twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 26th: రామ ఇంట్లో ఆనందాలు. అసలు నిజం తెలిసి షాక్ అయిన జానకి!

    |

    జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో కొనసాగుతోంది. జెస్సి భర్త అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. ఇక అతను ఎదో ఒక రకంగా సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు.

    అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 461 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

     అఖిల్ కెరీర్ కోసం

    అఖిల్ కెరీర్ కోసం

    చిన్ననాటి స్నేహితుడు చరణ్, రామచంద్రకు హఠాత్తుగా కాలుస్తాడు. అయితే అతను కొత్తగా ఒక కంపెనీ పెట్టబోతున్నట్లు తెలుసుకున్న రామచంద్ర తమ్ముడు అఖిల్ కి కూడా ఒక ఉద్యోగం వచ్చేలా చేయాలని అనుకుంటాడు.

    అయితే చరణ్ మాత్రం చదువు తగ్గ జాబ్ ఇవ్వలేను అని ఏదైనా చిన్న జాబ్ దొరుకుతుంది అని అంటాడు. అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ కావాలి అంటే నేను స్టార్ట్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టులో 20 లక్షలు పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చరణ్ అంటాడు.

    ఫోన్ చేసిన చరణ్

    ఫోన్ చేసిన చరణ్

    రామచంద్ర తమ్ముడి భవిష్యత్తు కోసం ఆలోచించి 20 లక్షలు సమకూర్చడానికి ఇంటి పత్రాలను తాకట్టు పెడతాడు. ఒక తెల్లని కాగితం మీద సంతకం పెట్టి ఇంటి పత్రాలను అప్పు ఇచ్చిన వారికి అందజేస్తాడు. ఇక రామచంద్ర తర్వాత డబ్బు తీసుకొని వెళ్లి తన స్నేహితుడికి ఇచ్చి తమ్ముడికి జాబ్ ఇవ్వాలి అని అంటాడు.

    ఇక ఈ డబ్బు మూడు నెలల్లోనే వెనక్కి వస్తుంది అని కూడా చరణ్ చెప్పడంతో రామచంద్ర నిజమని నమ్ముతాడు. ఇక అఖిల్ కు చరణ్ ఫోన్ చేసి ఉద్యోగం వచ్చింది అని కూడా చెప్పడంతో అతను ఎంతగానో సంతోషిస్తాడు. ఇక ఇంట్లో అందరికీ కూడా ఉద్యోగం వచ్చింది చెప్పడం వలన ఒక పండగ వాతావరణం నెలకొంటుంది.

    జ్ఞానాంబ ఇంట్లో ఆనందాలు

    జ్ఞానాంబ ఇంట్లో ఆనందాలు

    ముఖ్యంగా గోవిందరాజులు అయితే తన కొడుక్కి ఉద్యోగం వచ్చింది అని తన స్నేహితుడికి ఫోన్ చేసి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. జ్ఞానాంబ కూడా పూజ గదిలోకి వెళ్లి ప్రార్థిస్తూ అందరూ కూడా అఖిల్ భవిష్యత్తు సరైన మార్గంలో వెళుతుంది అని ఆనందపడతారు.

    ఇక అప్పుడే తన పుట్టింటి నుంచి వచ్చిన జానకి పరిస్థితిని చూసి ఏం జరిగిందో అని అనుకుంటుంది. ఒక గోవిందరాజులు కూడా జానకికి విషయం చెప్పి సరైన సమయానికి వచ్చావమ్మా మీ చిన్న మరిదికి ఉద్యోగం వచ్చింది అని ఆనందంగా చెబుతాడు.

    రామ క్షమాపణ

    రామ క్షమాపణ

    ఇక తర్వాత రామచంద్ర కూడా సంతోషంగా మాట్లాడతాడు. అయితే జానకి వచ్చిన తర్వాత రామచంద్ర అసలు విషయం చెప్పాలని అనుకుంటాడు. అంతేకాకుండా మీ నాన్నగారి అప్తికం కార్యక్రమానికి నేను పాల్గొనలేకపోయినందుకు క్షమించండి అని రామచంద్ర ఆమెను అడుగుతాడు. అయితే జానకి మాత్రం రామచంద్ర ఏదో టెన్షన్ పడుతున్నాడు అని అనుమానిస్తుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని కూడా అడగడంతో రామచంద్ర అసలు విషయం చెబుతాడు.

    నిజం చెప్పిన రామ

    నిజం చెప్పిన రామ

    అఖిల్ ఉద్యోగం కోసం మా చిన్ననాటి స్నేహితుడు పెట్టుబడిగా 20 లక్షలు కావాలని అడగడంతో ఇచ్చాను అని అంటాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా రామచంద్ర మన ఇంటి పత్రాలను తాకట్టుగా పెట్టాను అని కూడా చెప్పడంతో జానకి మరింత ఆశ్చర్యానికి గురి అవుతుంది. రోజు వార్తల్లో చూడడం లేదా ఉద్యోగం ఇచ్చేవాడు అసలు డబ్బు ఎందుకు అడుగుతాడు అని మీరు మోసపోయారేమో అనిపిస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

    అయితే రామచంద్ర మాత్రం అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అతను ఎప్పటినుంచో నాకు తెలిసిన స్నేహితుడు అని ఈ మధ్యనే మన ఊరికి వచ్చే కొత్తగా కంపెనీ కూడా పెట్టడానికి సిద్ధమయ్యాడు అని అంటాడు.

    ఎన్నో సమస్యలు వస్తాయి

    అఖిల్ తో పాటు మరొకరు కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు అని రామచంద్ర చెబుతాడు. రామచంద్ర ఎంత చెప్పినా కూడా జానకి మాత్రం ఆ విషయాలను నమ్మడానికి ఆసక్తి చూపరు అంతేకాకుండా మీరు ఇంటిని తాకట్టు పెట్టిన విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పాలి అని లేకపోతే అనవసరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అని జానకి అంటుంది.

    జానకిని అడ్డుకున్న రామ

    జానకిని అడ్డుకున్న రామ

    ఇక జానకి అసలు విషయాన్నీ ఇంట్లో చెప్పాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం ఆమెను అడ్డుకుంటాడు. ఇప్పుడు అఖిల్ కు జాబ్ వచ్చింది అని ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని మీరు అనవసరంగా ఈ విషయం చెబితే మళ్ళీ అందరూ బాధపడతారు అని అంటాడు. అలాగే మూడు నెలల్లోనే మళ్లీ ఆ డబ్బు వెనక్కి తిరిగి వస్తుంది అని కూడా చరణ్ చెప్పాడు అని రామచంద్ర నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ జానకి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది. మల్లిక మరోవైపు అఖిలను కోపం వచ్చేలా జానకి పై అబద్దాలు చెబుతుంది. మరి ఈ పరిణామాలు రామచంద్ర కుటుంబంలో ఎలాంటి మలుపులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 461
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X