twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 20th: మల్లికలో భయం కలిగించిన రామ.. భర్త కష్టానికి జానకి కంటతడి

    |

    జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. కథలోని విభిన్నమైన ట్విస్టులు మామూలుగా లేవు. ఇక ఐపీఎస్ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న కొనసాగిస్తున్న జానకి మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

    ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 196 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    బేదాలు చూపడంతో..

    బేదాలు చూపడంతో..

    జానకి ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటున్న తరుణంలో ప్రతి సారి కూడా పగ పడుతున్న మల్లిక ఎలాగైనా జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని అనుకుంటుంది. అందుకు ఆమెపై ఏదో ఒక నింద వేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఛాన్స్ దొరికినా ప్రతి సారి కూడా జ్ఞానాంబకు జానకి మధ్యలో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది.

    కానీ ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జానకి మాత్రం సేఫ్ గా ఉంటుంది. మల్లిక ప్లాన్స్ అన్ని అన్ని కూడా విఫలం అవుతూనే ఉంటాయి. ఇక మరోవైపు ప్రతి విషయంలోనూ జ్ఞానాంబ వెనకేసుకొని రావడం, పెద్ద కోడలు చాలా మంచిది అని చిన్న కోడలు అని చాలా చెడ్డది అని బేదాలు చూపడంతో మల్లిక చాలా అసూయను పెంచుకుంటుంది. ఇక మరొక సారి ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అసలు గుట్టు తెలుసుకోవాలని కూడా అనుకుంటుంది.

    జానకిలో అత్త భయం

    జానకిలో అత్త భయం

    ఎవరికి తెలియకుండా జానకి భర్త సహకారంతో ఐపీఎస్ కోర్సును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక అందుకోసం భర్త రామచంద్ర జానకికి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనే వంకతో అబద్ధం చెప్పి జానకి ఐపీఎస్ కోర్సును సాధించాలని అనుకుంటుంది. ఇక ఏ సమయంలోనైనా అత్తయ్య కు నిజం తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడుతూ ఉంటుంది.

    ఇక ఆ సమయంలో మల్లిక జానకి గుట్టు భయటపెట్టేందుకు ఆమెను తయారు చేసే పోటీలలో పాల్గొనెలా చేయాలని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే కేకుల.పోటీలో జానకిని దింపగా అక్కడ జానకి తెలివితో పోటీలో విజేతగా నిలుస్తుంది.

    ధైర్యం చెప్పిన రామ

    ధైర్యం చెప్పిన రామ

    ఇక ఇంటికి వచ్చిన తరువాత అందరూ కూడా జానకిని మెచ్చుకుంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం జానకి ఇక జానకి కేకులు నేర్చుకునేందుకు రాజమండ్రి వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చేసింది. జానకి కి కేకులు తయారు చేయడంలో విజేతగా నిలిచింది కాబట్టి ఇక నుంచి ఆమె కేకులు తయారు చేయడానికి వెళ్ళకూడదు అని అంటుంది.

    జ్ఞానాంబ మాటలకు జానకి రామ చంద్ర ఇద్దరు కూడా అవాక్కవుతారు. ఎలాగైనా ఐపీఎస్ కోర్సు పూర్తి చేయడానికి రోజు రాజమండ్రి వెళ్తున్న జానకి మరొకసారి ఇబ్బంది ఎదురవుతుంది. ఇక మరుసటి రోజు తప్పనిసరిగా కోచింగ్ సెంటర్ లో హాజరు కావాల్సిన అవసరం ఉందని రామచంద్రకు చెందుతుంది. ఇక ఆ విషయంలో టెన్షన్ పడకుండా ఉండాలనే రామచంద్ర ధైర్యం చెబుతాడు..

    మల్లికలో భయం కలిగించిన రామ

    మల్లికలో భయం కలిగించిన రామ

    ఇక జానకి అర్ధరాత్రి కూడా చదువుకుంటూ ఉంటుంది. ఇక ఆమె ఇంట్లో చదువుకునేందుకు కష్టంగా ఉందని రామచంద్ర బయటకు తీసుకు వచ్చి బైక్ లైట్ ఆన్ చేసి చదువుకోండి అని చెబుతాడు. భర్త ప్రేమకు జానకి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక ఆమెకు రామచంద్ర ప్రత్యేకంగా గ్రీన్ టీ తీసుకు రావాలని అనుకుంటాడు. అదే సమయంలో కరెంట్ కూడా పోతుంది.

    ఇక మల్లిక కూడా అదే సమయంలో లేచి నీళ్లు తాగడానికి వస్తుంది. ఇక ఆ సమయంలో రామ జానకి గదిలో లేరని బయట ఉన్నారని అనుకుంటుంది. వెంటనే బయటకు వెళ్లి చూద్దామని అనుకున్న సమయంలో రామచంద్ర ఆమెపై నిమ్మకాయల విసురుతాడు. పసుపు కుంకుమ ఉన్న నిమ్మకాయలు అని మల్లిక భయపడుతుంది.

    రామ పాదాలకు జానకి నమస్కారం

    రామ పాదాలకు జానకి నమస్కారం

    ఇక ఆ తరువాత భర్త రామచంద్ర పడుతున్న కష్టాన్ని చూసి జానకి కొంత అప్సెట్ అవుతుంది. ఇక భార్య కోసం ఆ మాత్రం చేయకపోతే భర్తగా నేను ఉండి ఎందుకు అని అనగానే జానకి మరింత ఎమోషనల్ అవుతుంది. అంతే కాకుండా ఒక్కసారిగా ఆమె కంటతడితో రామచంద్ర పాదాలకు నమస్కారం చేస్తుంది. మరి జానకి విషయంలో రామచంద్ర ఇంకా ఏవిధంగా ఆలోచిస్తాడో చూడాలి.

    జానకి కి కేకులు తయారు చేయడంలో విజేతగా నిలిచింది కాబట్టి ఇక నుంచి ఆమె కేకులు తయారు చేయడానికి వెళ్ళకూడదు అని అంటుంది. ఇక మరోవైపు కేకుల పోటీలలో జానకి గెలిచిన విషయాన్ని జీర్ణించుకోలేక మల్లిక బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో జ్ఞానాంబ మల్లికకు మరో పని కూడా చెబుతుంది. ఇక నుంచి జానకి తో పాటు కేకులు నేర్చుకోవడానికి కార్ఖాను నువాబు కూడా వెళ్లవలసిందిగా మల్లికను ఆదేశిస్తుంది. ఆ విషయంలో రామ ఏ విధమైన ప్లాన్ వేస్తాడో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 196
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X