twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 14th: జానకి గుట్టు లాగేందు ట్విస్ట్ ఇచ్చిన మల్లిక.. కన్ఫ్యూజన్ లో రామచంద్ర

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో కీలకమైన మలుపు తిరగబోతోంది. గత వారం కంటే ఈ వారం ఆసక్తికరంగా ముందుకి సాగుతోంది. ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి అత్త గారికి అబద్ధం చెప్పి ఎలా సాధించింది అనే అంశం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 45వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 46వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 44వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 46వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 192వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

     పోలీసుల నుంచి కాపడడంతో..

    పోలీసుల నుంచి కాపడడంతో..

    జానకి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు ఇంట్లో వారు అబద్ధం చెప్పడంతో జ్ఞానాంబ తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. కానీ కొన్నాళ్ళకి ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు తెలియగానే జ్ఞానాంబ ఏ మాత్రం సహించదు. తన తమ్ముడు కూడా ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని మళ్ళీ ఒక చదువుకున్న అమ్మాయి తన ఇంట్లోకి రాకూడదు అని అని అనుకుంటుంది. కానీ జానకి చదువు విషయం తెలిశాక కొడుకు జీవితంలో అలా జరుగుతుందేమో అని జ్ఞానాంబ ఆందోళన చెందుతుంది. కానీ జానకి మంచితనం కారణంగా అలాంటి ఆలోచనలను మెల్లగా మర్చిపోతుంటుంది. అంతే కాకుండా జానకి తన తెలివితేటలతో పోలీసుల నుంచి బయట పడేయడంతో ఆమె తెలివిని కూడా మెచ్చుకుంటుంది.

    ఇక చదువు ప్రస్తావన రావద్దని కూడా జ్ఞానాంబ చెప్పడంతో అందుకు జానకి మాట కూడా ఇస్తుంది. కానీ మరోవైపు భర్త రామచంద్ర మాత్రం జానకిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని అనుకుంటాడు.

    మళ్ళీ ఎప్పటిలానే..

    మళ్ళీ ఎప్పటిలానే..

    జానకి చదువు గురించి ఏ మాత్రం ప్రస్తావించ వద్దు అని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా జానకి భర్త రామచంద్ర ఆమెను మళ్లీ ఎప్పటిలానే ఐపీఎస్ కోర్స్ పూర్తి చేయించాలని అనుకుంటాడు. అమ్మ ఎంత చెప్పినా కూడా రామచంద్ర భార్య కల కోసం కష్టపడాలని అనుకుంటాడు. ప్రత్యేకంగా ఐపీఎస్ కోర్సు ట్రైనింగ్ కోసం పుస్తకాలు తేవడమే కాకుండా ఇంట్లో అబద్ధం చెప్పి ప్రతిరోజు ట్రైనింగ్ సెంటర్ దగ్గర దించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మరో వైపు మల్లిక జానకి గుట్టు బయట పెట్టేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ జానకి అదృష్టవశాత్తు అత్తయ్య బారి నుంచి తప్పించుకుంటుంది.

    కేకుల పోటీలో ఇరికించిన మల్లిక

    కేకుల పోటీలో ఇరికించిన మల్లిక

    మొత్తానికి మళ్ళీ రామచంద్ర ఎప్పటిలానే జానకిని కేకులు నేర్పించడానికి కోసమని రాజమండ్రి వెళ్ళి ఐ.పి.ఎస్ పరీక్షల కోర్సులు చదివే ఇస్తూ ఉంటాడు. ఇక ముందుగానే వారి పై అనుమానం వ్యక్తం చేసిన మల్లిక కేకులు తయారు చేసుకునే షాపు దగ్గర జానకి లేదని గ్రహిస్తుంది. ఆమెను ఎలాగైనా మళ్లీ అత్తకు పట్టించాలని అనుకుంటుంది. అందుకోసమే కేకుల పోటీలు నిర్వహిస్తున్నారు అని ఆ పోటీలలో జానకిని ఎలాగైనా ఇరికించాలని అనుకుంటుంది. జానకి గుట్టు భయటపెట్టేందుకు ఇదే సరైన సమయమని అందుకు జ్ఞానాంబను కూడా మల్లిక ఒప్పిస్తుంది.

     మత్తు వదిలేలా..

    మత్తు వదిలేలా..

    ఇక మరోవైపు రామచంద్ర తన భార్య కోసం అని ప్రత్యేకంగా కొన్ని స్వీట్లు తయారు చేసి ఇస్తాడు. అయితే కస్టమర్ కు బంగుతో కలిపిన మత్తు స్వీట్స్ ఇవ్వాల్సి ఉండగా ఆ స్వీట్ బాక్స్ పొరపాటున జానకి వద్దకు చేరుతుంది. ఇక ఆ స్వీట్లు తినగానే జానకి చాలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంతేకాకుండా మల్లికా కూడా తినడంతో జ్ఞానంబ ముందు పిచ్చిగా ప్రవర్తిస్తుంది. గోవిందరాజులు మంచినీళ్లు అడిగినప్పటికీ కూడా మల్లిక తూలుతూ కల్లు తాగిన కోతిలా కనిపిస్తుంది. ఇక చివరికి విష్ణుని పిలిపించి నీ భార్యను ఇక్కడి నుంచి తీసుకెళ్ల అని ఆదేశిస్తుంది. ఇక ఆ తర్వాత తన భర్తను మల్లిక ముప్పుతిప్పలు పెడుతుంది. చివరికి గోవిందరాజులు మల్లికా పై మంచి నీళ్ళు పోసి ఆమె మత్తు వదిలేలా చేస్తాడు.

    ట్విస్ట్ ఇచ్చిన మల్లిక

    ట్విస్ట్ ఇచ్చిన మల్లిక

    ఇక ఉదయం జానకి ఎప్పటి ఇలానే కేకులు తయారు చేసుకోవడానికి రాజమండ్రి వెళుతున్నట్లు అబద్ధం చెప్పి ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. ఇక మరోవైపు రామచంద్ర ఆమెను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మల్లిక మధ్యలో వారికి అడ్డు పడుతుంది. ఈరోజు కేకులు తయారు చేసే పోటీలో పాల్గొనాల్సిందిగా ఆమె గుర్తు చేస్తుంది. జ్ఞానాంబకు కూడా అందుకు ఒప్పుకుంటుంది. జానకి కేకులు తయారు చేస్తే మన షాప్ కూడా చాలా మంచి పేరు వస్తుంది అని అందులో ఎలాగైనా గెలిచి తీరాలని చెబుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ కేకులా పోటీకి వెళితే జానకి నిజం బయట పెడుతుందని దిక్కు తోచని స్థితిలో ఉంటాడు. మరి జానకి ఆ పోటీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 192:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X