Janaki Kalaganaledu August 9th: మల్లికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన జానకి.. జ్ఞానాంబ దెబ్బకు షాక్!

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథాంశంతో కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 362 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

పెళ్లి తరువాత

పెళ్లి తరువాత

జానకి ఐపిఎస్ చదువుకోవడానికి అత్తగారు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. మొదట చదువుకున్న కోడలు ఏమాత్రం వద్దని చాలా జాగ్రత్తగా ఆలోచించి రామచంద్ర కు జానకిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. అయితే పెళ్లికి ముందు జానకి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకుంది అని కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పడంతో జ్ఞానాంబ నమ్ముతుంది. ఇక పెళ్లి తర్వాత జానకి డిగ్రీ చేసింది అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. మధ్యలో ఆమె మళ్ళీ చదువుకుంటుందేమో అని తన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది. అయితే జానకి మాత్రం ఐపిఎస్ కావడానికి భర్త సహకారంతో చదువును కొనసాగిస్తూ ఉంటుంది. జ్ఞానాంబ కు ఆ విషయం కూడా తెలుస్తుంది.

అవమానంతో చనిపోయాడని..

అవమానంతో చనిపోయాడని..


గతంలో తన తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగానే అవమానంతో చనిపోయాడు. ఇప్పుడు నా కొడుకు విషయంలో కూడా అలాంటి సంఘటన ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని జ్ఞానాంబ ఆందోళన చెందుతూ ఉంటుంది. అందుకోసమే జానకి చదువుకోకూడదు అని కూడా ఆమె షరతులు పెడుతుంది. ఈ క్రమంలో జానకి అలా ఎప్పటికీ చేయదు అని రామచంద్ర కూడా నచ్చజెప్పె ప్రయత్నం చేస్తాడు. ఇక మొత్తానికి జ్ఞానాంబ ఐపిఎస్ చదువుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

 కండిషన్స్ తో హెచ్చరికలు

కండిషన్స్ తో హెచ్చరికలు

అయితే కొన్ని కండిషన్స్ కూడా పెడుతుంది. నీవు చదువుకుంటున్న కారణంగా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని రామచంద్రను అవమానపరిచినా అలాగే ఇంటి పరువు పోయినా కూడా ఏమాత్రం సహించను అని ఐదు తప్పులు చేస్తే అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది అని హెచ్చరిక చేస్తుంది. పూజ గది దగ్గర జ్ఞానాంబ ఒకటి నుంచి 5 అంకెల వరకు రాసి నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ ఒక్కో అంకె చేరిపేస్తాను అని చెబుతుంది.

 రివెంజ్ తీర్చుకోవాలని

రివెంజ్ తీర్చుకోవాలని

ఈ క్రమంలో జానకి పై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని మరొకవైపు చిన్న కోడలు మల్లికా కూడా ప్రణాళిక రచిస్తుంది. ఎవరూ లేనప్పుడు జానకి గదిలోకి వెళ్లి తన పుస్తకాలను తీసుకొని జ్ఞానాంబ ఎంతో పవిత్రంగా భావించే ఒక బీరువాలో పెడుతుంది. అందులో వంశపారపర్యంగా వస్తున్న తోరాలను బయటపడేసి జానకి పుస్తకాలను పెడుతుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ బయటకు రాగానే ఎంతో పవిత్రమైన తోరణాలు కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. ఇక ఆ బీరువాల్లో జానకికి సంబంధించిన పుస్తకాలు ఉండడంతో వెంటనే గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. అయితే జానకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా జ్ఞానాంబ వీటి పవిత్రత గురించి నీకు తెలుసా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

మల్లిక అత్యుత్సాహం

మల్లిక అత్యుత్సాహం

మరొకవైపు మల్లిక కూడా ఏమీ తెలియనట్టుగా వచ్చి ఎంత తప్పు చేశావు జానకి అంటూ ఇప్పుడే ఇంతలా పెత్తనాలు చేస్తుంది అంటే ఇక పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన తర్వాత ఇంకెంత పొగరు వస్తుందో అని అంటుంది. అలాగే బావగారిని కూడా ఎంతగా అవమానిస్తుందో అని మాట్లాడుతుంది. ఇక మీరు పెట్టిన కండిషన్స్ లో మొదటి తప్పు జరిగింది కాబట్టి ఒక అంకెను తుడిపేయండి అంటూ అత్తకు మల్లిక చెబుతుంది. ఇక జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉండడంతో మల్లికా వెంటనే అక్కడికి వెళ్లి తుడిపేయడానికి ఆలోచిస్తుంది.

 తెలివిగా పట్టించిన జానకి

తెలివిగా పట్టించిన జానకి

అయితే జానకి సైలెంట్ గా మళ్లీ గమనించి ఒక చక్కటి ప్రణాళిక వేస్తుంది. తన నోటి నుంచే అసలు నిజాన్ని కూడా బయటపెట్టిస్తుంది. నా గదిలో ఉన్న ఒక నెక్లెస్ నువ్వు తీసుకున్నావు మల్లికా అంటూ చెబుతుంది. అయితే జానకి అలా ఎందుకు మాట్లాడుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇంత సీరియస్ విషయం జరుగుతూ ఉంటే నా మీద మరొక నింద వేస్తావా అంటూ మల్లిక మరింత కోపం వ్యక్తం చేస్తుంది. నా నెక్లెస్ బాక్స్ కు పసుపు అంటుకుంది అంటూ నీ చేతుల్లోకి పసుపు ఎలా వచ్చింది అని చెబుతుంది. ఇక మల్లికా తొందరపాటులో ఆ తోరాలు తీసి నీ పుస్తకాలు పెట్టినప్పుడు అంటుకుంది అని నోరు జారడంతో అసలు విషయం బయటపడుతుంది.

 టెన్షన్ లో రామ

టెన్షన్ లో రామ

ఇక జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత నాలిక కరుచుకున్న మల్లికా బెత్తర చూపులు చూస్తూ ఏడుస్తుంది. వెంటనే అత్తగారి కాళ్ళ దగ్గర పడిపోతుంది. మరొకసారి ఇలాంటి తప్పు చేయను అని బ్రతిమాలుతుంది. ఇక జ్ఞానాంబ మరోసారి హెచ్చరిక చేసి ఇలాంటి తప్పు జరగకూడదు అని చెప్పి వదిలేస్తుంది. మల్లిక మరొకవైపు తన భర్త విషయంలో కూడా సీరియస్ అవుతుంది. నువ్వు నాకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు అని నేను చెప్పినట్టు వినకపోతే విడాకులు తీసుకుందామని అంటుంది. ఇక జానకి విషయంలో భర్త రామచంద్ర కూడా కాస్త కంగారు పడుతూ ఉంటాడు. తల్లి పెట్టిన కండిషన్స్ ద్వారా జానకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అని ఆలోచిస్తాడు. మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X