For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 2nd: జ్ఞానాంబని అరెస్ట్ కాకుండా చేసిన జానకి.. పోలీసులకు స్ట్రాంగ్ కౌంటర్

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరొక ఇంట్రెస్టింగ్ ట్రాక్ లోకి మారింది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కలలు కలగానే మిగిలిపోతున్న తరుణంలో ఆమెకు భర్త నుంచి కూడా సహాయం అందుతుంది. అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని అనుకున్న జానకి కొంత సందిగ్ధంలో పడుతుంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

  ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 184వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  వారి మధ్యలో చిచ్చు పెట్టాలని

  వారి మధ్యలో చిచ్చు పెట్టాలని

  జానకినీ ప్రతి విషయంలో జ్ఞానాంబ మెచ్చుకోవడం మల్లికకు ఏమాత్రం నచ్చదు. ఎలాగైనా వారి మధ్యలో చిచ్చు పెట్టాలని మల్లిక ఎన్నో కుట్రలు పన్నుతోంది. అయితే ఎలాంటి ప్లాన్ వేసిన కూడా రివర్స్ అవుతుంది. అంతేకాకుండా వారిద్దరి మధ్య లో కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది అని మల్లిక అసహనం వ్యక్తం చేస్తోంది.

  ఇక ఈ సారి మల్లి వేసిన ప్లాన్ చాలా సీరియస్ గా మారుతుంది. ఏకంగా జ్ఞానాంబ అరెస్టు చేసే వరకు విషయం రావడంతో తన మనసులో భయం కూడా కలుగుతుంది. మల్లిక చేసిన మోసం గురించి ఇంకా తెలియని జానకి ఊహించని విధంగా పోలీసులను కౌంటర్ ఇచ్చి అరెస్టు చేయకుండా కాపాడుతుంది.

  జ్ఞానాంబను అరెస్ట్ చేయాలని

  జ్ఞానాంబను అరెస్ట్ చేయాలని

  జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరూ కలిసి సునంద దేవి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు వెళ్తారు. జ్ఞానాంబ వచ్చిన తర్వాత ఒక్కసారిగా పార్టీలోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. జ్ఞానాంబ అరెస్టు చేయబోతున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇటీవల మీరు ఆర్డర్ చేసిన పూతరేకుల కారణంగా ఒక ఫంక్షన్లో కొంతమంది ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు చేసుకున్నారు అని, వారు హాస్పిటల్లో చేరడం తో పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతారు. అయితే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని పాతికేళ్లుగా ఎంతో నమ్మకంగా ఉన్న మేము అలాంటి తప్పులు చేయము అంటూ గోవిందరాజులు పోలీసులను బ్రతిమాలతాడు.

   షాక్ ఇచ్చిన జానకి

  షాక్ ఇచ్చిన జానకి

  ఇంకా రామచంద్ర విష్ణు కూడా సునంద దేవిని ఎంతగానో బ్రతిమలుతారు. మీకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది కదా మా అమ్మగారిని అరెస్ట్ చేయకుండా చేయండి అని ఎంతగానో వేడుకుంటారు. ఇప్పుడు మా అమ్మగారిని అరెస్టు చేస్తే ఆమెకు గౌరవం పోతుంది అని అంతేకాకుండా ఇన్నేళ్లు మా షాప్ కి ఉన్న మంచి పేరు కూడా పోతుంది అని రామచంద్ర చెబుతాడు.

  కానీ సునంద మాత్రం జ్ఞానాంబ విషయంలో ఎలాంటి సహాయం చేయగలను అని మొహం మీద చెప్పేస్తుంది. ఇక పోలీసులు ఆమెను అరెస్టు చేయాలి అని చెప్పడంతో రామచంద్ర వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జానకి వారి కాళ్లు పట్టుకోవలసి అవసరం లేదు అని అత్తయ్య గారిని ఇప్పుడు ఎవరు అరెస్టు చేయలేదు అంటూ అందరికీ షాక్ ఇస్తుంది.

  పోలీసులను తిప్పికొట్టిన జానకి

  పోలీసులను తిప్పికొట్టిన జానకి

  సరైన ఆధారాలతో అరెస్టు చేయాలని జానకి పోలీసులను ప్రశ్నిస్తుంది. కేవలం పూతరేకుల కారణంగానే వాంతులు చేసుకున్నారు అని మీరు ఎలా చెబుతున్నారు కేవలం పూతరేకులు మాత్రమే కాకుండా ఆ రోజు వాళ్ళ ఇంటి ఫంక్షన్ కి బయట నుంచి కూడా వేరే వాళ్ల నుంచి కూడా క్యాటరింగ్ ఆర్డర్ చేశారు. ఆ రూట్లో కూడా వాళ్లు అస్వస్థతకు గురి అయి ఉండవచ్చు. ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించ లేదు.

  కేవలం పూతరేకుల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని మీరు ఎలా చెబుతున్నారు. ముందుగా పూతరేకులు ల్యాబ్ లో పరీక్షించి వాటి లో కల్తీ జరిగింది అని తెలిస్తే.. సరైన ఆధారాలతో అరెస్టు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక మహిళను అరెస్టు చేయడానికి మీరు మహిళ పోలీసులను కూడా వెంట తీసుకొని రాలేదు పద్దతి చూస్తుంటే రూల్స్ ను మీరు ఏమాత్రం ఫాలో అవ్వనట్లు తెలుస్తోంది అని జానకి తన చదువును అక్కడ ప్రదర్శించడంతో అందరూ షాక్ అవుతారు.

  Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
  బయటపడిన మల్లిక కుట్ర

  బయటపడిన మల్లిక కుట్ర

  ఆ తర్వాత పోలీసులు సరైన ఆధారంతో వస్తామని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అంతేకాకుండా కేసు పెట్టిన వ్యక్తిని కూడా కేసు వాపసు తీసుకునేలా జానకీ మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర జానకి చదువు గురించి తల్లి దగ్గర గొప్పగా చెబుతాడు. జానకి చదువు కారణంగానే ఈరోజు మీరు అరెస్టు కాకుండా బయటపడ్డారు.

  అంతేకాకుండా మన ఇంటి గౌరవం కూడా జానకి కాపాడింది అని గర్వంగా చెబుతాడు. కానీ జ్ఞానాంబ మనసులో మాత్రం తెలియని అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక ఆ తర్వాత మల్లిక విషం కలిపిన బాటిల్ ని ఇంట్లో నుంచి బయట పడేస్తున్నతున్న తరుణంలో జానకి చూస్తుంది. ఆ విషయాన్ని రామచంద్రకు కూడా చెబుతోంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 183
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X