For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu Episode 100: తల్లి మాట కంటే భార్యనే ఎక్కువనా?.. జ్ఞానాంబ మాటలకు రామచంద్ర షాక్!

    |

    జానకి కలగనలేదు సిరియల్ నేటితో సెంచరికి చేరువవుతోంది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో కాస్త నీరసంగా సాగినట్లు అనిపించినప్పటికి అనంతరం సరికొత్త ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మల్లికకు బుద్ధి వచ్చేలా అత్త జ్ఞానాంబ కోపాలు సరికొత్త కామెడీని క్రియేట్ చేస్తున్నాయి. ఇక జానకిపై కూడా జ్ఞానాంబ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విధానం రామ గుండెల్లో గుబులు రేపుతోంది.

    ఐపీఎస్ చదువు కోసం జానకి అబద్ధం చెప్పడంతో కథను ఎలాంటి మలుపులు తిప్పుతాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. కట్టుకున్నవాడి అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరికకు మొదటి అడుగు పడింది. ఇక జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 99వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

    పెద్ద తప్పు చేస్తున్నాను

    పెద్ద తప్పు చేస్తున్నాను

    ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా జానకిని ఐపీఎస్ చదివించాలని రామ తీసుకున్న నిర్ణయం రోజుకొక భయాన్ని కలిగిస్తుంది. అబద్ధాలు ఆడితేనే తట్టుకో లేని తల్లి వద్ద నిజం దాచి పెట్టి రామ చేస్తున్నా సపోర్ట్ కు జానకి కూడా కొంత ఆందోళన చెందుతుంది. పెద్ద తప్పు చేస్తున్నాను అంటూ భర్తతో చెప్పుకుంటూ బాధపడుతుంది. అయినప్పటికీ రామచంద్ర మంచి పని కోసం ఇలాంటి అబద్ధాలు పెద్ద తప్పులు కావని జానకి మద్దతు ఇస్తాడు. ఉన్నప్పటికీ దానికి నిత్యం ఆందోళన చెందుతూనే ఉంటుంది.

    తల్లి లాంటి అత్తకు సేవలు

    తల్లి లాంటి అత్తకు సేవలు

    జ్ఞానాంబ చెప్పులు తెగిపోవడంతో కుట్టించుకునే రమ్మని మొదట చిన్న కొడుకు విష్ణు చెబుతుంది. అయితే విష్ణు భార్య మల్లిక గుడికి వెళుతున్నాము అంటే మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అనంతరం రామచంద్రక ఆ చెప్పులు కుట్టించుకోని వస్తాను అని అంటాడు. ఇక రామచంద్ర నుంచి ఆ చెప్పులను జానకి తీసుకుంటుంది. ఎంత చెప్పినా కూడా వినకుండా తల్లి లాంటి అత్తకు ఇలాంటి సేవలు చేయడంలో తప్పు లేదని అర్థమయ్యేలా చెబుతుంది. ఇక రామచంద్ర కూడా జానకి మాటలకు ఒప్పుకోవాల్సి వస్తుంది.

    మరో చిచ్చు పెట్టిన మల్లిక

    మరో చిచ్చు పెట్టిన మల్లిక

    అయితే ఆ చెప్పులను కుట్టించుకొని వచ్చిన తర్వాత మల్లిక అనసూయతో మళ్లీ తెగిపోయేలా చేస్తున్నాయి. ఎలాగైనా జానకిపై కోపంతో ఊగిపోతూ శిక్ష పడాలని అనుకుంటుంది. మల్లిక అనుకున్నట్లుగానే జ్ఞానాంబ జానకిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంత నామోషీగా అనిపించినప్పుడు చెప్పులకు తీసుకెళ్లడం ఎందుకని, అబద్ధాలు చెబితే నాకు నచ్చదు అని తెలిసినా కూడా ఇలాంటి పనులు చేయడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

    ఇక మెల్లగా అదే కోపంతో ఉన్న అత్తను మల్లిక మరింత రెచ్చగొడుతుంది. అదే తప్పు నేను ఇప్పుడు చేసి ఉంటే నన్ను తప్పకుండా పుట్టింటికి పంపించే వారని అంటుంది. పెద్ద కోడలు చిన్న కోడలు అని తేడా లేకుండా చూస్తేనే అందరికీ మంచిది అని ఉంటుంది.

    జానకి - రామచంద్ర మధ్య దూరం

    జానకి - రామచంద్ర మధ్య దూరం

    ఇక మల్లికా మాటలకు మరింత రెచ్చిపోయిన జ్ఞానాంబ జానకి కూడా సరైన శిక్ష వేయాలని అనుకుంటుంది. స్వీట్స్ చేసే షాప్ కి వెళ్లి స్వీట్స్ చేయడం నేర్చుకోవాలని ఆదేశాలను జారీ చేస్తుంది. మూడు రోజుల వరకు అక్కడే ఉంటూ అక్కడే పడుకోవాలి అని చెబుతుంది. దీంతో చేసేదేమీ లేక మౌనంగా ఉండి పోతుంది అదే విషయాన్ని గోవిందరాజులు రామచంద్రకు తెలియజేస్తాడు. తల్లి నిర్ణయంలో తప్పు ఉండదు అని రామ కూడా సమర్దిస్తాడు. అలాగే రామ చంద్ర కూడా భార్యను ఏమాత్రం కలవద్దని తల్లి ఆర్డర్ వేస్తోంది.

    తల్లి మాట కంటే భార్యనే ఎక్కువనా?

    తల్లి మాట కంటే భార్యనే ఎక్కువనా?

    అనంతరం జానకి స్వీట్ షాప్ కి రాగానే పని వాళ్ళు అందరు కూడా ఆమెకి నమస్కారం చేస్తారు అక్కడే కూర్చోమని చెబుతారు. ఇక రామచంద్ర ఆ తప్పు ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే జానకిని కలిసి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదని నేను సరిగ్గా అత్త గారి చెప్పులు కుట్టించాను అని జానకి వివరిస్తుంది.

    ఇక జానకి రామచంద్ర మాట్లాడుకుంటున్న సమయంలో అప్పుడే అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. తాను మాట్లాడొద్దని చెప్పినా కూడా మళ్లీ జానకితో ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాయి. తల్లి మాట కంటే భార్యనే ఎక్కువనా అంటూ కౌంటర్ ఇస్తుంది.

    ప్రతి పనీ నేర్చుకోవాలి

    ప్రతి పనీ నేర్చుకోవాలి

    అందుకు షాకైన రామ అలాంటిదేమీ లేదు అంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కార్ఖానా లో ఉన్న వాళ్లందరికీ కూడా జ్ఞానాంబ సీరియస్ గా ఒక విషయాన్ని చెబుతుంది. ఈ మూడు రోజులు కూడా మీరు చేసే ప్రతి పని జానకికి నేర్పించాలని, నా కోడలు అని కాకుండా ప్రతి పని దగ్గరుండి నేర్పించాలని ఆర్డర్ వేస్తుంది. మూడు రోజుల్లోగా ఈ పనులన్నీ నేర్చుకోవాలని అలాగే నా ముందు కూడా స్వీట్స్ ఎలా తయారు చేయాలో చూపించాలని జ్ఞానాంబ హెచ్చరిస్తుంది. అందుకు జానకి సరే అంటూ ఒప్పుకుంటుంది.

    తప్పులు చేయకుండా ఉంటారా?

    తప్పులు చేయకుండా ఉంటారా?

    మరోవైపు మల్లిక రామచంద్ర మనసులో చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తుంది. మనుషులు అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా అంటూ చిన్న తప్పుకు మూడు రోజులు దూరం చేయడం నాకు చాలా బాధ గురిచేస్తోందని రామచంద్రకు వివరిస్తుంది. అందుకు రామచంద్ర కూడా మనోవేదనకు గురవుతారు. మరి రామచంద్ర తల్లి జ్ఞానాంబ నిర్ణయంపై ఏ విధంగా ఆలోచిస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 100
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X