For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 22nd: తమ్ముడి కోసం రిస్క్ చేస్తున్న రామచంద్ర.. మళ్ళీ అదే తప్పు!

    |

    జానకి కలగనలేదు సీరియల్ కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. జ్ఞానాంబ చిన్న కోడలు జెస్సి గర్భవతి అవుతుంది. కానీ కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆమె భర్త అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. ఇక అతను ఎదో ఒక రకంగా సెటిల్ అయితే బాగుంటుంది అని జానకి, రామ కూడా కోరుకుంటారు. కానీ అఖిల్ జానకి పై కోపం తెచ్చుకుంటాడు. ఇక జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 459 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    ఇంటర్వ్యూలో అఖిల్

    ఇంటర్వ్యూలో అఖిల్

    అఖిల్ ఏదైనా జాబ్ సంపాదించుకొని తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంటూ ఉంటాడు. అందుకోసం కొన్ని ఇంటర్వ్యూలకు కూడా వెళతాడు. కానీ ఎందులోనూ అతను సెలెక్ట్ కాడు. అయితే రామచంద్ర తన స్నేహితుడు ఒక కొత్త కంపెనీ పెట్టబోతున్నాడు అని అక్కడికి వెళితే నీకు ఉద్యోగం దొరుకుతుంది అని రామచంద్ర అతని దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. అంతేకాకుండా నీకు జాబ్ వచ్చే విధంగా అతనితో నేను మాట్లాడతాను అని అంటాడు. అయితే అందుకు అఖిల్ మాత్రం ఒప్పుకోడు. రికమండేషన్ ఏమీ వద్దు అని నా సొంతంగానే జాబ్ సంపాదించుకుంటారు అని అందరిలానే నేను కూడా ఇంటర్వ్యూ లోకి వెళతాను అని చెబుతాడు.

    అఖిల్ తెలివైనవాడు

    అఖిల్ తెలివైనవాడు

    అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అఖిల్ ఇంటర్వ్యూలో వారు అడిగిన అన్నిటికి కూడా సమాధానాలు చెబుతాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర అఖిల్ కు తెలియకుండా ఆ కంపెనీకి వచ్చి అతని స్నేహితుడితో మాట్లాడుతాడు. మా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు కదా గుర్తుపట్టావా అని అంటాడు. అఖిల్ మీ తమ్ముడా అని రామచంద్ర స్నేహితుడు కూడా ఆశ్చర్యపోతాడు. అయితే అతను చాలా తెలివివంతుడు అని కూడా చెబుతాడు. ఇక అతనికి ఏదైనా చదువు తగ్గట్టుగా జాబ్ ఇవ్వాలి అని రామచంద్ర కోరడంతో అతను కొంత ఆలోచిస్తాడు.

    20 లక్షలు పెట్టుబడి

    20 లక్షలు పెట్టుబడి

    బిటెక్ చేశాడు కాబట్టి అతని చదువుకు తగ్గట్టుగా జాబ్ ఇవ్వాలి అంటే ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టాలి అని ఉంటాడు. నేను మొదలుపెట్టబోతున్న ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఒక ఐదు మందిని అనుకుంటున్నాను. వాళ్ళు 20 లక్షలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు. ప్రాజెక్టు సక్సెస్ అయితే మళ్లీ 5-6 నెలల్లోనే మళ్లీ వారు పెట్టుబడి మొత్తం వెనక్కి వస్తుంది. ఆ విధంగా మీ తమ్ముడి విషయంలో 20 లక్షలు పెట్టుబడి పెట్టగలవా అని అతని స్నేహితుడు అనడంతో రామచంద్ర మల్లి ఆలోచనలో పడతాడు.

    మల్లిక పగ

    మల్లిక పగ

    ఎలాగైనా అఖిల్ కెరీర్ సెట్ చేయాలి అని కూడా రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జానకి విషయంలో మల్లిక మరింత సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. నీలావతి పెద్దమ్మ అప్పుడే రావడంతో ఆమెతో మాట్లాడుతూ జానకి ఐపీఎస్ చదవకూడదు అని ఆమెను అత్తయ్య గారి ముందు దోషిల నిలబెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మల్లిక మాటలు విన్న నీలావతి ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ మల్లిక మాటలో ఆమె పెద్దగా పట్టించుకోదు.

    జాబ్ రావాలని ఇంట్లో వారి కోరిక

    జాబ్ రావాలని ఇంట్లో వారి కోరిక

    ఇక ఆ తర్వాత రామచంద్ర ఇంటికి వస్తూ ఉన్న సమయంలో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా జాబ్ విషయంలో జ్ఞానాంబ అఖిల్ ను ప్రశ్నిస్తుంది. ఏదైనా జాబ్ చూసుకున్నావా అని అడుగుతుంది. కొన్ని చూసుకున్నాను అని ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది అని కూడా ఆమె చెబుతుంది. దీంతో పక్కనే ఉన్న తండ్రి గోవింద రాజులు కూడా కొడుకుకు సలహా ఇస్తాడు. పెద్దది చిన్నది అని తేడా ఏమీ లేదు అని చదువుకున్న వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు అని నువ్వు కూడా అలా ఏదైనా ఉంటే చూసుకో అని చెబుతాడు. అందుకు అఖిల్ కూడా సరే అని అంటాడు.

    మళ్ళీ అదే తప్పు

    మళ్ళీ అదే తప్పు

    అయితే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అఖిల్ జాబ్ కోసం ఆలోచిస్తున్నారు అని రామచంద్ర తమ్ముడి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. అందుకోసం అతను మళ్ళీ ఒక పొరపాటు చేస్తాడు. ఇంటి కి సంబంధించిన పేపర్లను ఒక దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతాడు. అయితే రామచంద్ర గతంలో మాదిరిగానే ఒక తెల్ల పేపర్ మీద సంతకం పెట్టడానికి ఒప్పుకుంటాడు. గతంలో కన్నబాబు మరొక వ్యక్తి చేత రామచంద్ర షాప్ కు సంబంధించిన పేపర్లు పెట్టుబడిగా పెట్టుకొని అప్పులు ఇస్తాడు. ఇప్పుడు మరోసారి తమ్ముడు అఖిల్ కోసం రామచంద్ర కొన్ని ఆస్తి పత్రాలను మరొక చోట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలని అనుకుంటాడు. మరి ఈ విషయంలో ఎలాంటి మోసం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 459:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X