For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 3rd Episode: జ్ఞానాంబ దెబ్బకు బిల్డప్ కొట్టి బోల్తా పడిన మల్లిక.. జానకి ఎమోషనల్!

  |

  జానకి కలగనలేదు సిరియల్ కథ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. మల్లిక vs జ్ఞానాంబ సీన్స్ అయితే నవ్వుతో పాటు న్యూ ట్విస్టులను కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఎక్కడా కథ స్లో అవ్వకుండా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ట్విస్టులను వాడుకుంటూ సీరియల్ ను నడిపిస్తున్నారు. జానకి ఐపీఎస్ చదువు కోసం ఇప్పటికే రామ తీసుకున్న నిర్ణయం రోజురోజుకు మరింత ఉత్కంఠను కలిగిస్తోంది.

  జానకి , రామ లవ్ సీన్స్ కు నేటితరం యువత కూడా ఫిదా అవుతోంది. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరికకు మొదటి అడుగు పడింది. ఇక జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 97వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  వారికి అడ్డుగా మల్లిక

  వారికి అడ్డుగా మల్లిక

  జనాకిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని భర్త రామచంద్ర ఇటీవల కావాల్సిన పుస్తకాలను కూడా తీసుకున్నాడు. అడ్డుగా ఉన్న మల్లిక నిత్యం ఏదో ఒక చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. కానీ ఎప్పటిలానే మల్లిక ప్లాన్ డిజాస్టర్ అవుతోంది. ఇక జానకి చేతిలో చెంపదెబ్బ తిన్న కన్నబాబు కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది ఆసక్తిగా మారింది.

  ఎక్కడికి వెళ్లిందని..

  ఎక్కడికి వెళ్లిందని..

  ఉదయాన్నే సూర్యోదయం అయినా కూడా ముగ్గు కనిపించకపోవడంతో జ్ఞానాంబ మల్లికపై అసహనం వ్యక్తం చేస్తుంది. మల్లిక ఎక్కడికి వెళ్లిందని ఆగ్రహానికి లోనవుతూ ఈసారి ఎలాగైనా ఇలా నిర్లక్ష్యం చేయవద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రతిసారి ఇలానే చేస్తుందని బుద్ధి వచ్చేలా శిక్ష వేస్తుంది.

  నడుము నొప్పి వచ్చేలా శిక్ష

  నడుము నొప్పి వచ్చేలా శిక్ష

  మన స్వీట్ షాప్ వరకు రథం ముగ్గుకు గీత గీయమని చెబుతుంది. జానకి వచ్చి మల్లికను కాపాడాలని చూసినప్పటికి జ్ఞానాంబ ఒప్పుకోదు. ఇక చేసేదేమీ లేక మల్లికకు నడుము నొప్పి వచ్చేలా ఆ శిక్షను అనుభవిస్తుంది. అనంతరం మళ్ళీ అత్త దగ్గర మార్కులు కొట్టేయాలని గోధుమలన్ని కూడా నేను ఒక్కదాన్నే విసురుతాను అని అంటుంది.

  గృహహింస కేసు పెడతానని

  గృహహింస కేసు పెడతానని

  బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లిన మల్లిక తన భర్త విష్ణు ద్వారా ప్లాన్ చేసి విసిరిపిస్తుంది. ఆ పని చేయకపోతే 100కు డయల్ చేసి గృహహింస కేసు పెడతానని అంటుంది. దీంతో చేసేదేమీ లేక విష్ణు వాటిని విసురుతాడు. మరోవైపు జానకి కూడా అత్త చెప్పిన ముగ్గు పనిని ఉదయాన్నే పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు రామ సహాయం చేస్తాడు.

  చీరలో రామ కొత్త వేషం

  చీరలో రామ కొత్త వేషం

  ఎవరు గుర్తు పట్టకుండా ఉండాలని రామ చీరను ముసుగులా తగిలించుకుని వస్తాడు. అయితే అదే సమయంలో జ్ఞానాంబ ఆమె భర్త గోవిందరాజుతో వాకింగ్ కు వెళ్లాలని అనుకుంటుంది. ఇక బయటకు రాగానే జానకి రామ వారి కంట పడతారు. అప్పుడు రామ గొంతు మార్చేసి తాను పక్కింట్లో ఉండే అమ్మాయిని అంటూ తెలివిగా తప్పించుకుంటాడు.

  జానకి వెనక దాక్కున్న రామ

  జానకి వెనక దాక్కున్న రామ

  ఇక అదే సమయంలో చికిత్త తిట్టుకుంటూ బయటకు వస్తుంది. నా చీరను ఎవర్రో దొంగతనం చేశారు అంటూ బాధపడుతుంది. ఇక రామ భయంతో జానకి వెనుక దాక్కుంటాడు. ఆ చీరను చూసి చికిత్త ఇది తనదే అంటూ విప్పేయ్ అని వెంబడి పడుతుంది. ఇక ఆ చీరను వెంటనే విప్పేయడంతో రామ ఉంటాడు. ఇక సరదాగా నవ్వుకున్న చికిత్త నాకు విషయం అర్ధమయ్యింది అంటూ నవ్వుకుంటుంది.

   బిల్డప్ కొట్టి బోల్తా పడిన మల్లిక

  బిల్డప్ కొట్టి బోల్తా పడిన మల్లిక

  ఇక భర్త చేత తెల్లవారుజామున పిండి విసిరించిన మల్లిక ఆ పని తనే చేసినట్లు బిల్డప్ కొడుతుంది. ఆ విషయాన్ని జ్ఞానాంబకు కూడా చెబుతుంది. అయితే ఆ విషయాన్ని జ్ఞానాంబ నమ్మదు. అంత తొందరగా చేశావు అంటే రేపు మరో బియ్యం గోధుమలను తెస్తే ఈజీగా నా ముందే చేద్దువు అంటూ కౌంటర్ ఇస్తుంది. అందుకు గోవిందరాజు ఆమెను చూసి నవ్వుతాడు.

  జానకిపై ఆషాఢమాసం ఎఫెక్ట్

  జానకిపై ఆషాఢమాసం ఎఫెక్ట్

  ఇక ఇంటికి వచ్చిన లీలావతి జానకిని చూసి ఇంకా ఇక్కడే ఉన్నావు ఏమిటి అని ప్రశ్నిస్తుంది. అయితే అందుకు జ్ఞానాంబ ఆశ్చర్యపోయి మా ఇంట్లో ఉండకుంటే జానకి ఇంకెక్కడా ఉంటుంది. మీ ఇంట్లో ఉంటుందా అని సమాధానం చెబుతుంది. ఇక అందుకు లీలావతి ఆషాఢమాసంలో కొత్త కోడలు ఇంట్లో ఉండకూడదు కదా అంటూ పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే ఉంది ఏమిటని అడుగుతుంది.

  జ్ఞానాంబ ఏ విధంగా ఆలోచిస్తుందో..,

  జ్ఞానాంబ ఏ విధంగా ఆలోచిస్తుందో..,

  జానకి తల్లిదండ్రుల మరణం తరువాత అన్నయ్య అమెరికా ప్రయాణంతో ఒంటరైన జానకి అన్ని తన భర్తే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక ఆ క్రమంలో లీలావతి ఆషాఢమాసం గుర్తు చేయడంతో జానకి కూడా మరోసారి ఆలోచనలో పడుతుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. అలాగే జానకి కూడా మరోసారి ఎమోషనల్ అయ్యే వాతావరణం క్రియేట్ అయ్యింది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

  #JrNTRBirthday : అందరం కలిసి వేడుక చేసుకుందాం.. NTR Request To Fans || Filmibeat Telugu

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 97
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X