Janaki Kalaganaledu December 13th: రొమాంటిక్ మత్తులో రెచ్చిపోయిన జానకి.. అడ్డంగా బుక్కైన మల్లిక

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు రేటింగ్స్ అందుకోవడంలో పాత రికార్డులను బ్రేక్ చేస్తోంది. చాలా ఆసక్తికరంగా ముందుకి సాగుతోంది. ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి అత్త గారికి అబద్ధం చెప్పి ఎలా సాధించింది అనే అంశం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 45వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 45వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 191వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

అలాంటి ఘటన జరగవద్దని..

అలాంటి ఘటన జరగవద్దని..

పెద్ద కోడలు జానకి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు ఇంట్లో వారు అబద్ధం చెప్పడంతో జ్ఞానాంబ ఒప్పుకొని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. కానీ కొన్నాళ్ళకి ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు నిజం తెలుసుకున్న జ్ఞానాంబ ఏ మాత్రం సహించదు. గతంలో తన తమ్ముడు కూడా ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని మళ్ళీ ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా అలాంటి ఘటన తన కుటుంబంలో జరగకూడదు అని అనుకుంటుంది. కానీ జానకి చదువు విషయం తెలిశాక కొడుకు జీవితంలో అలా జరుగుతుందేమో అని జ్ఞానాంబ ఆందోళన చెందుతుంది.

 అబద్దాలు చెప్పి ఐపీఎస్ కోచింగ్

అబద్దాలు చెప్పి ఐపీఎస్ కోచింగ్


కానీ భయం కొంత ఉన్నప్పటికీ మంచి తనం వలన జ్ఞానాంబ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. ఇక చదువు ప్రస్తావన రావద్దని కూడా జ్ఞానాంబ చెప్పడంతో అందుకు జానకి మాట కూడా ఇస్తుంది. కానీ మరోవైపు భర్త రామచంద్ర మాత్రం జానకిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని అనుకుంటాడు. ఎప్పటిలానే రామచంద్ర తన భార్యని ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు తీసుకువెళతాడు. ఇంట్లో తెలియకుండా ఉండాలి అని జానకి కేకులు నేర్చుకోవడానికి వెళుతుందని అబద్ధం కూడా చెబుతాడు. మొదట ఆ విషయంలో జ్ఞానాంబ అసహనం చేసినప్పటికీ కూడా రామచంద్ర బ్రతిమాలి ఒప్పిస్తాడు. జానకి కేకులు నేర్చుకోవడం ఏ మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పినప్పటికీ కూడా కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.

ధైర్యం చెప్పిన రామ

ధైర్యం చెప్పిన రామ


మొత్తానికి జ్ఞానాంబ ఒప్పుకోవడంతో రామచంద్రం సంతోషిస్తాడు. కానీ ఆ విషయంలో జానకి మాత్రం ఆందోళన చెందుతూనే ఉంటుంది. అబద్ధం చెప్పి ఇలా కోచింగ్ సెంటర్ కి వెళుతున్నావు కానీ ఎప్పుడైనా అత్తయ్య గారు కేకులు తయారు చేసే షాప్ కి ఫోన్ చేస్తే పరిస్థితి ఏమిటి అని అడుగగా.. ఆ విషయంలో కూడా ఒక ప్రణాళిక ఉందని అంటూ రామచంద్ర ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

 రొమాంటిక్ మత్తులో జానకి

రొమాంటిక్ మత్తులో జానకి


అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక చిన్న పొరపాటు వల్ల రామ స్వీట్ బాక్స్ లు మారుస్తాడు. ఒక కస్టమర్ కి మత్తు కలిపిన స్వీట్స్ ఇవ్వాలని బాక్స్ లో ప్యాక్ చేసి ఉంచుతాడు. అలాగే జానకి కోసం ప్రత్యేకంగా చేసిన లడ్డూలను కూడా అక్కడే ఉంచుతాడు. అయితే పొరపాటున బంగు కలిపిన స్వీట్ బాక్స్ ను ఇంటికి పంపిస్తాడు. జానకికి ప్రత్యేకంగా పంపడంతో ఆమె చాలా సంతోషంగా తింటుంది. అయితే ఆ తర్వాత అనుకోని విధంగా ఆమెకి ఒకేసారి మత్తుగా అనిపిస్తుంది. ఇక రామచంద్ర జానకిని పలకరించే ప్రయత్నం చేయగా ఆమె పిచ్చిగా ప్రవర్తిస్తుంది. రొమాంటిక్ గా రామచంద్ర బుగ్గ పై ముద్దు కూడా పెడుతుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వదు. అప్పుడే జ్ఞానాంబ కూడా రామచంద్రుని పిలుస్తుంది. రామచంద్ర కూడా జానకి బ్రతిమాలు కుంటూ బయటకు వెళ్ళిపోతాడు.

 రామచంద్ర ఆందోళన

రామచంద్ర ఆందోళన


అయితే గోవిందరాజులు కొడుకుని చూసి ఒక్కసారి గా నవ్వుతారు. రామచంద్ర బుగ్గపై ముద్దు ఇచ్చినట్లు లిప్ స్టిక్ ఉండడంతో గోవిందరాజులు జ్ఞానాంబ ముసిముసి నవ్వులతో కనిపిస్తారు. ఇక జ్ఞానాంబ చేతిలో ఉన్న మల్లెపూలను రామచంద్ర కు ఇచ్చి జానకి ఇవ్వమని చెబుతుంది. ప్రస్తుతం జానకి ఉన్న పరిస్థితిలో పువ్వులు ఇస్తే ఇంకా ఎంత రెచ్చిపోతుందో అని ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జానకి రామచంద్ర ను మరింతగా మత్తులోకి లాగేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పనిమనిషి చికిత్త మల్లికను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
 మల్లిక వింత ప్రవర్తన

మల్లిక వింత ప్రవర్తన

జానకి కంటే ముందే చికిత్త కూడా కొన్ని స్వీట్స్ తింటుంది. దీంతో ఆమెకు కూడా చాలా మత్తు వస్తుంది. ఇక మల్లిక తనను బయటకు వెళ్లి మిర్చీలు తీసుకురమ్మని చెబితే చికిత్త తనే తినేస్తుంది. ఆ తరువాత మల్లికను గంప కింద పెట్టి కూర్చుంటుంది. విష్ణు ఆడిగినప్పటికి ఏమో నాకు తెలియదు అని చెప్పడంతో అతను వెళ్ళిపోతాడు. ఇక ఉన్నట్టుండి చికిత్త ఇలా ఎందుకు మారిపోయింది అని అనుకుంటున్న తరుణంలో పక్కనే స్వీట్ బాక్స్ మల్లికకు ఇస్తుంది. ఇక ఆమె కూడా ఆ మత్తు వచ్చే స్వీట్ తిని జ్ఞానాంబ దగ్గర అలానే కనిపిస్తుంది. గోవిందరాజులు మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పగా వింతగా ప్రవర్తిస్తుంది. మరి ఈ దెబ్బతో జ్ఞానాంబ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X