Janaki Kalaganaledu December 17th: గెలిచి ఇబ్బందుల్లో పడిన జానకి.. బోల్తా కొట్టిన గేమ్ ప్లాన్
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తో కొనసాగుతోంది. సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు మామూలుగా లేవు. ఐపీఎస్ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న కొనసాగిస్తున్న జానకి మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 45వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 46వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 44వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 46వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 195 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జ్ఞానాంబ బేధాలు చూపడంతో
జానకి విషయంలో ప్రతి సారి కూడా పగ పడుతున్న మల్లిక ఎలాగైనా జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఛాన్స్ దొరికినా ప్రతి సారి కూడా జ్ఞానాంబకు జానకి మధ్యలో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. కానీ ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ విషయంలో మాత్రం అన్ని విఫలం అవుతూనే ఉంటాయి. జానకినీ ప్రతి విషయంలోనూ జ్ఞానాంబ వెనకేసుకొని రావడం, పెద్ద కోడలు చాలా మంచిది అని చిన్న కోడలు అని చాలా చెడ్డది అని బేదాలు చూపడంతో మల్లిక చాలా అసూయను పెంచుకుంటుంది. ఇక మరొక సారి ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అసలు గుట్టు తెలుసుకోవాలని కూడా అనుకుంటుంది.

నిజం తెలియాలని..
జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా భర్త సహకారంతో ఐపీఎస్ కోర్సును పూర్తి చేయాలని అనుకుంటుంది.. రామచంద్ర ఆ విషయంలో జానకికి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు.. కేకు నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి జానకి ఐపీఎస్ కోర్సును సాధించాలని అనుకుంటుంది. ఇక ఏ సమయంలోనైనా అత్తయ్య కు నిజం తెలిసే అవకాశం ఉంటుంది అని జానకి భయపడుతూ ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం అందుకు ఒక ప్లాన్ వేస్తాడు. జానకి పేరుతో ఉన్న ఒక మహిళను కేకులు నేర్చుకోవడానికి సిద్ధం చేస్తాడు. ఇక అదే విషయం లో మల్లిక కూడా నిజం తెలుసుకుంటుంది. జానకి అక్కడ లేదు అని అని అత్తయ్య గారికి తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది. ఇక అందులో భాగంగా జానకికి కేకులు రావని తెలియజెప్పాలని అనుకుంటుంది. ఇక కేకలు పోటీ కూడా సిద్ధం కావాలని కి ప్రణాళికలు రచిస్తోంది.

వంద మార్కులు సాధించిన జానకి
కేకులు జరిగే పోటీల్లో జానకి పాల్గొంటే తప్పకుండా మొదటి బహుమతి గెలుస్తుంది అని జ్ఞానాంబ గోవిందరాజులని నమ్మిస్తుంది. ఒకవేళ జానకి గెలిస్తే మన షాప్ కి మంచి పేరు కూడా వస్తుంది అని చెప్పడంతో అత్తమామలు కూడా ఒప్పుకుంటారు. ఇక జానకి పోటీలలో పాల్గొనడానికి వెళుతున్న సమయంలో ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అక్కడ విజేతను నిర్ణయించడానికి కార్పొరేటర్ సునంద దేవి కూడా వస్తుంది. ఇక జానకి పోటీలో చాలా టెన్షన్ గా పాల్గొంటూ ఉండగా అందరూ ఆశ్చర్యపోతారు. అయితే తప్పకుండా సునంద దేవి పాత పగను కూడా దృష్టిలో ఉంచుకొని జానకిని తప్పకుండా విజేతగా ప్రకటించరు అని జ్ఞానాంబ ఆలోచిస్తుంది. కానీ సామాజిక వేత్తలు జానకి కేకులు తిన్న తర్వాత ఆమెకు వంద మార్కులు వేస్తారు. దీంతో తప్పక సునంద దేవి కూడా ఆమెను విజేతగా ప్రకటిస్తుంది.

ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ
జానకి విజేతగా నిలిచిన తర్వాత అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడతారు. జ్ఞానాంబ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత విష్ణు తో పాటు వెన్నెల అఖిల్ అందరూ కూడా జానకి శుభాకాంక్షలు తెలియజేస్తారు అయితే ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా జ్ఞానాంబ ఒక ట్విస్ట్ ఇస్తుంది. జానకి కి కేకులు తయారు చేయడంలో విజేతగా నిలిచింది కాబట్టి ఇక నుంచి ఆమె కేకులు తయారు చేయడానికి వెళ్ళకూడదు అని అంటుంది.
Recommended Video

మల్లికకు మరో పని..
జ్ఞానాంబ మాటలకు ఒక్కసారిగా జానకి రామ చంద్ర ఇద్దరు కూడా అవాక్కవుతారు. ఐపీఎస్ కోర్సు పూర్తి చేయడానికి రోజు రాజమండ్రి వెళ్తున్న జానకి మరొకసారి ఇబ్బంది ఎదురవుతుంది. రేపు తప్పనిసరిగా కోచింగ్ సెంటర్ లో హాజరు కావాల్సిన అవసరం ఉంది అని జానకి మరోసారి భర్తకు గుర్తు చేస్తుంది. ఇక ఆ విషయంలో మొదట కాస్త సందిగ్థంలో పడిన రామచంద్ర ఆ విషయంలో ఎలాంటి బాధ పడకుండా ఈ రోజు ప్రశాంతంగా పడుకోండి అని నేను ఏదో ఒకటి చేస్తాను అని ధైర్యం చెబుతాడు. ఇక ఆ తర్వాత మల్లిక కేకుల పోటీలలో గెలిచిన విషయాన్ని జీర్ణించుకోలేక మల్లిక బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో జ్ఞానాంబ మల్లికకు మరో పని చెబుతుంది. జానకి తో పాటు కేకులు నేర్చుకోవడానికి కార్ఖాను వెళ్లవలసిందిగా ఆదేశిస్తుంది.. మరి జానకి విషయంలో రామచంద్ర ఏవిధంగా ఆలోచిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











