twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu August 5th: జానకి చదువుకు జ్ఞానాంబ గ్రీన్ సిగ్నల్.. కానీ ఊహించని కండిషన్స్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన కథాంశంతో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 360 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

    Recommended Video

    Bimbisara డ్యాన్స్ చేద్దాం రారా *Review | Kalyan Ram | Telugu Oneindia
    భర్త సపోర్ట్

    భర్త సపోర్ట్

    తన ఫ్యామిలీ తన చదువును త్యాగం చేసిన రామచంద్ర చిన్నతనంలోనే ఎంతగానో కష్టపడతాడు. తల్లి జ్ఞానాంబకు కూడా ఆ విషయం బాగా తెలుసు. ఇక అతని జీవితంలోకి చదువుకున్న అమ్మాయి వస్తే మళ్లీ ఇబ్బంది పడతాడేమో అని చదువుకోలేని అమ్మాయిని కోడలిగా తీసుకురావాలని జానకి ని ఇచ్చి పెళ్లి చేస్తుంది. అనంతరం జానకి చదువుకున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా జానకి మంచితనం కారణంగా ఆమెను క్షమించి మళ్లీ ఒక మాట కూడా తీసుకుంటుంది. కానీ భవిష్యత్తులో మాత్రం చదువు ప్రస్తావన తీసుకురావద్దు అని సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది. కానీ జానకి మాత్రం భర్త సపోర్ట్ వలన ఐపీఎస్ చదువును కొనసాగిస్తోంది.

    కొడలిగా బాధ్యత కోసం

    కొడలిగా బాధ్యత కోసం

    జానకి చదువు గురించి పూర్తిగా ఆలోచించిన తరువాతనే రామ ఆమె చదువుకునేందుకు సహాయపడతాడు. అయితే చివరికి జ్ఞానాంబకు నిజం తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అత్తగారు అంటే జానకికి కూడా ఎంతో గౌరవం. అయితే తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఐపిఎస్ చదువును పూర్తి చేయాలి అని అనుకుంటుంది. ఇక కోడలిగా తన బాధ్యతను పూర్తి చేయాలి కాబట్టి అత్తగారి కోసం మధ్యలో చదువును కూడా వదిలేయాలని అనుకుంటుంది. కానీ భర్త రామచంద్ర మాత్రం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ధైర్యం చెప్పి చదువును కొనసాగించేలా చేస్తాడు. ఇక ఫైనల్ గా జ్ఞానాంబకు నిజం తెలియడంతో ఆమె కొడుకు కోడలితో మాట్లాడకుండా అసహనంతో ఉంటుంది.

    బాధలో పుస్తకాలు ఇచ్చిన జానకి

    బాధలో పుస్తకాలు ఇచ్చిన జానకి

    ఇక జానకి కూడా అత్తగారిని ఇకనుంచి బాధ పెట్టకూడదు అనే ఐపీఎస్ చదువును వదిలేయాలని అనుకుంటుంది. అందుకోసం ఆమె తన తల్లిదండ్రుల ఫోటోలు దగ్గర నిలబడి క్షమాపణలు కోరుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మీరు నన్ను ఒక ఐపిఎస్ ఆఫీసర్ గా చూడాలని కోరుకున్నారు. కానీ మధ్యలోనే మీరు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు నా అత్తగారి కోసం నేను కూడా నా చదువును మధ్యలోనే వదిలేస్తున్నాను. మరొక జన్మలో మీ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాను అని జానకి బాధతో తన దగ్గర ఉన్న ఐపిఎస్ పుస్తకాలను కూడా భర్తకు ఇచ్చేస్తుంది. వీటిని మన షాప్ లో పొట్లాలు కట్టుకోవడానికి ఉపయోగించండి అని ఏడుస్తూ ఉంటుంది. కానీ రామచంద్రం మరోసారి ఆలోచించమని చెబుతాడు. అయినప్పటికీ కూడా జానకి ఇక ఎవరిని బాధ పెట్టడం నావల్ల కాదు అని అంటుంది.

    మరోసారి అర్థమయ్యేలా చెప్పిన రామ

    మరోసారి అర్థమయ్యేలా చెప్పిన రామ

    ఇక జానకి మాటలకు భర్త రామచంద్ర కూడా ఏమి మాట్లాడలేకపోతాడు. ఆమె ఇచ్చిన పుస్తకాలను తల్లి జ్ఞానాంబ ఎదుట పెడతాడు. జానకి చిన్నప్పటి నుంచి ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కంటుంది. చనిపోయిన వారి అమ్మానాన్నల చివరి కోరిక కూడా అదే. కానీ ఈరోజు ఆమె నన్ను పెళ్లి చేసుకోవడం వలన ఈ ఇంటికి కోడలిగా రావడం వలన తన చదవుని మధ్యలోనే ఆపే పరిస్థితి ఎదురయింది.. అని తన తల్లికి చెబుతాడు. అంతేకాకుండా మీరు నాకు క్షేమం కోసం మామయ్యకు కలిగిన పరిస్థితి నాకు మళ్ళీ ఎదురవుతుందేమో అని కంగారులో చదువుకోవద్దు అని అంటున్నారు. కానీ జానకి మాత్రం ఎప్పటికీ అలా ఆలోచించదు అని రామచంద్ర మరోసారి తల్లికి వివరిస్తాడు.

     మౌనంగానే ఉన్న జ్ఞానాంబ

    మౌనంగానే ఉన్న జ్ఞానాంబ

    అంతేకాకుండా నేను సంతోషంగా ఉండాలి అనే మీరు జానకిని చదువుకోవద్దు అని అనుకుంటున్నారు కానీ జానకి తన చిన్నప్పటి కలను ఇప్పుడు వదిలేస్తే తన జీవితాంతం కూడా బాధపడుతూనే ఉంటుంది. కాబట్టి తను సంతోషంగా లేనిది నేను సంతోషంగా ఎలా ఉంటాను అని అనుకున్నావు అమ్మ అంటూ తల్లికి అర్థమయ్యేలా చెబుతాడు. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. మరోవైపు గోవిందరాజులు కూడా తన భార్యకు నచ్చజెప్పె ప్రయత్నం చేస్తారు. జానకి ఎప్పటికీ అలా చేయదు అని ఎన్నోసార్లు మన కుటుంబం కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టింది అని చెబుతాడు. అయితే అందరూ కూడా నచ్చ చెబుతూ ఉండడంతో మరోవైపు మల్లికా తనలో తానే కొంత ఆందోళన చెందుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అత్తగారు ఈ విషయంలో ఏమాత్రం తగ్గదు అని అనుకుంటుంది.

    జ్ఞానాంబ షరతులు

    జ్ఞానాంబ షరతులు

    అయితే జ్ఞానాంబ ఏమి మాట్లాడకుండా ఉండడంతో కొడుకు రామచంద్ర ఆ పుస్తకాలను తీసుకొని బయటకు వెళ్లిపోతున్న సమయంలో ఆగమని చెబుతోంది. అయితే ఈ క్రమంలో జ్ఞానాంబ ఫైనల్ గా జానకి చదువుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ తనలో ఉన్న ఒక ఆందోళన కారణంగా కొన్ని షరతులను కూడా పెడుతుంది. గతంలో నా తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయినీ పెళ్లి చేసుకొని ఇబ్బందుల్లో పడ్డాడు. ఆమె అవమానించడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పరిస్థితి నా కొడుకుకు రావద్దని నాలో ఒక ఆలోచన ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా రామచంద్రను అవామనించే విదంగా చూడవద్దు అని అంటుంది. అంతేకాకుండా నీ ఐపిఎస్ చదువు ఈ ఇంటికి వారసుడీని ఇవ్వడానికి ఆటంకం కాకూడదు అలాగే నువ్వు గతంలో వెన్నెల విషయంలో తల దూర్చినట్లు ఇప్పుడు కూడా అలానే ప్రవర్తించకూడదు అని జ్ఞానాంబ షరతులు పెడుతుంది. అలాగే జానకి కూడా అందుకు ఒప్పుకుంటుంది. మరి వీరి కదా ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial August 5th Episode 360
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X