Janaki Kalaganaledu December 24th: అఖిల్ కోసం మరో ఛాలెంజ్ చేసిన జానకి.. జ్ఞానాంబ ఫైర్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. అత్తకు తెలియకుండా ఐపీఎస్ కు సంబంధించిన చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకి తన మరిది కారణంగా మరోసారి ఇబ్బందుల్లో పడుతుంది. ఇక సీరియల్ అసలు ట్రాక్ లోకి రావడంతో రేటింగ్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. కథలో సరికొత్త ట్విస్టులు సీరియల్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. తన చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 198 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎన్ని ఎత్తులు వేసినా..
ఐపీఎస్ కు సంబంధించిన చదువును పూర్తి చేయాలని అనుకున్న జనకికి ఊహించని విషంగా ఆటంకాలు ఎదురావుతు ఉంటాయి. ఇంట్లో ఎవరికి తెలియకుండా భర్త సపోర్ట్ తో కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. అయితే అనుమానాలతో తొడి కోడలిపై పగ తీర్చుకునేందుకు మల్లిక ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది.
జానకిని ఏ మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వకూడదని, ఇంటి నుంచి బయటకు పంపించాలాని మల్లిక ఆలోచిస్తుంది. అయితే మల్లిక ఎన్ని ఎత్తులు వేసినా కూడా జానకి ఆ ఆటంకాలు నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకుంటుంది. జ్ఞానాంబ కూడా జానకి మంచితనంతో ఆమెకు మరింత దగ్గర అవుతుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం ఓర్చుకోని మల్లిక ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటుంది. ఇక జానకి ఎన్నో ఆటంకాలను తెలివిగా దాటుకుంటూ వెళుతుంది.

పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో
అఖిల్ పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మల్లిక ఆ విషయంతో గొడవ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. జానకిని కూడా అందులో ఇరికించాలని అనుకుంటుంది. జ్ఞానాంబని పిలిచి మా డబ్బులతో చదువుకుంటున్న అఖిల్ పరీక్షల్లో తప్పాడు అనే నిజాన్ని చెబుతుంది. అఖిల్ చదువు ఇలా అవ్వాడానికి ముఖ్య కారణం జానకి అంటూ అందరికీ చెబుతుంది. ఎందుకంటే చాలా చక్కగా చదువుకుంటూన్న అఖిల్ కు గిటార్ కొనిచ్చి చెడగొట్టింది జానకి అని గుర్తు చేస్తుంది. ఇక ఆ విషయంలో గోవింద రాజులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జ్ఞానాంబ మాత్రం సైలెంట్ గా అఖిల్ ని తీసుకుని స్వీట్ షాప్ కి వెళ్ళిపోతుంది.

టెన్షన్ లో జానకి..
రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఐపీఎస్ కోచింగ్ విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ విషయం ఎప్పటికైనా అత్త గారికి తెలిస్తే తన భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉంది అని మళ్ళీ మన ఇంట్లో గొడవలు మొదలవుతాయి అని ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆ విషయంలో రామచంద్ర జానకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడు. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఏం జరిగినా కూడా నేను ఉన్నాను కదా అని మరోసారి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఇదంతా నీ వల్లే జరిగింది..
ఇక అదే సమయంలో జ్ఞానాంబ రామచంద్ర స్వీట్ షాప్ దగ్గరకు చిన్న కొడుకు అఖిల్ ను తీసుకువస్తుంది. ఇక నుంచి అఖిల్ కూడా షాప్ లోనే అన్ని రకాల పనులు చేస్తాడు అని రామచంద్రకు చెబుతుంది. ఆ విషయంలో రామచంద్ర సందేహం వ్యక్తం చేయడంతో అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు అని అంటుంది. ఇక అందుకు రామచంద్ర మరొకసారి వాడికి అవకాశం ఇవ్వాలని అంతేకాకుండా ట్యూషన్ పెట్టిస్తే కూడా బాగా చదువుతాడు అని సలహా ఇస్తాడు. అదే విషయాన్ని జానకి కూడా చెబుతుండడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదంతా నీ వల్లే జరిగింది అని జ్ఞానాంబ గిటార్ ఇచ్చిన విషయాన్ని చెబుతుంది.

చదువును గాలికి వదిలేశాడు
వాడికి గిటార్ కొని ఇవ్వకపోతే ఇప్పుడు బాగా చదువుకొని ఉండేవాడు అని ప్రశ్నిస్తుంది. జానకి గిటార్ కొనివ్వలేదు అని రామచంద్ర చెప్పబోతుంటే జానకి అడ్డుపడుతుంది. ఇక జ్ఞానాంబ తప్పంతా జానకి వల్లే జరిగింది అని అపోహలో మాట్లాడుతుంది. తన కొడుకులకు ఏం కావాలో తనకు తెలియదా? అంటూ పెద్దకొడుకు తమ్ముళ్ల కోసం కుటుంబం కోసం తన చదువును త్యాగం చేశాడు అని అలాగే చిన్నవాడికి లక్షలు పోసి చదివినా కూడా చదువుకోలేదు అని ఎంతో బాధగా మాట్లాడుతుంది. ఇక మూడవ కొడుకు అయినా చాలా చక్కగా చదువుకొని ఉద్యోగం చేస్తాడు అనుకుంటే ఇప్పుడు వాడు కూడా చదువును గాలికి వదిలేశాడు అని ఆవేదన చెందుతుంది.
Recommended Video

జానకి మరో ఛాలెంజ్..
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఖిల్ ను స్వీట్ షాప్ లో పని లో పెట్టాలి అని రామచంద్రను జ్ఞానాంబ అదేశిస్తుంది. అయితే అఖిల్ మాత్రం ఏ పని కూడా సరిగా చేయడు అతను తీవ్రంగా కష్టపడుతూ ఉంటే రామచంద్ర ఆ బాధను చూసి తట్టుకోలేక పోతాడు. ఇక ఆ తర్వాత జానకి అత్త దగ్గరికి వెళ్లి ఇక నుంచి అఖిల్ కు నేను ప్రత్యేకంగా ట్యూషన్ చెబుతాను అని తప్పకుండా ఈ సారి పాస్ అయ్యేలా చేస్తాను అని చెబుతుంది. ఒకవేళ అతను పరీక్షల్లో పాస్ కాకపోతే మీరు ఎలాంటి శిక్ష వేసినా కూడా నేను అనుభవిస్తాను అని మరోసారి చాలెంజ్ చేస్తుంది. ఇక జ్ఞానాంబ కూడా అందుకు ఒప్పుకుంటుంది. మరి అఖిల్ విషయంలో జానకి ఏవిధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











