Janaki Kalaganaledu December 20th: అఖిల్ కు మరీంత కోపం వచ్చేలా మల్లిక ప్లాన్.. జానకి వెనుకడుగు!
జానకి కలగనలేదు సీరియల్ కథ మరో కీలక మలుపు తిరుగుతోంది. చిన్న కోడలు జెస్సికి కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక ఆమె భర్త అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. ఇక అతను ఎదో ఒక రకంగా సెటిల్ అయితే బాగుంటుంది అని జానకి కూడా అనుకుంటుంది. కానీ అఖిల్ జానకి పై కోపక్ తెచ్చుకుంటాడు. ఇక జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 457 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అఖిల్ విషయంలో బాధలు
అఖిల్ విషయంలో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మరొకసారి ఆలోచనలు పడతారు. అతను ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా ఇంకా జాబ్ సంపాదించుకోలేదు అని కెరీర్ సెట్ చేసుకోలేదు అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తండ్రి గోవిందరాజులు కూడా కొడుకు మీద బాధతో మందులు కూడా సరిగ్గా వేసుకోడు. దీంతో అతనికి గుండె నొప్పి వస్తుంది. వెంటనే పెద్ద కొడుకు రామచంద్ర టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ కోలుకునేలా చేస్తాడు. ఎలాగైనా తమ్ముడు అఖిల్ తన భవిష్యత్తును సరిదిద్దుకోవాలి అని రామ ఆలోచిస్తూ ఉంటాడు.

అఖిల్ కు కోపం తెప్పించేలా..
అయితే జానకి కూడా ముందుగా అతని కోర్స్ పూర్తయితే ఏదో ఒక జాబ్ వస్తుంది అని రామచంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం జానకి ఏదో తప్పుగా చెబుతుంది అని తప్పుగా అర్థం చేసుకొని ఆమెపై మరోసారి అసహనం వ్యక్తం చేస్తాడు. చెప్పేది వినకుండా అతను జానకి వదిన తనపై ఏదో కక్ష సాధిస్తుంది అని అంటాడు. అంతేకాకుండా మరొకవైపు మల్లికా జానకి పై కోపం తెప్పించేలా మరిన్ని అబద్ధాలు అఖిల్ కు చెబుతుంది నువ్వు ఏ పని చేయడం లేదు అని నిన్న వచ్చిన తన చుట్టాల దగ్గర కూడా జానకి చెప్పింది అని మల్లికా అతనితో చెప్పడంతో మరింత కోపం తెచ్చుకుంటాడు.

చిన్ననాటి స్నేహితుడు
ఇక అఖిల్ ఎలాగైనా జాబ్ సంపాదించాలి అని సర్టిఫికెట్ తీసుకొని బయటకు వెళతాడు. అయితే జానకి రామచంద్ర ఇద్దరు కూడా అఖిల్కు ఎలాగైనా ఏదో ఒక జాబ్ వచ్చేలా చూడాలని అనుకుంటారు. ఇక రామ, జానకిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళుతూ ఉండగా ఒక కారు ఆగి ఉంటుంది. అయితే ఏదో సమస్య రావడంతో రామచంద్ర దాన్ని చూడాలని అనుకుంటాడు. అయితే కారులో ఉన్న వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడు అని తెలియడంతో ఎంతగానో సంతోషిస్తాడు.

అఖిల్ కోసం జాబ్
అయితే ఈ ఊర్లోనే తాను కొత్తగా ఒక సాఫ్ట్ వెర్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నట్లుగా చెబుతాడు. దీంతో రామచంద్ర ఎంతగానో సంతోషించి నా తమ్ముడు కూడా అదే చదువు చదివాడు నువ్వేమైనా జాబ్ ఇవ్వగలవా అని అంటాడు. తప్పకుండా ఇస్తాను అని తన కార్డు కూడా ఇస్తాడు. దీంతో రామచంద్ర కారును రిపేర్ చేసి అతడికి ఇస్తాడు. ఇక అఖిల్ కొన్ని ఇంటర్వ్యూలో హాజరై ఇంటికి నిరాశతో తిరిగి వస్తాడు. ఇక గుమ్మం దగ్గర కూర్చొని ఉన్న మల్లిక అఖిల్ ఏ జాబ్ రాలేనట్లు ఉంది అని అతనికి మరింత కోపం తెప్పించిన చేయాలి అని మాట్లాడుతుంది.

మల్లిక సలహాలు
నువ్వు ఏమీ అనుకోకపోతే నేను ఒక సలహా ఇస్తాను అని ఇక్కడ ఉండి జాబ్ వెతికితే దొరకదు అని హైదరాబాద్ లేదా బెంగళూరు సిటీలలో వెతికితే జాబ్ వస్తుంది అని మల్లిక సలహా ఇస్తుంది. అంతే కాకుండా జాబ్ వచ్చేవరకు మీ చిన్న అన్నయ్య విష్ణు షాప్ లో చీరలు మడత పెడుతూ పనిచేసుకోవచ్చు కదా అని చెబుతోంది. దీంతో అఖిల్ మరింత అసహనం వ్యక్తం చేస్తాడు. నేను చీరలు మడత పెట్టుకోవాలా అని అంటాడు. అయితే అప్పుడే వారిద్దరి దగ్గరకు వచ్చిన అఖిల్ భార్య జెస్సి జాబ్ వచ్చిందా అని భర్తను అడుగుతుంది. ఇక మల్లికా పక్కనే ఉండి రాలేదు అంటూ.. నేను ఒక మంచి సలహా ఇచ్చాను అని కానీ అతను వినడం లేదు అని మల్లిక చెబుతుంది. అదేదో వినవచ్చు కదా అని జెస్సి కూడా చెప్పడంతో అఖిల్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు.

జనాకితో చెప్పగానే..
ఇక మరోవైపు జానకి ఇంట్లో సమస్యల గురించి ఆలోచిస్తూ చదువును పక్కన పెడుతుంది. దీంతో వెంటనే ప్రిన్సిపల్ వచ్చి నువ్వు మరో రెండు నెలల్లో మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు కాస్త సీరియస్ గా చదువుపై దృష్టి పెట్టాలి అని సలహా ఇస్తుంది. దీంతో జానకి మళ్ళీ చదువుపై శ్రద్ధ పెడుతుంది. ఇక రామచంద్రా ఇంటికి రాగానే తన స్నేహితుడి ఇచ్చిన కార్డు గురించి జానకితో చెబుతాడు. అతను జాబ్ ఇస్తానని అన్నాడు అని దాని గురించి నువ్వు అఖిల్ తో చెప్పాలి అని భార్యకు చెబుతాడు. కానీ అతనికి మాత్రం నేను చెప్పలేను అని అంటుంది. మరి ఆ విషయంలో రామచంద్ర జానకి తో ఏ విధంగా మాట్లాడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











