Janaki Kalaganaledu August 9th Episode: జానకి గుట్టు తెలుసుకునేందుకు మల్లికకు మరో ఛాన్స్..

జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ప్రేమ కథలోని సన్నివేశాలు అభిమానుల సంఖ్యను కూడా అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. ఈ సీరియల్ ఆ మధ్య కాస్త నీరసంగా సాగినట్లు అనిపించినప్పటికి 50 ఎపిసోడ్స్ అనంతరం సరికొత్త ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మల్లిక చేస్తున్న కుట్రలకు జానకి బలిపశువులా మారాల్సి వస్తోంది. అత్త జ్ఞానాంబ కోపానికి కూడా జానకి శిక్షలు అనుభావించాల్సి వస్తోంది.

ఇక మల్లిక ఎపిసోడ్స్ కొన్ని సరికొత్త కామెడీని క్రియేట్ చేస్తున్నాయి. జానకి ఐపీఎస్ చదువు కోసం అబద్ధం చెప్పడంతో కథలో సరికొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రామ అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 101వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

 పనులన్నీ నేర్చుకొని

పనులన్నీ నేర్చుకొని

చిన్న కోడలు మల్లిక మాటలకు మరింత రెచ్చిపోయిన జ్ఞానాంబ పెద్ద కోడలు జానకికి సరైన శిక్ష వేయాలని అనుకుంటుంది. స్వీట్స్ చేసే షాప్ కి వెళ్లి స్వీట్స్ చేయడం నేర్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మూడు రోజులు కూడా అక్కడే ఉంటూ పనులన్నీ నేర్చుకొని అక్కడే పడుకోవాలని అంటుంది. దీంతో చేసేదేమీ లేక జానకి మౌనంగా ఉండి పోతుంది. అదే విషయాన్ని గోవిందరాజులు రామచంద్రకు తెలియజేస్తాడు. తల్లి నిర్ణయంలో తప్పు ఉండదు అని రామ కూడా సమర్దిస్తాడు. అలాగే రామ చంద్ర కూడా భార్యను ఏమాత్రం కలవద్దని తల్లి ఆర్డర్ వేస్తోంది.

కోడలిపై జ్ఞానాంబ ప్రేమ

కోడలిపై జ్ఞానాంబ ప్రేమ

అత్త జ్ఞానాంబ మాటలకు కట్టుబడిన జానకి కార్ఖానా లోకి వెళ్లి అక్కడ పని వాళ్ళతో స్వీట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక మరోవైపు ఒక తల్లిగా ఆలోచించడం స్టార్ట్ చేసిన జ్ఞానాంబ, జానకి కోసం ప్రత్యేకంగా వంట చేస్తుంది. ప్రతిరోజు వంట చేసే మల్లిక సడన్ గా అత్తగారు ఎందుకు వంట చేస్తున్నారో అర్థం కాక ఆ విషయంపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంది. అందుకు జ్ఞానాంబ మెల్లగా ఆ విషయం అర్ధమవుతుందని అంటుంది. ఇక గోవిందరాజులు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చూస్తారు కానీ అందుకు జ్ఞానాంబ ఒప్పుకోదు. కోడలిపై ఇంత ప్రేమ కూడా పెట్టుకునే పెద్ద పెద్ద శిక్ష ఎందుకు వేసావులే గోవిందరాజులు భార్యను అడుగుతాడు.

పని వాళ్ళ తో సమానంగా

పని వాళ్ళ తో సమానంగా

భర్త మాటలకు మౌనంగా ఉండి పోయిన జ్ఞానాంబ కార్ఖానాలో జానకి పడుతున్న కష్టాల గురించి ఊహించుకుంటూ బాధపడుతుంది. ఇక వంట పూర్తి చేసిన అనంతరం కార్ఖానాకు వెళ్ళిన జ్ఞానాంబ అక్కడ జానకి పడుతున్న కష్టాన్ని ప్రత్యేకంగా గమనిస్తుంది. కార్ఖానాలో తయారు చేస్తున్న పని వాళ్ళ తో సమానంగా జానకి కూడా కష్టపడి పని చేస్తుంది ఆ విషయం నాకు బాగా నచ్చుతుంది.

అత్త మాటలకు జానకి షాక్

అత్త మాటలకు జానకి షాక్

అనంతరం జ్ఞానాంబ జానకిని పిలిచి ప్రత్యేకంగా భోజనం వద్ధిస్తుంది. జానకి తింటున్న సమయంలో అత్త ప్రేమ ని చూసిన ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. మల్లికా వంటలు బాగా చేసింది తనను అడిగానని చెప్పండని కూడా చెబుతుంది. అయితే జ్ఞానాంబ మాత్రం మల్లికా ఆలోచన విధానం గురించి చాలా క్లారిటీగా చెబుతూ.. తన మోసాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని కూడా ఉంటుంది. కానీ జానకి మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఎంతైనా తన చెల్లి కదా అంటూ అత్తకు ఇస్తుంది. అందుకు జ్ఞానాంబ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది.అంతే కాకుండా జ్ఞానాంబ జానకి మనసును తాకేలా నువ్వు నాతో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అంటుంది. అంతే కాకుండా నువ్వంటే తనకు ఎంతో నమ్మకం అని కూడా చెబుతుంది. ఇక మనసులో ఐపీఎస్ కావాలనే నిజాన్ని దాచిన జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

రామ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం

రామ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం

ఇప్పుడే ఇంటికి వచ్చిన రామచంద్ర జానకి ఇంట్లోనే ఉంది అనుకొని భోజనం చేద్దామని రమ్మని పిలుస్తాడు. కానీ అప్పుడే మనసులో మళ్ళీ జానకి లేదు కదా అని ఆలోచిస్తాడు. అదే సమయంలో భోజనం పెట్టేందుకు వచ్చిన మల్లిక సీతారాముల జంట మాదిరిగా మీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఒక్క పొరపాటు వలన జానకి మూడు రోజులు మీకు దూరం కావాల్సి వచ్చింది. మనుషులు అన్నాక తప్పు చేయకుండా ఉంటారా చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష వేయడం నాకు చాలా బాధ కలిగించింది.. అని రామ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తుంది.

మరోసారి మల్లికకు కౌంటర్

మరోసారి మల్లికకు కౌంటర్

ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చిన జ్ఞానాంబ మల్లిక మాటలకు తగినంత కౌంటర్ కూడా ఇస్తుంది. మల్లిక మీద చాలా బెంగ పెట్టుకున్నావు కదా నువ్వు కూడా తనకి తోడుగా వెళ్లి అక్కడే పడుకోవాలి అని ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో మల్లిక షాక్ అవుతూ వెనుకడుగు వేసినప్పటికీ తప్పకుండా వెళ్లి అక్కడే పడుకోవాలని చెబుతుంది. దీంతో మల్లిక అందుకు సిద్ధమవుతుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
జానకి కోసం పుస్తకాలు పంపిన రామ

జానకి కోసం పుస్తకాలు పంపిన రామ

ఇక జానకి చదువుకోవాలనే రామచంద్ర ఒక సంచిలో పుస్తకాలు పెట్టి మల్లికకు ఇస్తాడు. నువ్వు కూడా అక్కడికి వెళుతున్నావు కదా ఈ సంచిని జానకికి ఇవ్వండి అని రామచంద్ర మల్లికను బ్రతిమాలతాడు. ఇక అందులో ఏముందో పెద్దగా పట్టించుకోని మల్లిక మల్లిక కార్ఖానాకు వెళ్లి ఆ సంచిని జానకి చేతిలో పెడుతుంది. ఇక అందులో పుస్తకాలను చూసిన జానకి ఎంతో సంతోషిస్తుంది. మరి ఆ విషయాన్ని మల్లిక పసిగడుతుందో లేదో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X