Janaki Kalaganaledu December 16th: మల్లిక వేసిన ప్లాన్ కు తెలివిగా ట్విస్ట్ ఇచ్చిన జానకి.. జ్ఞానాంబ హ్యాపీ!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు మామూలుగా లేవు. ఓ వైపు ఐపీఎస్ చదువును అబద్దాలతో కొనసాగిస్తున్న జానకి మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 45వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 46వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఇక రూరల్ ఏరియాలో 44వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 46వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 194 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

అత్త మనసులో ఆందోళన
రామచంద్ర ఏమి చదువుకోలేని అమాయకుడు అని అతని తల్లి జ్ఞానాంబ చదువు లేని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. అందుకోసం ఎన్నో సంబంధాలను చూస్తుంది. ఇక ఎవరు ఊహించని విధంగా జానకి కుటుంబసభ్యులు అబద్ధం చెప్పి రామచంద్ర కు ఇచ్చి పెళ్లి చేస్తారు. జానకి చదువుకున్న నిజం చాలా ఆలస్యంగా తెలుసుకున్న జ్ఞానాంబ ఎంతగానో భయపడుతుంది.
గతంలో తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆందోళనలో ఉన్న జ్ఞానాంబ అలాంటి తప్పు మరోసారి తన ఇంట్లో జరగకూడదని ఎంతగానో ఆలోచిస్తుంది. ఇక జానకి కూడా డిగ్రీ చదువుకుంది అని తెలియగానే మొదట చాలా ఆగ్రహంతో ఊగిపోయిన జ్ఞానాంబ తరువాత తన గురించి తెలుసుకుని ఆమె ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది.

అలా ఎప్పటికి జరగకూడదని
అయితే జానకి ఇంట్లో ఉండాలి అంటే మరోసారి తన చదువు గురించి ప్రస్తావన తీసుకు రావద్దు అని కూడా జ్ఞానాంబ ఒట్టు వేయించుకుంటుంది. ఇక అందుకు జానకి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. జానకి తన చిరకాల కోరిక అయినటువంటి ఐపీఎస్ చదువును కూడా వదిలేయడానికి సిద్ధమైనట్లు రామచంద్రకు అర్థమవుతుంది.
కానీ అలా ఎప్పటికి జరగకూడదని తన భార్యలను ఐపీఎస్ అవ్వడంలో ముందుకు సాగాలని రామచంద్ర కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఏమాత్రం పొరపాటు జరగకుండా జానకి ఐపీఎస్ కోర్సును పూర్తి చేయించేందుకు కోచింగ్ సెంటర్ లో కూడా జాయిన్ చేస్తాడు.

జానకి గుట్టు తెలుసుకునేందుకు..
ఇక ఆ వంకతో కేకులు నేర్చుకోవడానికి జానకి బయటకు వెళుతుంది అని రోజు ఇంట్లో అబద్ధం కూడా చెబుతాడు. ఆ విషయంలో జానకి ఆందోళన చెందినప్పటికీ కూడా రామచంద్ర ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూనే ఉంటాడు. అయితే మల్లిక జానకి గుట్టు తెలుసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
అయితే ఫైనల్ గా జానకి కేకులు తయారు చేయడానికి వెళ్ళలేదు అని నిజం తెలుసుకున్న మల్లిక ఆమెను అత్త ముందు దోషిగా పట్టించాలని అనుకుంటుంది. ఇక అప్పుడే కేకుల పోటీ నిర్వహిస్తున్నారు అని ఆ పోటీలలో జానకి పాల్గొంటే తప్పకుండా మన షాప్ కు కూడా మంచి పేరు వస్తుంది అని జ్ఞానాంబను నమ్మిస్తుంది.

వెన్నెల లవ్ స్టొరీ
ఇక కేకుల పోటీ అనగానే జానకి మొదట్లో కంగారు పడుతుంది. కానీ అక్కడ కూడా నిజం చెప్పలేక కేకులు తయారు చేసే పోటీలో పాల్గొనడానికి సిద్ధమౌతుంది. రామచంద్ర కూడా జానకి కేక్ ఎలా తయారు చేస్తుందో అని టెన్షన్ పడతాడు. ఇక మరొక వైపు నుంచి కార్పొరేటర్ నందాదేవి ఆ పోటీలకు ప్రత్యేక అతిథిగా వస్తుంది.
అయితే దారి మధ్యలోనే రామచంద్ర చెల్లెలు వెన్నెలలో తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ ఉండగా కన్నబాబు వీడియో తీస్తాడు. ఎప్పటికైనా అవసరం వస్తుంది అని తల్లితో చెబుతాడు.ఇక తర్వాత పోటీ లోకి వచ్చిన అనంతరం కార్పొరేటర్ సునందాదేవి విజేతలకు బహుమతిని ఇవ్వాలని చెబుతారు.

గెలవకపోయినా పరవాలేదు
అయితే ఆ సమయంలో పాత గొడవలన్నీ దృష్టిలో ఉంచుకొని తప్పకుండా సుందదేవి మన జానకికి మొదటి ప్రైజ్ రాకుండా చేస్తుంది అని గోవిందరాజులు ఆలోచిస్తాడు. అదే విషయాన్ని జ్ఞానాంబకు కూడా చెప్పగా.. అలా జరిగిన ఏం పర్వాలేదు అని ఎందుకంటే జానకి మన దృష్టిలో ఎప్పుడో గెలిచింది అని జ్ఞానాంబ సంతోషంగానే ఉంటుంది. ఇక వారి వెనకాల ఉన్న రామచంద్ర కూడా ఎంతగానో సంతోషిస్తాడు. జానకి కేకులు నేర్చుకోక పోయినా కూడా ఇంత బాగా తయారు చేస్తున్నారు ఏమిటని కొంత ఆశ్చర్యపోతాడు.

తెలివిగా ఆలోచించిన జానకి
మొదట జానకి కేకులు ఎలా తయారు చేయాలో అర్థం కాదు. ఇక ఆ తర్వాత పక్కన వారిని చూసి చాలా తెలివిగా కేకులు తయారు చేస్తుంది. తప్పకుండా గెలుస్తుంది అని అందరూ అనుకుంటారు. ఓవైపు మల్లిక కూడా ఆశ్చర్యపోతుంది. జానకి కేకులు అంత బాగా తయారు చేస్తోంది ఏమిటి అని తన మనసులో తనే బాధపడుతూ ఉంటుంది.
పోటీ ముగిసిన అనంతరం సునంద దేవి అందరి కేకులు పరీక్షించి విజేతను ప్రకటించాలని అనుకుంటుంది. మరి ఆ విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి. ఇక వెన్నెల ప్రేమ విషయంలో కన్నబాబు కూడా జానకి ఫ్యామిలీకి ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











