Janaki Kalaganaledu December 22nd: జ్ఞానాంబ నుంచి మరోసారి తప్పించుకున్న జానకి.. రామ ప్లాన్ సక్సెస్!

జానకి కలగనలేదు సీరియల్ మరోసారి ఆసక్తికరమైన అంశంతో రేటింగ్స్ ను గట్టిగానే పెంచుకుంటోంది. రీసెంట్ గా కథలో సరికొత్త ట్విస్టులు సీరియల్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఐపీఎస్ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 198 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

 ఆటంకాలను తెలివిగా దాటుకుంటూ

ఆటంకాలను తెలివిగా దాటుకుంటూ

జానకి సైలెంట్ గా భర్త రామచంద్ర సహాయంతో ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక అదే సమయంలో ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపించాలాని మల్లిక ప్రణాళికలు రచిస్తోంది. ఇక మల్లిక ఎన్ని ఎత్తులు వేసినా కూడా జానకికి ఒక విధంగా అది అదృష్టంగానే కలిసివస్తుంది. జ్ఞానాంబ కూడా జానకి మంచితనం తో ఆమెకు మరింత దగ్గర అవుతుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం ఓర్చుకోని మల్లిక ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటుంది. ఇక జానకి ఎన్నో ఆటంకాలను తెలివిగా దాటుకుంటూ వెళుతుంది.

ఏ మాత్రం ప్రేమ లేదని..

ఏ మాత్రం ప్రేమ లేదని..

ఇక తనపై అత్తకి ఏ మాత్రం ప్రేమ లేదని మల్లిక మరో కాపురం పెట్టాలని అనుకుంటుంది. ఇక ప్రతీ విషయంలోనూ పెద్ద కోడలిని ఎక్కువగా ఆప్యాయంగా చూడటం ఏమాత్రం నచ్చడం లేదని మల్లిక రోజు రోజుకు తన పగను పెంచుకుంటూనే ఉంటుంది. అయితే ఊహించని విధంగా జానకి కేకులు తయారు చేసే పోటీలో గెలవడంతో జ్ఞానాంబ మరింత మెచ్చుకుంటుంది. అయితే జానకి ప్రతిరోజూ కేకులు నేర్చుకోవడానికి రాజమండ్రి వెళుతున్నాను అని అబద్దం చెబుతుంది. అక్కడే భర్త సహకారంతో ఐపీఎస్ కోర్సుకు సంబంధించిన కోచింగ్ కూడా తీసుకుంటుంది. కానీ జ్ఞానాంబ నేను జానకిని కేకులు తయారు చేసే బేకరీ దగ్గర వదిలి పెడతాను అని చెబుతుంది.

ఎంత చెప్పినా వినకుండా

ఎంత చెప్పినా వినకుండా

ఇంట్లో ఎవరికీ తెలియకుండా కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పిన జానకి ఊహించని విధంగా అత్త నుంచి ఆటంకం ఎదురవుతుంది. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో జ్ఞానాంబ కూడా తన వెంట వస్తానని చెప్పడంతో జానకి టెన్షన్ లో పడుతుంది. ఇప్పుడు తను కేకులు నేర్చుకోవడానికి వెళ్లడం లేదు అని ఐపీఎస్ కోర్సుకు సంబంధించిన కోచింగ్ తీసుకోవడానికి వెళుతున్నట్లు తెలిస్తే అత్తగారు తప్పకుండా తనను ఇంట్లో నుంచి పంపించేస్తారు అని ఆందోళన చెందుతుంది.. ఇక రామచంద్ర ఎంత చెప్పినా కూడా వినకుండా జ్ఞానాంబ జానకిని తన వెంట తీసుకు వెళుతుంది.

రామచంద్ర ప్లాన్

రామచంద్ర ప్లాన్

అయితే ఏం చేయాలో అని ఆలోచిస్తున్న తరుణంలో రామచంద్ర ఊహించని విధంగా జ్ఞానాంబ, జానకి వెళుతున్న కారుకు అడ్డు వస్తాడు. మధ్యలో ఒక కాలేజ్ దగ్గర ఒక మాస్టర్ కు స్వీట్లు ఇవ్వాల్సి ఉంది అని జానకి వెళ్లి ఇస్తుంది అని తల్లితో చెబుతాడు. ఇక అందుకు ఆమె ఒప్పుకుంటుంది. అయితే జానకి ఆ ప్లాన్ అర్థమవుతుంది. తన ఐపీఎస్ కోచింగ్ సెంటర్ దగ్గర దిగేసి అక్కడి నుంచి అత్తను పంపించాలని అనుకుంటుంది.

కానీ జ్ఞానాంబ కూడా జానకి మరొక షాక్ ఇస్తుంది. ఇదేదో కొత్త తరహా కాలేజీ ఉంది అని నేను కూడా వస్తాను అని చెబుతుంది. లోపలికి వెళ్లి రామచంద్ర చెప్పిన పరమేశ్వర రావు అని మాస్టర్కు స్వీట్స్ ఇవ్వాలని అనుకుంటారు. అదే విషయాన్ని జ్ఞానాంబ ఒక స్టూడెంట్ ను అడుగుతుంది. అయితే అక్కడ అలాంటి పేరుతో ఎవరూ లేరు అని చెప్పడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది.

టెన్షన్ లో జానకి

టెన్షన్ లో జానకి

ఇక అదే విషయం లో జానకి కూడా టెన్షన్ పడుతుంది. ఇక జ్ఞానాంబకు అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. మరొకరు ఫోన్ చేసి తొందరగా రావాలి అని చెబుతారు. అయితే ఆ సమయంలోనే జానకి పరమేశ్వర రావు గారు కాదు ఈశ్వరరావు గారు అని ఆయన ఇక్కడే ఉంటారు అని చెబుతుంది. స్టూడెంట్ కూడా ఆయన పక్క గదిలో ఉన్నారు అని చెప్పగానే జానకి మీరు వెళ్లిపోండి అని సమాధానం ఇస్తుంది.

ఇక జ్ఞానాంబ తను తొందరగా వెళ్ళిపోవాలి అని ఈ స్వీట్స్ నువ్వు ఇచ్చేసి బేకరీ కి వెళ్ళు అని చెబుతుంది. అందుకు జానకి కూడా సంతోషంగా ఫీల్ అవుతున్న తరుణంలో మరో వైపు నుంచి ఆమె క్లాస్మేట్ కూడా అక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పుడే జ్ఞానాంబ అతని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతుంది.

మల్లిక అనుమానం..

మల్లిక అనుమానం..

ఇక ఆ తర్వాత అలసిపోయి ఇంటికి వచ్చి బెడ్ పై పడుకున్న సమయంలో రామచంద్ర జానకిని చూస్తాడు. ఆమె భోజనం కూడా చేయలేదు అని గ్రహించి భార్య కోసం పళ్లెంలో అన్నం పెట్టుకొని రావాలని అనుకుంటాడు. అదే తరుణంలో మల్లిక ఎప్పుడూ లేనిది బావగారు ఎందుకు అన్నం పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు అని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తుంది.

ఇక అప్పుడు రామచంద్ర కొంత కన్ఫ్యూజన్ అవుతున్న తరుణంలో వెంటనే అతని తండ్రి గోవిందరాజులు వచ్చి నాకు తెలుసు అని చెబుతాడు. వెంటనే అక్కడ నుంచి మెల్లగా రామచంద్రరావు వెళ్లిపోవడంతో మల్లిక మామయ్యను అడుగుతుంది. కానీ అందుకు గోవిందరాజులు కన్ఫ్యూజన్ గా సమాధానం చెబుతూ ఉంటాడు. మరి ఈ విషయంలో మల్లికా ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X