twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 28th: జానకితో అసలు నిజం చెప్పిన వెన్నెల.. ప్రేమ విషయంలో మరో ట్విస్ట్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జానకి అత్తకు తెలియకుండా ఐపీఎస్ కు సంబంధించిన చదువును పూర్తి చేయాలని అనుకుంటుండగా మళ్ళీ కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుంది. తన మరిది కారణంగా మరోసారి ఛాలెంజ్ చేస్తుంది. ఇక సీరియల్ అసలు ట్రాక్ లోకి రావడంతో రేటింగ్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. కథలో సరికొత్త ట్విస్టులు సీరియల్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. తన చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది.

    ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 202 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    రివెంజ్ తీర్చుకోవాలని..

    రివెంజ్ తీర్చుకోవాలని..

    జానకిని ఎక్కువ ప్రేమతో చూస్తున్నారని రివెంజ్ తీర్చుకునేందుకు మల్లిక ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. ఇక ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయలని వివిధ రకాల సాకులు చెప్పి గొడవలు పెట్టాలని చూస్తుంది. అయితే ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ ఆ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.

    జానకి చదువు విషయం తెలిసినప్పటికీ కూడా తన ఎదో పొరపాటు వల్ల జరిగిందని క్షమించేస్తుంది. అయితే జానకి అనుకోకుండా ఇతర సమస్యలలో కూడా పడుతుంది. ఇంట్లో కుటుంబ సమస్యలను దాటుకుంటూ తన చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక సందర్భంలో చేదు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

    బాధ్యత తీసుకున్న జానకి

    బాధ్యత తీసుకున్న జానకి

    చిన్న మరిది అఖిల్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో స్వీట్ షాప్ లో పని లో పెట్టాలి అని జ్ఞానాంబ పెద్ద కొడుకు రామచంద్రను అదేశిస్తుంది. అయితే అఖిల్ మాత్రం ఏ పని కూడా సరిగా చేయడు. అఖిల్ కష్టపడుతూ ఉంటే రామచంద్ర ఆ బాధను చూసి తట్టుకోలేక జానకితో చెబుథ్ది. ఇక ఆ తర్వాత జానకి అత్త దగ్గరికి వెళ్లి ఇక నుంచి అఖిల్ కు నేను ప్రత్యేకంగా ట్యూషన్ చెబుతాను అని, ఈ సారి పాస్ అయ్యేలా చేస్తాను అని చెబుతుంది.

    ఒకవేళ అతను పరీక్షల్లో పాస్ కాకపోతే మీరు ఎలాంటి శిక్ష వేసినా కూడా అనుభవిస్తాను అని మరోసారి చాలెంజ్ చేస్తుంది. ఇక జ్ఞానాంబ కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఒకవేళ అఖిల్ ఫేయిల్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో తనకే తెలియదని జ్ఞానం చెప్పడంతో రామచంద్ర కొంత ఆందోళన చెందుతాడు.

    మల్లిక మరో అనుమానంతో..

    మల్లిక మరో అనుమానంతో..

    జ్ఞానాంబ కూడా చిన్న కూతురు వెన్నెల పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక అందుకోసం గోవిందరాజులు రామచంద్రపురం లో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కూడా చూస్తాడు. వాళ్ళది చాలా ఉన్నతమైన కుటుంబం అని తప్పకుండా మన వెన్నలను బాగా చూసుకుంటారు అని ఇంట్లో అందరికి చెబుతాడు. అయితే ఆ నిర్ణయంపై జ్ఞానాంబ ఇంట్లో వాళ్ల నిర్ణయం కూడా అడుగుతుంది.

    మీకు నచ్చింది చేయండి అని సమాధానం ఇవ్వగా చిన్న కోడలు మల్లిక మాత్రం అనుమానం కలుగజేసేలా మాట్లాడుతుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కదా అదే తరహాలో వెన్నెల కూడా ఏదైనా నిర్ణయం తీసుకుందో ఏమోనని, ఆమెను కూడా అడగాల్సిన అవసరం ఉంది అని సలహా ఇస్తుంది.

    మల్లికకు జ్ఞానాంబ హెచ్చరిక

    మల్లికకు జ్ఞానాంబ హెచ్చరిక

    మల్లిక మాట్లాడిన విధానానికి జ్ఞానాంబ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏ పని చేసినా కూడా నా కూతురు నన్ను అడిగే చేస్తుంది. నేను వాళ్ళను పద్ధతిగా పెంచాను. ఈ విషయంలో నువ్వు అనవసరంగా నిందలు వేసి తప్పుగా మాట్లాడకూడదు.. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని జ్ఞానాంబ కోడల్ని హెచ్చరిస్తుంది. తర్వాత కూడా చాలా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక గోవింద రాజులు కూడా ఆమె గురించి తెలిసిందే కదా అని జ్ఞానాంబను కూల్ చేస్తాడు.

    రామచంద్ర రావడంతో..

    రామచంద్ర రావడంతో..

    మరోవైపు వెన్నెలా ఎలాగైనా ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పాలని అని అనుకుంటుంది. లేదంటే తొందరగా పెళ్లి చేస్తారని భయపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయంలో తనకు సహాయం చేసేది జానకి వదిన మాత్రమే అని గ్రహిస్తుంది. అఖిల్ పరీక్షల్లో ఫెయిల్ అయినా కూడా జ్ఞానాంబ నుంచి తప్పిస్తుంది. ఇక ఇప్పుడు తనను కూడా ఈ గండం నుంచి తప్పిస్తుంది అనే ఆలోచనతో వెన్నెల జానకీ వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. ఇక అదే సమయంలో రామచంద్ర రావడంతో మళ్లీ ఆమె వెనకడుగు వేస్తుంది.

    అసలు విషయం చెప్పిన వెన్నెల

    అసలు విషయం చెప్పిన వెన్నెల

    ఇక ఉదయం దీనంగా కూర్చున్నా వెన్నెలను జానకి అసలు విషయం ఏమిటి అని అడుగుతుంది. ఇక అప్పుడే వెన్నెల తన ప్రేమ గురించి అసలు నిజం చెబుతుంది. అసలే జానకి విషయంలో జ్ఞానాంబ చాలా నమ్మకంగా ఉంటుంది. ఈ తరుణంలో ఈ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అని జానకి కంగారు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ సమయంలోనే జానకి క్లాస్మేట్ కూడా పుస్తకాలు ఇవ్వడానికి వస్తాడు. మరి ఈ తరుణంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 202
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X