Janaki Kalaganaledu December 2nd: సమస్యలు మర్చిపోయి జానకి, రామ రొమాన్స్.. అల్లరి ప్రేమ!
జానకి కలగనలేదు సీరియల్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. జానకి చిన్న మరిది అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ ఘటనను చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి మాటలను ఎవరు నమ్మరు. ఆమె పొరపాటు పడి ఉంటుంది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. అఖిల్ కూడా ఆ విధంగా అందరిని నమ్మిస్తాడు. జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 445 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మళ్ళీ పరీక్షలు రాయించే విధంగా..
జానకి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో రామచంద్ర కొంత కన్ఫ్యూజన్లో పడతాడు. ఆమెను మళ్ళీ పరీక్షలు రాయించే విధంగా రెడీ చేయాలనే అనుకుంటాడు. కానీ జానకి మాత్రం రామచంద్ర మాటలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా చాలా ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. అయితే జ్ఞానాంబ చిన్ననాటి స్నేహితురాలు భానుమతిని కలుసుకోవాలి అని రామచంద్ర ఊరికి బయలుదేరుతాడు. చిన్నప్పుడు రామచంద్ర ఆమె దగ్గరే ఎక్కువగా ఉంటాడు. ఆమెను మరో తల్లిలా అతను గౌరవిస్తాడు. అందుకే భానుమతిని కలుసుకునేందుకు తన వెంటని జానకిని కూడా తీసుకువెళతాడు.

సంతోషమైన ప్రయాణం
అయితే ఆ ప్రయాణంలో జానకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన సంఘటనలను ఆమె ఏమాత్రం గుర్తు చేసుకోకుండా తన భర్తతో ప్రకృతిలో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక వారిద్దరూ ఒక చెట్టు దగ్గర ఆగి చింతకాయలు కొడుతూ ఉంటారు. అయితే రామచంద్ర ఒక రాయిని తీసుకొని కొట్టడంతో అది పక్కనే పొలంలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి తగులుతుంది. అతను వారి వెంట పడడంతో జానకి రామచంద్ర పరిగెత్తుకుంటూ పారిపోతారు. జానకి ఎంతో సరదాగా నవ్వుకుంటూ పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉంటుంది. అసలు జానికి గారు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారో అర్థం కావడం లేదు అని రామ కాస్త కన్ఫ్యూషన్ లో పడతాడు.

పట్టీలతో జానకి రొమాన్స్
ఇక ఆ తర్వాత దారి మధ్యలో జానకి తనకు పట్టిలు కావాలి అని అడుగుతుంది. అయితే మంచి షాప్ లో కొనుక్కుందామని ఇది అసలు వద్దు అని అంత క్వాలిటీ ఉండదు అని అంటాడు. కానీ జానకి మాత్రం తనకు అలాంటి పట్టిలే కావాలి అని చెప్తాడు. దీంతో అదే పట్టీలు కొన్న రామ జానకి చేతికి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అయితే జానకి మాత్రం భార్యకు ఎవరైనా పట్టిలు ఇలాగే ఇస్తారా అని అంటుంది. మరి ఎలా ఇవ్వాలి అని అడగడంతో జానకి కాళ్ళను చూపిస్తుంది. దీంతో రామచంద్ర తన భార్య కాళ్ళకు ఎంతో ప్రేమగా పట్టిలు పెడుతూ ఉంటాడు.

రామచంద్ర సరదాలు
ఇక తర్వాత ఆలస్యం అవుతుంది అని భానుమతి ఇంటికి చేరుకోవాలి అని ఇద్దరు అనుకుంటారు. ఇక భానుమతి ఇంటికి చేరుకోగానే రామచంద్ర అక్కడ సరదాగా ఒక ఆటపటించాలని అనుకుంటాడు. ముందుగా నేను డోర్ కొట్టి వెనకాల దాక్కొని ఉంటానని మీరు భానుమతి అమ్మతో మాట్లాడుతూ ఉండాలి అని చెబుతాడు. ఇక భానుమతి, జానకిని చూసి ఎవరు అని అడుగుతుంది. పూల కోసం వచ్చిందేమో అనుకొని ఉదయాన్నే ఇస్తాను డబ్బులు సంగతి తర్వాత చూసుకుందామని చెబుతుంది. అయితే జానకి మాత్రం ఏమీ మాట్లాడకుండా వెనకాల రామచంద్ర వస్తున్న తీరును చూసి నవ్వుకుంటూ ఉంటుంది.

కుందనపు బొమ్మలా ఉంది
ఇక అప్పుడే రామచంద్ర వెనకాల నుంచి వచ్చి భానుమతి అమ్మను హఠాత్తుగా పట్టుకుంటాడు. దీంతో భానుమతి ఒక్కసారిగా సంతోషిస్తుంది. మీ అమ్మ కూడా గతంలో ఒకసారి ఇలానే చేసింది అని గుర్తు చేసుకుంటుంది. ఇక భానుమతి రామచంద్రబు చూసిన సంతోషం లో ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. మీ పెళ్లికి రాలేకపోయాను అని అంటుంది. అయితే జానకి నీ కోడలు అని రామచంద్ర చెప్పడంతో కుందనపు బొమ్మలా ఉంది అని ఆమె పొగుడుతుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకు వెళుతుంది. రామచంద్ర చిన్నప్పుడు ఇక్కడే ఎక్కువగా నాతో ఉండేవాడు అని నేనే పెంచుకుందామని కూడా అనుకున్నాను అని భానుమతి చెబుతుంది.

చిన్నతనంలోనే బరువు బాధ్యతలు
అయితే హఠాత్తుగా వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో చిన్నతనంలోనే బరువు బాధ్యతలను రామ తన భుజనం చేసుకోవాల్సి వచ్చింది అని భానుమతి చెబుతుంది. ఇక భానుమతి జానకిని చూసి ఎంతగానో సంతోషపడుతుంది. మీ అమ్మకు చక్కటి కోడలు దొరికింది అని రామచంద్ర కు చెబుతుంది. ఇక రామచంద్ర జానకి లను కూడా స్నానం చేసుకుని రెడీ అవ్వాలి అని ప్రత్యేకంగా భోజనం కూడా రెడీ చేస్తాను అని చెబుతుంది. అయితే మేము ఇప్పుడే వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు రామచంద్ర చెబుతాడు. కానీ భానుమతి మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోదు. వారికి ప్రత్యేకంగా కొన్ని బట్టలు కూడా ఇస్తుంది ఇక ఆ మూమెంట్స్ తో జానకి రామచంద్ర ఎంతో సంతోషంగా ఉంటారు. మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











