Janaki Kalaganaledu December 21st: గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ టెన్షన్ పడేలా చేసిన జ్ఞానాంబ.. సందిగ్ధంలో జానకి!

జానకి కలగనలేదు సీరియల్ బుల్లితెర పై రోజురోజుకు అభిమనుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. కథలోని విభిన్నమైన ట్విస్టులు మామూలుగా లేవు. ఐపీఎస్ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. అయితే మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 197 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని..

ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని..

జానకి తన భర్త సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. అయితే అదే సమయంలో జానకిని ఏ మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని ఆమెను ఇంట్లో నుంచి ఎలాగైనా బయటకు పంపించేయాలని మల్లిక ప్రణాళికలు రచిస్తోంది. ఇక మల్లిక ఎన్ని ఎత్తులు వేసినా కూడా జానకికి ఒక విధంగా అది అదృష్టంగానే కలిసివస్తుంది. జ్ఞానాంబ కూడా జానకి మంచితనం తో ఆమెకు మరింత దగ్గర అవుతుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం ఓర్చుకోని మల్లిక ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటుంది.

పగను పెంచుకుంటున్న మల్లిక

పగను పెంచుకుంటున్న మల్లిక

ప్రతి విషయంలోనూ కూడా పెద్ద కోడలిని ఎక్కువగా ఆప్యాయంగా చూడటం ఏమాత్రం నచ్చడం లేదు అంటూ మల్లిక రోజు రోజుకు తన పగను పెంచుకుంటూనే ఉంటుంది. ఇక ఫైనల్ గా జానకి కేకులు తయారు చేసే పోటీలో గెలవడంతో జ్ఞానాంబ మరింత మెచ్చుకుంటుంది. అయితే జానకి ప్రతిరోజూ కేకులు నేర్చుకోవడానికి రాజమండ్రి వెళుతున్నాను అని అబద్దం చెబుతుంది. అక్కడే భర్త సహకారంతో ఐపీఎస్ కోర్సుకు సంబంధించిన కోచింగ్ కూడా తీసుకుంటుంది.

సందిగ్ధంలో జానకి

సందిగ్ధంలో జానకి

ఇక కేకులు తయారు చేసే పోటీలో గెలవడంతో జ్ఞానాంబ మరో ట్విస్ట్ ఇస్తుంది. జానకి విజయం సాధించింది కాబట్టి ఆమె కేకులు నేర్చుకోవడానికి వెళ్లాల్సిన అవసరం లేదు అని ఆదేశిస్తుంది. ఇక ఆ మాటతో జానకి మళ్లీ సందిగ్ధంలో పడుతుంది. ఎలాగైనా మళ్లీ కోచింగ్ సెంటర్ కు వెళ్లాలి అని భర్తను అడుగుతుంది. ఇక అందుకు రామచంద్ర మీరు ధైర్యంగా ఉండండి ఉదయం లోపు ఎలాగైనా ఏదో ఒక ప్రణాళిక సిద్ధం చేద్దాం అని ధైర్యం చెబుతాడు.

భయం చూపించిన రామ

భయం చూపించిన రామ

అయితే జానకి అర్ధరాత్రి చదువుకుంటున్న సమయంలో మల్లికా నిద్రలేచి మల్లికకు చూడాలని అనుకుంటుంది. ఇక ఆమెకు రామచంద్ర భయాన్ని కలిగిస్తాడు. దొంగ చాటుగా నిమ్మకాయలు విసరడమే కాకుండా నల్ల దుప్పటి కప్పుకు వచ్చి మల్లికను రామచంద్ర ఎంతగానో భయానికి గురిచేస్తాడు. ఆమె ఉదయాన్నే లేచి ఇంట్లో దెయ్యం ఉంది అని అత్తగారికి చెబుతుంది. అందుకు జ్ఞానాంబ నీ మొహం అద్దంలో చూసుకున్నావా ఏంటి అని కూడా ప్రశ్నిస్తుంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జ్ఞానాంబ

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జ్ఞానాంబ

ఇక ఆ విషయం గురించి చర్చ జరుగుతున్న సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన రామచంద్ర జానకి రాజమండ్రి వెళ్ళాలి అని అనుకుంటారు. ఇక రామచంద్ర చాలా తెలివిగా తల్లిని మాటలతో మాయ చేస్తాడు. జానకి మరొక రకమైన కొత్త రకమైన కేకు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది అని రామచంద్ర తన తల్లికి చెబుతాడు.

తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని జానకి కూడా చెప్పడంతో అందుకు జ్ఞానాంబ కూడా ఒప్పుకుంటుంది. కోడలు తప్పకుండా నేర్చుకోవాలి అని చెబుతోంది కాబట్టి ఈ సారికి ఒప్పుకుంటున్నారు అని జ్ఞానాంబ మరోసారి నవ్వుతూ సమాధానం ఇస్తుంది. తల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామచంద్ర ఎంతో సంతోషంగా జానకిని రాజమండ్రి తీసుకువెళ్లడానికి బయలుదేరుతాడు.

జ్ఞానాంబ ఇచ్చిన మరో ట్విస్ట్

జ్ఞానాంబ ఇచ్చిన మరో ట్విస్ట్

అయితే అదే సమయంలో జ్ఞానాంబ మరొకసారి ట్విస్ట్ ఇస్తుంది. నువ్వు షాప్ కి వెళ్ళు, నేను కోడల్ని కేకులు తయారు చేసే బేకరీ దగ్గర వదిలి వస్తాను అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక జ్ఞానాంబ తీసుకున్న నిర్ణయానికి రామచంద్ర జానకి ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇప్పుడు అమ్మ గాని జానకితో వెళ్ళింది అంటే మొత్తం విషయం బయటపడుతుంది. ఆ తరువాత జానకిని కాపాడడం ఎవరి వల్ల కాదు అని రామచంద్ర ఎంతగానో ఆందోళనకు గురి అవుతాడు. ఇక రామచంద్ర ఎంత చెప్పినా కూడా వినకుండా జ్ఞానాంబ జానకిని తీసుకువెళుతుంది.

మరింత టెన్షన్..

మరింత టెన్షన్..

ఇక మధ్యలో జానకి కారు దిగి నేను కాలేజ్ లో ఒక స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలని, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తానని అంటుంది. ఇక అత్తయ్య గారు మీరు వెళ్ళండి అని జానకి సమాధానం ఇస్తుంది. కానీ జ్ఞానాంబ నేను కూడా వస్తాను అని చెప్పడంతో జానకి మరింత టెన్షన్ పడుతుంది. ఇక ఇద్దరూ కూడా ఒక కాలేజ్ దగ్గరికి వెళ్లడంతో అక్కడ జానకి చెప్పిన పేరుతో ఎవరు లేరు అని జ్ఞానాంబ తెలుసుకుంటుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధానంగా భయటపడుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X