For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 8th: అత్త నుంచి కొత్త టాస్క్ ఎదుర్కొంటున్న జానకి.. మల్లిక మరో మాస్టర్ ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో మంచి క్రేజ్ అందుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 361 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  భర్త సహకారంతో..

  భర్త సహకారంతో..

  చిన్నప్పటి నుంచి ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కన్న జానకి భర్త సహకారంతో తను అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటుంది. రామచంద్ర కూడా తన భార్య కోసం ఎంతగానో కష్టపడుతూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే రామచంద్ర తల్లీ జ్ఞానాంబ మాత్రం కోడలు చదువుకోడానికి ఏమాత్రం ఇష్టపడదు. ఎందుకంటే గతంలో ఆమె తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా అవమానంతో ఆత్మహత్య చేసుకోవడంతో మళ్ళీ తన కొడుకు విషయంలో కూడా అలానే జరుగుతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది.

  అత్తగారి గ్రీన్ సిగ్నల్

  అత్తగారి గ్రీన్ సిగ్నల్

  ఇక ఆమెలో ఆందోళన పెరగడంతో జానకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకోకూడదు అనే జానకి దగ్గర నుంచి గతంలోనే సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా జానకి చదువుకోవాల్సిందే అంటూ రామచంద్ర తల్లికి తెలియకుండా చదివిస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అర్ధరాత్రి కోచింగ్ సెంటర్ కు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో జానకి చదువుతున్న విషయం అత్తగారికి తెలుస్తుంది. ఫైనల్ గా ఎలాగో తెలిసింది కాబట్టి తల్లి అనుమతి తీసుకుని భార్యను చదివించాలని రామచంద్ర అనుకుంటాడు. అయితే మధ్యలో జానకి ఇకనుంచి చదువు వద్దు అని అత్తగారిని బాధ పెట్టడం తనకు ఇష్టం లేదు అని భర్తకు చెబుతుంది. అయినప్పటికీ కూడా రామచంద్ర తన తల్లిని బ్రతిమాలతాడు. దీంతో జ్ఞానాంబ మొత్తానికి జానకి చదువుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

   న్యూ కండిషన్స్

  న్యూ కండిషన్స్

  అయితే జానకీ చదువుకోవాలి అంటే కొన్ని పాటించాలి అని కండిషన్స్ కూడా పెడుతుంది. జానకి ఎప్పటిలానే చదువుకోడానికి అనుమతులు ఇస్తున్నాను. కాకపోతే నేను చెప్పిన కండిషన్స్ లో ఏ ఒక్క తప్పు జరిగిన కూడా ఆ తర్వాత తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటానో కూడా తనకు తెలియదు అని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక అందుకు జానకి కూడా ఒప్పుకుంటుంది. మీ కొడుకు సంక్షేమం కోసం మీరు ఆలోచిస్తున్నారు. అలాగే మీకు మంచి కోడలీగా గుర్తింపునందుకోవడానికి నేను కోరుకుంటున్నాను. అందుకే మీరు ఎలాంటి షరతులు విధించినా కూడా నాకు సమ్మతమే అనే జానకి చెబుతుంది.

  రామచంద్ర టెన్షన్

  రామచంద్ర టెన్షన్

  ఇక తర్వాత జ్ఞానాంబ ప్రత్యేకంగా పూజ గదికి తీసుకువెళ్లి అక్కడ 5 అంకెలను రాస్తుంది. నువ్వు ఈ కుటుంబానికి ఎలాంటి బాధ కలిగించిన ఇతర విషయాల్లో కలుగజేసుకున్నా రామచంద్రను అవమానపరిచిన అలాగే నీ చదువు కారణంగా ఇంట్లో ఎలాంటి తప్పులు జరిగినా కూడా కఠిన నిర్ణయం తీసుకుంటాను అని ఐదు తప్పులు చేసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది అని కూడా జ్ఞానాంబ చెబుతుంది. ఇక జానకి ఆ విషయాన్ని కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రామచంద్ర తన గదిలో ఉంటూ అమ్మ తీసుకున్న నిర్ణయంపై కంగారు పడుతూ ఉంటాడు. అయితే జానకి మాత్రం ఎలాంటి టెన్షన్ పడవద్దు అని అత్తగారు తనను చదువుకోవడానికి అనుమతులు ఇచ్చారు అదే సంతోషమని అంటుంది. కానీ రామచంద్ర మాత్రం ఏదో టెన్షన్ పడుతూనే ఉంటాడు.

  Recommended Video

  విరామం కేవలం రాజకీయాల నుండి మాత్రమే*Politics | Telugu OneIndia
  మల్లిక భర్తలో అనుమానాలు

  మల్లిక భర్తలో అనుమానాలు

  ఇక మరొకవైపు జానకి పై పగ తీర్చుకోవాలి అని చిన్న కోడలు మల్లిక మరింత రెచ్చిపోతుంది. ఈసారి తన భర్తను ఆయుధంగా చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. అందుకే అతనికి లేనిపోని అనుమానాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. భర్త విష్ణు మంచివాడు అయినప్పటికీ మల్లిక మాటలకు కొంత ఆలోచనలో పడతాడు. జానకి ఐపీఎస్ ఆఫీసర్ అయితే మీ అన్నగారు హైదరాబాద్ వెళ్ళిపోతారు అని ఆ తర్వాత మీరు ఇక్కడ బట్టలు కొట్టులో మాత్రమే ఉండిపోతారు అని అంటుంది. మనం కూడా హైదరాబాదు వెళ్లాలని అనుకున్నాము కానీ వాళ్లు మాత్రం అలా వెళ్ళనివ్వడం లేదు. మీ అత్తగారికి మీ అన్నగారు పెద్ద కోడలు అంటేనే ఇష్టం అని కూడా మల్లిక చెప్పడంతో విష్ణు ఒక్కసారిగా తనలో తానే అనుమానాలను కలుగజేసుకుంటాడు.

  మల్లిక కన్నింగ్ ప్లాన్

  మల్లిక కన్నింగ్ ప్లాన్

  ఇక తర్వాత మల్లికా మరొక అడుగు ముందుకు వేసి జానకిని అత్తముందు దోషిగా నిలబెట్టాలని అనుకుంటుంది. ఒక బీరువాలో పూజకు సంబంధించిన సామాన్లు ఉండగా వాటిని కింద పడేసి అందులో జానకి కి సంబంధించిన ఐపిఎస్ పుస్తకాలను పెడుతుంది. ఇక తర్వాత జ్ఞానాంబ ఆ పుస్తకాలను తీసి జానకిని పిలుస్తుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది జానకి ఏ విధమైన సమాధానం చెబుతుంది అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial August 8th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X