For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 5th Episode: జానకికి శిక్ష వేసిన జ్ఞానాంబ.. మల్లిక గుట్టుతో న్యూ ట్విస్ట్ మొదలైంది!

  |

  జానకి కలగనలేదు సిరియల్ వంద ఎపిసోడ్స్ కు దగ్గరవుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎమోషన్స్ తో సరికొత్త మలుపులు తిరుగుతోంది. మల్లికకు బుద్ధి వచ్చేలా జ్ఞానాంబ అమలు చేస్తున్న శిక్షలకు సరికొత్త కామెడీని క్రియేట్ చేస్తున్నాయి. న్యూ ట్విస్టులతో ప్రస్తుతం జానకి ఆలోచనలు కూడా తారుమరవుతున్నాయి. రక అసలు కథ అయితే ట్రాక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. భార్య ఐపీఎస్ చదువు కోసం ఒక భర్త తీసుకునే నిర్ణయం ఎలాంటి మలుపులు తిప్పుతాయనేది ఆసక్తిని కలిగిస్తోంది.

  క్యూట్ లవ్ సీన్స్ కు నేటితరం యువత కూడా ఫిదా అవుతోంది. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరికకు మొదటి అడుగు పడింది. ఇక జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 99వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  ఎవరికి తెలియకుండా

  ఎవరికి తెలియకుండా

  జానకి ఐపీఎస్ చదువు కోసం రామా చేస్తున్న కృషికి మధ్య మధ్యలో ఏదో ఒక ఆటంకం కలుగుతోంది. ఒకవైపు తల్లికి అబద్ధం చెబుతాడు. మరోవైపు భార్య ఆనందం కోసం చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడు ఒక విధంగా రామచంద్ర తల్లిని మోసం చేస్తున్నారని చాలాసార్లు జానకి చెప్పినప్పటికీ మంచి పని కోసం ఈ పని చేయక తప్పడం లేదని సర్ది చెప్పుకుంటాడు.

  జానకి మనసులో మాత్రం అతను మోసం చేస్తున్నామని ఆలోచనలు నిత్యం భయపడుతూనే ఉంటాయి. జ్ఞానాంబ కూడా జానకి ఏమి చెప్పినా సులువుగా నమ్మెస్తుంది.

  జ్ఞానాంబ మనసులో అలజడి

  జ్ఞానాంబ మనసులో అలజడి

  ఇటీవల లీలావతి ఇంటికి వచ్చి జానకి విషయంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆషాడ మాసం లో కొత్త కోడలు ఇంట్లో ఉండకూడదు కదా అంటూ జ్ఞానాంబ మనసులో అలజడి చేయాలని ఆడుకుంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం నీలావతి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆచారాలు ఎలా పాటించాలో కూడా నాకు తెలుసు అని కౌంటర్ ఇస్తుంది.

  అలాంటి ఆచారాలు తల్లిదండ్రుల కోసం పెట్టుకున్నారని ప్రస్తుతం జానకి కి పుట్టినిల్లు అయిన అత్తగారిల్లు అయినా ఇదేనని మరో పదునైన సమాధానం ఇస్తుంది.

  సొంత కూతురిలా

  సొంత కూతురిలా

  దీంతో లీలావతి చెప్పేదేమీ లేక నీ మంచి కోసమే అన్నాను అంటూ అక్కడి నుంచి జారుకుంటుంది. ఆషాడ మాసం సందర్భంగా జ్ఞానాంబ ఇంట్లో ఆడపిల్లలు అందరికీ గోరింటాకు పెడుతుంది. ఆఖరికి పనిమనిషికి కూడా సొంత కూతురిలా గోరింటాకు పెడుతుంది ఇంకా జానకి అత్త ప్రేమను చూసి ఎమోషనల్ అవుతుంది. నీలాంటి అత్త దొరికినందుకు చాలా అదృష్టవంతురాలుని అంటూ కంటతడి పెట్టుకుంటుంది.

  అత్త చెప్పుల బాధ్యత

  అత్త చెప్పుల బాధ్యత

  ఉదయాన్నే జ్ఞానాంబ చెప్పులు తెగిపోవడంతో వాటిని కుట్టించుకుని రమ్మని విష్ణుకు చెబుతుంది. అయితే ఆ సమయంలో మల్లిక భర్తను తీసుకుని బయటకు వెళ్లాలని అనుకుంటుంది. గుడికి వెళుతున్నాము అని చెప్పి అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది. అనంతరం రామచంద్ర వచ్చి నేను కుట్టించుకొని వస్తానని అంటాడు. అయితే కూరగాయలకు వెలుతున్న జానకి అత్త చెప్పులను తాను కుట్టించుకుని వస్తానని చెబుతుంది. ఇక రామ కూడా బలవంతంగానే ఒప్పుకుంటాడు.

  మల్లిక గుట్టు తెలుడుకున్న జానకి

  మల్లిక గుట్టు తెలుడుకున్న జానకి

  ఇక జానకి కూరగాయలకు వెళుతున్న సమయంలో మల్లిక విష్ణు ఒక చోట ఆగడం చూస్తుంది. ఇద్దరూ ఒక ఇంట్లోకి వెళ్లి వడ్డీలకు అప్పులు ఇస్తున్న విషయాన్ని జానకి పసిగడుతుంది. ఇంతకుముందు ఇవ్వటమే కాకుండా ఇప్పుడు కూడా ఇచ్చామని అందుకు నోటీస్ కూడా రాయించి తీసుకుంటుంది. కిటికీ చాటునుంచి ఆ విషయాన్ని చూసిన జానకి సందిగ్ధంలో పడుతుంది.ఆ విషయాన్ని భర్తకు అత్తకు చెప్పాలా లేదా అని ఆలోచిస్తుంది. మళ్లీ గొడవలవుతాయేమౌ అని కాస్త కంగారు పడుతుంది.

  జానకికి తిట్లు పడాలని

  జానకికి తిట్లు పడాలని

  అదే సమయంలో ఇంటికి వచ్చిన మల్లిక అత్త చెప్పులను చూస్తుంది. జానకికి తిట్లు పడాలని కుట్టించుకొని వచ్చిన చెప్పులను మళ్లీ తెగిపోయేలా చేస్తుంది. ఇక అప్పుడే బయటకు వచ్చిన జ్ఞానాంబ షాక్ అవుతుంది. వెంటనే రామచంద్రకు ఫోన్ చేసి అడగడంతో జానకి ఆ పని చేస్తానని చెప్పిందని అంటాడు. అదే సమయంలో వచ్చిన మల్లిక అత్తా కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే జానకి మాత్రం నేను నిజంగానే చెప్పులను కొట్టించుకుని వచ్చానని చెబుతుంది.

  కోపం వచ్చేలా చేసిన మల్లిక

  కోపం వచ్చేలా చేసిన మల్లిక

  ఇక మధ్యలో వచ్చిన మల్లిక అలా అబద్ధాలు చెప్పకూడదు అంటూ అత్తకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది. నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎంతగా శిక్షించారో నాకు తెలుసు ఇప్పుడు జానకి కూడా అదే తప్పు చేస్తోంది. ఇద్దరినీ ఒకే విధంగా చూడాలని ఉంటుంది. ఆ మాటలకు గోవిందరాజులు చాలా అప్సెట్ అవుతాడు. జానకి అబద్ధం ఎందుకు చెబుతుంది అని మల్లికను ప్రశ్నిస్తాడు. కానీ జ్ఞానాంబ మాత్రం మల్లిక మాటలను పట్టించుకొని జానకి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
  జనాకికి శిక్ష వేసిన జ్ఞానాంబ

  జనాకికి శిక్ష వేసిన జ్ఞానాంబ

  కోడళ్ల చేత ఇలాంటి పనులు చేయించడం నాకు నచ్చదు అని తెలిసినా మళ్లీ దాన్ని అబద్ధం చేయాలనుకోవడం మరో తప్పని చెబుతుంది. అయినప్పటికీ జానకి వివరించాలని ప్రయత్నం చేస్తుంది కానీ అప్పటికే జ్ఞానాంబ కోపం కట్టలు తెంచుకుంటుంది. జానకికి కూడా శిక్ష వేయాలని అనుకుంటుంది. జానకి మూడురోజులు స్వీట్ షాప్ లోనే ఉంటూ స్వీట్స్ చేయడం నేర్చుకోవాలని అంటుంది. ఇక ఇక మరో సారి జానకికి ఉండాలని రామచంద్ర ప్రయత్నం చేస్తున్న సమయంలో అప్పుడే జ్ఞానాంబ అతని మాటలు వింటుంది. ఏం మాట్లాడావు అంటూ ప్రశ్నిస్తుంది. మరి రామచంద్ర ఎలాంటి సమాధానమిస్తాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 99
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X