Janaki Kalaganaledu August 4 Episode: లీలావతి పెట్టిన చిచ్చుకు.. కన్నీళ్ళతో సమాధానం ఇచ్చిన జానకి

జానకి కలగనలేదు సిరియల్ కథ రోజుకొక ఎమోషన్ తో సరికొత్త మలుపు తిరుగుతోంది. మల్లిక వలన జ్ఞానాంబ వేస్తున్న శిక్షలు అయితే నవ్వుతో పాటు న్యూ ట్విస్టులను కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ట్విస్టులతో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్న ఈ సిరియల్ లో అసలు కథ అయితే ట్రాక్ లోకి వచ్చింది. జానకి ఐపీఎస్ చదువు కోసం రామ తీసుకున్న నిర్ణయం ఎక్కడ లీక్ అవుతుందనే విషయం మరింత ఉత్కంఠను కలిగిస్తోంది.

అందమైన లవ్ సీన్స్ కు నేటితరం యువత కూడా ఫిదా అవుతోంది. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరికకు మొదటి అడుగు పడింది. ఇక జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 98వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఎవరికి తెలియకుండా

ఎవరికి తెలియకుండా

జనాకి ఐపీఎస్ చదువు కోసం రామచంద్ర చాలానే కష్టపడుతున్నాడు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు అనేక రకాల అబద్ధాలు చెబుతున్నాడు. మరోవైపు జానకి కాస్త భయంతో ఉన్నప్పటికీ భర్త మాట ప్రకారం చదువు కోసం కృషి చేస్తోంది. మరోవైపు మల్లిక ఎదో గుట్టు దాగి ఉందని రోజుకో అనుమానం వ్యక్తం చేస్తుంది. అలాగే జానకి పై ఎంతో కోపంతో ఉన్న కన్నబాబు కూడా ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసాడు. దీంతో ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురవుతాయో అని జానకి కూడా ఆందోళన చెందుతుంది.

శత విధాలుగా ప్రయత్నాలు

శత విధాలుగా ప్రయత్నాలు

జానకి , జ్ఞానాంబల చిచ్చు పెట్టాలని చిన్న కోడలు మల్లిక శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది మల్లిక ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా చివరికి అవి రివర్స్ అవ్వడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది జానకి చదువు గురించి తెలుసుకోవాలని ఇటీవల తన స్నేహితురాలు సహాయం కోరిన మల్లిక ఊహించని విధంగా చిక్కుల్లో పడుతుంది. ఇంటిముందు సూర్యోదయం కాకముందే ముగ్గు వేయాలన్న సంగతి మరచి పోవడంతో అత్త ద్వారా శిక్షణ అనుభవిస్తుంది. ఇంటి దగ్గర నుంచి స్వీట్ షాప్ వరకు ముగ్గు గీత గీయాలని చెప్పడంతో మల్లిక చేసేదేమీలేక ఆ శిక్షను అనుభవిస్తూనే జానకి పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది.

లీలావతి గోరింటాకు కండిషన్

లీలావతి గోరింటాకు కండిషన్

ఇక ఉదయం అందరూ ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా పనిమనిషి చికిత్త వచ్చి తన పెళ్లికి సంబంధించిన జోకులతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే లీలావతి జ్ఞానంబ ఇంటికి వస్తుంది. బుట్ట నిండా మా పెరట్లో కాచిన గోరింటాకు అంటూ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఈ క్రమంలో గోవిందరాజులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తాడు ఏదో అవసరం ఉంటే ఇక్కడికి రావు కదా అంటూ డైలాగ్స్ వదులుతాడు.

ఐదు వేల రూపాయలు ఇవ్వాలని

ఐదు వేల రూపాయలు ఇవ్వాలని

ఇక మాటల్లో పడుతూ మెల్లగా లీలావతి చేతి బదులుగా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని జ్ఞానాంబను అడుగుతుంది. ఇక గోవిందరాజులు అప్పుడే అనుకున్నాను అంటూ మరో పంచ్ వేస్తాడు. ఇక జ్ఞానాంబ ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతూ రామ దగ్గర ఉన్న ఐదువేల రూపాయలను లీలావతి అందజేస్తుంది. ఇక ఆ టైమ్ లో కాఫీ ఇవ్వడానికి వచ్చిన జానకి ని చూసిన లీలావతి ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటని ప్రశ్నిస్తుంది.

అత్తకు మంచిది కాదు

అత్తకు మంచిది కాదు

ఆ మాటలకు జ్ఞానాంబ నా కోడలు నా దగ్గర ఉండకపోతే మీ ఇంట్లో ఉంటుందా అని సెటైర్ వేస్తుంది. అందుకు లీలావతి ఇప్పుడు ఆషాడమాసం కదా అంటూ కొత్త కోడలు ఇంట్లో ఉంటే అత్త కు మంచిది కాదు కదా అని అడుగుతున్నట్లు చెబుతుంది. అందుకు జానకి తనకు అమ్మానాన్న లేరు అని, అన్నయ్య కూడా అమెరికా వెళ్ళిపోయాడు అని వివరణ ఇస్తుంది.

జ్ఞానాంబ అసహనం..

జ్ఞానాంబ అసహనం..

ఇక లీలావతి మాటలకు జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. అలాంటి ఆచారాలను ఎలా పాటించాలో తనకు బాగా తెలుసని కూడా సమాధానం ఇస్తుంది. జానకికి ఇదే పుట్టినిల్లు ఇదే అత్తగారిల్లు అని ప్రేమను కూడా చూపిస్తుంది. దీంతో జానకి సైతం ఎమోషనల్ అవుతూ లీలావతి ప్రశ్నలకు అడ్డుకట్ట వేస్తుంది. ఇంట్లో నాకు అమ్మ ప్రేమకు కొదవలేదని చెప్పడంతో L అందరూ ఎమోషనల్ అవుతారు.

అందరికీ గోరింటాకు పెట్టాలని

అందరికీ గోరింటాకు పెట్టాలని

ఇక మాటలకు లీలావతి ఇంటి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఆషాడ మాసం సందర్భంగా అందరికీ గోరింటాకు పెట్టాలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ముందుగా జానకికి గోరింటాకు పెట్టడం తో మల్లిక కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. ముందు వచ్చిన కోడలు నేను. నాకు కాకుండా జానకికి గోరింటాకు పెట్టడం ఏమాత్రం నచ్చలేదని భర్తతో చెబుతుంది. అనంతరం అందరికీ గోరింటాకు పెట్టడం తో జ్ఞానాంబకు మాత్రం నేను పెడతాను ఉండు భర్త గోవిందరాజులు ముందుకు వస్తాడు.

Recommended Video

Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
మరోసారి అత్త కోపానికి గురైన జానకి

మరోసారి అత్త కోపానికి గురైన జానకి

జ్ఞానాంబను చూసి గోవిందరాజులు సరదాగా పాటలు కూడా పడుతుంటాడు. ఇక ఉదయాన జ్ఞానాంబ చెప్పులు తెగిపోవడంతో కుట్టించుకురమ్మని విష్ణుతో చెబుతుంది. అందుకు మల్లిక అడ్డుపడి మేము గుడికి వెళుతున్నాము అంటూ తప్పించుకుంటుంది. వెంటనే రామ తల్లి చెప్పులు తీసుకుని నేను కుట్టిస్తాను అని అని చెబుతాడు. అనంతరం రామ వెళుతుండగా జానకి ఆ చెప్పులను తీసుకుని, నేనే కుట్టిస్తాను అని చెబుతోంది. అయితే ఆ చెప్పులను సరిగ్గా కుట్టించలేదని తెలుసుకున్న జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తోంది. కోడళ్ల చేత ఇలాంటి పనులు చేయించుకోవడం నాకు నచ్చదు అంటూ జానకి పై కోపానికి గురవుతుంది. ఇక ఈ గొడవతో ఆలోచనలు ఏవిధంగా మారుతాయో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X