Janaki Kalaganaledu December 23rd: జానకి నడుమును చూసి రామచంద్ర టెన్షన్.. క్యూట్ రొమాన్స్!

జానకి కలగనలేదు సీరియల్ లో మరోక కీలక ఘట్టం మొదలైంది. అత్తగారికి తెలియకుండా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకి తన మరిది కారణంగా మరోసారి ఇరకాటంలో పడుతుంది. రేటింగ్స్ ను గట్టిగానే పెంచుకుంటోంది. రీసెంట్ గా కథలో సరికొత్త ట్విస్టులు సీరియల్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. తన చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 198 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జానకిని బయటకు పంపించాలాని..

జానకిని బయటకు పంపించాలాని..

భర్త రామచంద్ర సహాయంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జనకికి అనుకోని ఆటంకాలు ఎదురావుతు ఉంటాయి. జానకిని ప్రశాంతంగా ఉండనివ్వకూడదని, ఇంటి నుంచి బయటకు పంపించాలాని మల్లిక ప్రణాళికలు రచిస్తోంది. అయితే మల్లిక ఎన్ని ఎత్తులు వేసినా కూడా జానకి తెలివిగా వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తోంది.

జ్ఞానాంబ కూడా జానకి మంచితనంతో ఆమెకు మరింత దగ్గర అవుతుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం ఓర్చుకోని మల్లిక ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటుంది. ఇక జానకి ఎన్నో ఆటంకాలను తెలివిగా దాటుకుంటూ వెళుతుంది.

జానకి కోసం భోజనం

జానకి కోసం భోజనం

చాలా జ్ఞానాంబ, జానకి మధ్యలో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ కూడా మల్లిక ఏమాత్రం ఓర్చుకోదు. వారి మధ్య లో ఎలాగైనా గొడవలు పెట్టాలని అనుకుంటుంది. అయితే ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా మల్లికకు ఎదురు దెబ్బలు తగులుతాయి. రోజురోజుకీ తన ఆగ్రహాన్ని పెంచుకుంటుంది. మరోవైపు జ్ఞానాంబ ప్రేమగా చూడడంతో మల్లిక మరింత ద్వేషం పెంచుకుంటుంది. జానకిని అలాగే ఆమె భర్త రామచంద్ర ఏ పని చేసినా కూడా అనుమానంతో చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఇది ఇటీవల రామచంద్ర తన భార్యకు భోజనం పెట్టాలని అని అనుకుంటాడు. ఎప్పుడు లేనిది గదిలోకి భోజనం ఎందుకు తీసుకు వెళుతున్నాడు అని అనుమానం వ్యక్తం చేయగా గోవిందరాజులు వచ్చి ఆమెను కన్ఫ్యూజ్ చేస్తాడు. దీంతో మల్లిక ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తుంది.

జానకి నడుముపై రామ రొమాన్స్

జానకి నడుముపై రామ రొమాన్స్

ఇంకా రామచంద్ర సైలెంట్ గా వెళ్లి జానకికి భోజనం పెట్టాలని అనుకుంటాడు. అప్పుడే నిద్రలోకి జారుకున్న జానకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. రామచంద్ర తన చూపులను తిప్పుకోకుండా జానకి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా గాలికి ఆమె నడుము దగ్గర చీర కాస్త జరగడంతో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అంతే కాకుండా జానకి నడుము మీద చేయి వేసేందుకు ప్రయత్నం చేస్తాడు ఇక ఫైనల్ గా అక్కడ టచ్ చేసిన రామచంద్ర చాలా కంగారు పడుతూ ఉంటాడు.

ఇక అప్పుడే నిద్రలేచిన జానకి ఉలిక్కిపడి ఏం జరిగింది అని అడుగుతుంది. పొరపాటున ఖుషి సినిమా తరహాలో మీ నడుమును చూసి ఉక్కిరిబిక్కిరి అయినట్లు చెబుతారు. తప్పుగా అనుకోకండి అని జానకిని అడగగానే నేను మీ భార్యని ఆమె గుర్తు చేస్తుంది. రామచంద్ర కూడా ఎంతగానో సంతోషిస్తారు.

అఖిల్ టెన్షన్..

అఖిల్ టెన్షన్..

మరోవైపు ఉదయం అఖిల్ చాలా కంగారుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తల్లి జ్ఞానాంబను తలుపు చాటునుంచి తొంగి తొంగి చూస్తూ గాభరా పడుతూనే ఉంటాడు. అతను టెన్షన్ ఉన్నట్లు గమనించిన చెల్లెలు వెన్నెల ఎందుకు అలా కంగారుగా ఉన్నాడని అడుగుతుంది. దీంతో అఖిల్ పరీక్షల ఫలితాల గురించి చెబుతాడు.

నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను నువ్వు పాస్ అయ్యావు అని చెబుతూ.. నేను ఫెయిల్ అయ్యాను అని తెలిస్తే అమ్మ చాలా తిడుతుందిని.. అందుకే ఈ విషయాన్ని చెప్పకుండా దాచాలని అఖిల్ వెన్నెలను బ్రతమాలుతూ ఉంటాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
ఇదంతా నీ వల్లే జరిగింది..

ఇదంతా నీ వల్లే జరిగింది..

ఇక వీరి సంభాషణ గురించి అటు వైపు నుంచి వచ్చిన మల్లిక వింటుంది. వెంటనే ఈ విషయాన్ని అత్త గారికి చెప్పి ఇంట్లో గొడవ పెట్టాలి అని అనుకుంటుంది. అంతేకాకుండా జానకిని కూడా అందులో ఇరికించాలని అనుకుంటుంది. జ్ఞానాంబని పిలిచి మా డబ్బులతో చదువుకుంటున్న అఖిల్ పరీక్షల్లో తప్పుడు అనే నిజాన్ని చెబుతుంది.

ఇక ఆ తర్వాత జ్ఞానాంబ జానకి కూడా తిడుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది అనవసరంగా ఇంటి పెత్తనం తీసుకొని తప్పు చేసావు. ఎంత చెబుతున్న కూడా ఎవరికీ తెలియకుండా అతనికి గిటార్ కొనిపించావు.. ఇప్పుడు అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీనికి అంతటికి కారణం నువ్వే అని జానకి చెబుతుంది.. మరి ఆ గొడవలు జానకి చదువు పై ఎంత ప్రభావం చూపిస్తాయో.. చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X