన్ని తీసుకుంటాడు. నా మీద నమ్మకం లేదా అంటూ జానకిని అడుగుతాడు. ఇక జానకి నువ్వు ఇక నుంచి నేను చెప్పిన టైమ్ టేబుల్ ఫాలో కావాలి అని ఏం చదువుతున్నావో కూడా నాకు తెలియాలి అని జానకి హెచ్చరిక చేస్తుంది. ఇక అందుకు అఖిల్ సరే అని ఒప్పుకుంటాడు.

  ఫొటోలు చూడాలని..

  ఫొటోలు చూడాలని..

  ఇక మరోవైపు జెస్సి టెన్షన్ పడుతూ ఉంటుంది. నీకు కడుపు ఎవరి వల్ల వచ్చిందో చెప్పాలి అంటూ ఒత్తిడి చేస్తుంటారు. ఇక జెస్సితో ఫోన్ మాట్లాడాలని అఖిల్ అనుకుంటాడు. అదే సమయంలో బయటకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటున్న క్రమంలో తండ్రి గోవిందరాజులు పిలుస్తాడు. కృష్ణాష్టమి ఫొటోలు నువ్వే తీశావు కదా ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు చూడాలి అని అంటారు. పక్కనే తల్లి జ్ఞానాంబ కూడా ఉంటుంది. ఇక అఖిల్ కొంచెం పని ఉందని చెప్పినప్పటికీ గోవిందరాజులు ఇవ్వమని అంటాడు. ఇక అఖిల్ టెన్షన్ పెడుతున్నట్లు జానకి గమణిస్తుంది.

  జెస్సి ఫోన్ కాల్స్

  జెస్సి ఫోన్ కాల్స్

  ఇక అఖిల్ ఫోన్ లో కుటుంబ సభ్యులందరు కూడా ఫొటోలు చూస్తూ నవ్వుకుంటున్న సమయంలో జెస్సి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే అఖిల్ ఫోన్ హఠాత్తుగా తీసుకుని ఫ్రెండ్ అని అంటారు. ఇక మళ్ళీ మళ్ళీ జెస్సి ఫోన్ చేయడంతో ఎవరు అని జ్ఞానాంబ గట్టిగా అడుగుతుంది. సినిమాకు రమ్మని నా ఫ్రెండ్ జాషువా ఫోన్ చేస్తున్నట్లు ఆకుల అబద్ధం చెబుతాడు. చదువుకోకుండా సినిమా ఏమిటని జ్ఞానాంబ అనడంతో అఖిల్ బయపడతాడు. నేను మాట్లాడతాను అంటూ జ్ఞానాంబ ఫోన్ తీసుకోగానే ఫోన్ కట్ అవుతుంది. ఇక ఆ తరువాత జెస్సి వాయిస్ రికార్డ్ పంపుతుంది. ఇక ఫొటోలు చూసిన తరువాత గోవిందరాజులు ఫోన్ ఇచ్చేస్తాడు.

  అఖిల్ ను దారిలో పెట్టాలని..

  అఖిల్ ను దారిలో పెట్టాలని..

  ఇక ఆ తరువాత అఖిల్ ఒక చాటుకు వెళ్లి జెస్సికి కాల్ చేస్తాడు. మనం రేపు కలుద్దాం. ఒక సొల్యూషన్ ఆలోచించాను అని రేపు మనం ఎప్పుడు కలుసుకునే చోటికి రావాలని అంటాడు. ఇక జెస్సి ఓకే అంటుంది. ఇక ఉదయం బైక్ అవసరం కావడంతో తన అన్న రామచంద్రను అఖిల్ బైక్ అడుగుతాడు. ఇక జానకి కూడా పక్కనే ఉంటుంది. ఫ్రెండ్ ఇంటికి కంబైడ్ స్టడీస్ కోసం వెళ్ళాలి అని అఖిల్ అబద్ధం చెబుతున్నట్లు జానకి అనుమనిస్తుంది. ఇక ఆ తరువాత అఖిల్ బైక్ ఏమి వద్దులే అంటూ అలిగి ఇంట్లోకి వెళుతున్న సమయంలో మళ్ళీ రామ పిలిచి బైక్ ఇస్తాడు. ఇక ఆ తరువాత రామ తన తమ్ముడిని నమ్ముతూ ఉండడంతో జానకి ఎలాగైనా అఖిల్ ను దారిలో పెట్టాలని అనుకుంటుంది. మరి అఖిల్ , జెస్సి ట్రాక్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 378
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X