Janaki Kalaganaledu December 10th: భర్తను ముద్దులతో తడిపేసిన జానకి.. మరో కుట్రలో మల్లిక!

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ముందుకి సాగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి అత్త గారిని కాదని ఆ కలను ఎలా సాధించింది అనే అంశం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 45వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 45వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 190వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

కొడుకు జీవితంపై భయం

కొడుకు జీవితంపై భయం

జానకి డిగ్రీ చదువుకున్నట్లు నిజం తెలుసుకున్న జ్ఞానాంబ ఏ మాత్రం సహించదు. కొడుకు కూడా నిజం దాచడంతో మొదట అసహనం వ్యక్తం చేస్తుంది. గతంలో తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని అలానే కొడుకు జీవితంలో జరుగుతుందేమో అని జ్ఞానాంబ ఆందోళన చెందుతుంది. ఆ భయం కొంత ఉన్నప్పటికీ జానకి మంచి తనం వలన జ్ఞానాంబ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. ఇక మళ్ళీ ఎప్పటికి చదువు ప్రస్తావన రావద్దని కూడా జ్ఞానాంబ చెప్పడంతో అందుకు జానకి మాట కూడా ఇస్తుంది. కానీ మరోవైపు భర్త రామచంద్ర మాత్రం జానకిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని అనుకుంటాడు.

ధైర్యం చెప్పిన రామచంద్ర

ధైర్యం చెప్పిన రామచంద్ర

జానకి ఐపీఎస్ చదువును మధ్యలోని ఆపేస్తుండడంతో రామచంద్ర ఆమెకు సలహా ఇస్తాడు. ఎలాగైనా మీరు అనుకున్న కలను నిజం చేసుకోవాలని చెబుతూ మీ తల్లిదండ్రుల నా స్థానంలో ఉంటే అదే చేసేవారు కదా అని ధైర్యం చెబుతాడు. కానీ జానకి మాత్రం అత్త గారికి మళ్ళీ చదువు ప్రస్తావన తీసుకురానని మాట ఇచ్చాను.. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చదువుకుంటాను అంటే ఎలా ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తుంది. ఇక నలుగురికి మంచి చేసే చదువు పూర్తి చేస్తే ఆ తరువాత ఎవరైనా మెచ్చుకుంటారు అంటూ ఎవరికి భయపడకూడదు అని రామ చెబుతాడు. అంతే కాకుండా మీరు అనుకున్న కలలు నిజం చేసుకుని తీరాలి అని దాన్ని మధ్యలోనే ఆపే హక్కు ఎవరికీ లేదు అని కూడా రామ చంద్ర ధైర్యాన్ని ఇస్తాడు.

జ్ఞానాంబ అనుమానం

జ్ఞానాంబ అనుమానం

అయితే మొత్తానికి జానకిని ఒప్పించిన రామచంద్ర ఎప్పటిలానే కేకులు నేర్చుకోవడానికి వెళుతున్నట్లు ఇంట్లో అబద్ధం చెప్పి ఐపీఎస్ కోచింగ్ సెంటర్ దగ్గర దింపాలని అనుకుంటాడు. అయితే మొదట ఆ విషయంలో జ్ఞానాంబ కొంత అనుమానంతో ఎక్కడికి వెళ్ళవద్దు అని చెబుతుంది. కేకులు నేర్చుకుంటే మన షాప్ బిజినెస్ చాలా బాగుంటుంది అని అబద్ధం చెప్పి రామ తల్లిని ఒప్పిస్తాడు. అంతేకాకుండా గోవింద రాజులు కూడా జ్ఞానాంబకు నాలుగు మంచి మాటలు చెప్పడంతో అభ్యంతరం లేదని అంటుంది. ఇక జానకిని ధైర్యంగా రామచంద్ర తీసుకువెళతాడు. రామచంద్ర ఆ విషయంలో జానకికి ఎంత మద్దతు పలికినప్పటికికూడా జానకి మాత్రం భయపడుతూనే ఉంటుంది.

రహస్యం ఏదో ఉందని

రహస్యం ఏదో ఉందని

మనం కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్నాము అని అబద్ధం చెప్పాము కానీ అత్తయ్య గారు అక్కడ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుంటే ఆ తర్వాత మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అని చెబుతుంది. అయితే ఆ విషయాలు అన్నీ కూడా నేను చూసుకుంటాను అని రామచంద్ర ధైర్యం చెబుతాడు. ఇక మరొక వైపు నుంచి మల్లిక వారు కేకులు నేర్చుకోవడం వెనుక రహస్యం ఏదో ఉందని మరొక కొత్త అనుమానం వ్యక్తం చేస్తుంది. కేవలం కేకులు నేర్చుకోవడానికి వెళ్లే వీరు ఇంతలా బ్రతిమాలడం కి అసలు కారణం ఏదో ఉండే ఉంటుంది అని ఆలోచిస్తుంది.

ఆ పోటీలకు పంపిస్తే..

ఆ పోటీలకు పంపిస్తే..

ఇక వెంటనే జానకి కేకలు నేర్చుకోవడానికి వెళ్ళిన షాప్ కి వెళ్ళిన మల్లిక అక్కడ జానకిని పిలవాలని చెబుతుంది. అయితే ఆమె ఊహించని విధంగా అక్కడ జానకి కాకుండా మరొక పేరుతో ఉన్న జానకి కనిపిస్తుంది. వెంటనే మల్లిక షాక్ అవుతుంది. ఇక్కడికి రాకుండా ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు ఉన్నారని ఆలోచించడంతో ఆమెను కేకుల పోటీలకు పంపిస్తే తప్పకుండా అసలు రహస్యం బయట పడుతుందని మరొక ప్లాన్ వేస్తుంది. వెంటనే జ్ఞానాంబ, గోవిందరాజులు దగ్గరికి వెళ్లి జానకిని కేకులు పోటీకి పంపిస్తే మన షాప్ కూడా చాలా మంచి పేరు వస్తుంది అని నమ్మిస్తుంది.

 జానకి ముద్దుల వర్షం

జానకి ముద్దుల వర్షం

మల్లిక అలా చెప్పగానే మొదట కాస్త అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా జ్ఞానాంబ ఇదేదో బాగుంది అంటూ అంటూ కేకుల పోటీలకు ఒప్పుకుంటుంది. ఇక మరొకవైపు గోవిందరాజులు కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ప్రత్యేకంగా ఒక సంబంధం కూడా చూసినట్లు చెప్పడంతో అబ్బాయి గుణగణాలు బాగుంటే తప్పకుండా చేద్దాం అని జ్ఞానాంబ అంటుంది. ఈ క్రమంలో రామచంద్రం స్వీట్ షాప్ లో ఒక ఆర్డర్ ఇస్తాడు. అందులో బంగు కలిపిన స్వీట్ కాకుండా కాకుండా మరొక స్వీట్ బాక్స్ కస్టమర్ కి ఇచ్చి పంపిస్తాడు. అయితే పొరపాటున జానకికి బంగు కలిపిన బాక్స్ ఇవ్వమని తన చిన్న తమ్ముడికి చెబుతాడు. ఇక ఆ స్వీట్లు తిన్న జానకి రామచంద్రపై ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఇక వీరి మధ్య కొనసాగిన రొమాంటిక్ సన్నివేశాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X