Janaki Kalaganaledu December 27th: వెన్నెల పెళ్లి చర్చల్లో ప్రేమ వ్యవహారం.. మరో బాంబ్ పేల్చిన మల్లిక
జానకి కలగనలేదు సీరియల్ మరో కీలకమైన మలుపు తిరగబోతోంది. అత్తకు తెలియకుండా ఐపీఎస్ కు సంబంధించిన చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకి మళ్ళీ కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుంది. తన మరిది కారణంగా మరోసారి ఛాలెంజ్ చేస్తుంది. ఇక సీరియల్ అసలు ట్రాక్ లోకి రావడంతో రేటింగ్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. కథలో సరికొత్త ట్విస్టులు సీరియల్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. తన చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది.
ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 198 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

మరిన్ని సమస్యల్లో జానకి
జానకిపై రివెంజ్ తీర్చుకునేందుకు ఎప్పటికప్పుడు మల్లిక ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయలని వివిధ రకాల సాకులు చెప్పి గొడవలు పెట్టాలని చూస్తుంది. అయితే ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ ఆ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.
జానకి చదువు విషయం తెలిసినప్పటికీ కూడా తన ఎదో పొరపాటు వల్ల జరిగిందని క్షమించేస్తుంది. అయితే జానకి అనుకోకుండా ఇతర సమస్యలలో కూడా పడుతుంది. ఇంట్లో కుటుంబ సమస్యలను దాటుకుంటూ తన చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక సందర్భంలో చేదు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

అఖిల్ కోసం జానకి ఛాలెంజ్
అఖిల్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో స్వీట్ షాప్ లో పని లో పెట్టాలి అని రామచంద్రను జ్ఞానాంబ అదేశిస్తుంది. అఖిల్ మాత్రం ఏ పని కూడా సరిగా చేయడు అతను తీవ్రంగా కష్టపడుతూ ఉంటే రామచంద్ర ఆ బాధను చూసి తట్టుకోలేక పోతాడు. ఇక ఆ తర్వాత జానకి అత్త దగ్గరికి వెళ్లి ఇక నుంచి అఖిల్ కు నేను ప్రత్యేకంగా ట్యూషన్ చెబుతాను అని, ఈ సారి పాస్ అయ్యేలా చేస్తాను అని చెబుతుంది.
ఒకవేళ అతను పరీక్షల్లో పాస్ కాకపోతే మీరు ఎలాంటి శిక్ష వేసినా కూడా అనుభవిస్తాను అని మరోసారి చాలెంజ్ చేస్తుంది. ఇక జ్ఞానాంబ కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఒకవేళ అఖిల్ ఫేయిల్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటా నో తనకే తెలియదని జ్ఞానం చెప్పడంతో రామచంద్రపురం కొంత ఆందోళన చెందుతాడు.

వెన్నెల పెళ్లి సంబంధం
ఇక వెంటనే తన తమ్ముడితో తప్పకుండా ఈ పరీక్షలో పాస్ అవ్వాలని లేకపోతే మీ వదినను పై భారం పడుతుంది అని చెబుతాడు. అఖిల్ కూడా తప్పకుండా పరీక్షలో పాస్ అవుతారని వదిన పేరు కూడా నిలబడతాను అంటూ నమ్మకం వ్యక్తం చేస్తాడు. ఇక రామచంద్ర జానకి తీసుకుంమ నిర్ణయానికి కొంత సంతోషం వ్యక్తం చేస్తాడు.
ఇక ఆ తర్వాత గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబతో సరదాగా మాట్లాడుకుంటూ రేపు రామచంద్రపురం వెళ్తున్నాము కాబట్టే అందరికీ ఒక విషయాన్ని చెప్పాలి అని గుర్తు చేస్తాడు. వేరే టెన్షన్ లో పడి ఆ సంగతే మర్చిపోయాను అని చెప్పిన జ్ఞానాంబ తన భర్తకు రంగులు వేస్తూ అందరికి చెప్పాలని అనుకుంటుంది. ఇక అందరూ రాగానే జ్ఞానాంబ వెన్నెల పెళ్లి సంబంధం గురించి చెబుతుంది.

అభిప్రాయాలు అడిగిన జ్ఞానాంబ
తన చిన్న కూతురు వెన్నెలకు రామచంద్రపురంలో ఒక సంబంధం దొరికింది అని వెన్నెలను ఒక పెళ్లి లో చూసి వారు చాలా ఇష్ట పడ్డారు అని చాలా ఉన్నతమైన కుటుంబం అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక ప్రతి ఒక్కరిని వారి అభిప్రాయాలను కూడా తెలియజేయమని చెబుతుంది. ముందుగా గోవిందరాజులు రామచంద్ర ను అడగడంతో తనకు ఇష్టమేనని చెబుతాడు. దానికి జానకి కూడా మీరు ఏది చేసినా పిల్లల క్షేమం గురించి ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీరు చెప్పినట్లే కానివ్వండి అని చెబుతుంది.

వెన్నెల ప్రేమ విషయం
అయితే విష్ణు కూడా అదే తరహాలో సమాధానం ఇవ్వడంతో మల్లిక మాత్రం అందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం చేస్తున్న విధానం తనకు ఏమాత్రం నచ్చలేదు అని చెబుతోంది అంతేకాకుండా వెన్నెల మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కూడా మల్లిక నిజాన్ని బయట పెడుతుంది. కానీ ఆ విషయాన్ని జ్ఞానాంబ ఏ మాత్రం నమ్మదు.

జానకి సహాయం కోరిన వెన్నెల
నిద్రపోవడానికి కూడా అనుమతి తీసుకునే తన కూతురు తనకు తెలియకుండా ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది అంటే నేను మాత్రం నమ్మను అని అనవసరంగా నువ్వు నా కూతురిపై అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరిస్తుంది.. ఇక ఆ తర్వాత వెన్నెల తన ప్రేమ విషయం గుర్తు చేసుకుని ఎంతగానో బాధ పడుతుంది. ఇక అదే విషయాన్ని జానకి కూడా చెబుతుంది. చూస్తుంటే జానకి ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. మరి జానకి ఆలోచనలు ఎంత వరకు వెళతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











