twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 30th: జానకి కోసం గుడ్ న్యూస్ చెప్పిన అభి.. భయంతో న్యూ ట్విస్ట్

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తిగా మారుతోంది. ఐపీఎస్ కు సంబంధించిన చదువును పూర్తి చేయాలని అనుకుంటుండగా ఆమె అత్త నుంచి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. మరిది అఖిల్ కారణంగా మరోసారి ఛాలెంజ్ ను కూడా ఫేస్ చేస్తుంది. ఇక సీరియల్ అసలు ట్రాక్ లోకి రావడంతో రేటింగ్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. కథలో సరికొత్త ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది.

    ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 204 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    మల్లిక అనుమానాలు

    మల్లిక అనుమానాలు

    గోవిందరాజులు - జ్ఞానాంబ ఇద్దరూ కూడా వారి కూతురు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా రామచంద్రపురంలో గోవిందరాజులుకు ఒక మంచి సంబంధం కూడా చూస్తాడు ఆ విషయం లోనే ఇంట్లో వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటాడు. కానీ ఆ సమయంలో మల్లిక ఎవరూ ఊహించని విధంగా వెన్నెల ఎవరితోనైనా ప్రేమలో ఉందేమో అనే అనుమానాన్ని కలగజేస్తుంది.

    కానీ ఆ విషయంలో ఆమె మాటలు మాత్రం జ్ఞానాంబ నమ్మదు. ఇక తన కూతురు ఏమిటో తనకు తెలుసు అని అంటూ.. ఎన్నటికీ కూడా తనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా తన కూతురు ప్రవర్తించిందని చాలా నమ్మకంగా చెబుతుంది. అయినప్పటికీ మళ్ళీ మరోసారి అనుమానం కలిగితే మాట్లాడినప్పటికీ ఆ విషయంలో ఇకపై చాలా సీరియస్ అవుతుంది.

    వెన్నెల ప్రేమ వ్యవహారం

    వెన్నెల ప్రేమ వ్యవహారం

    అయితే వెన్నెల మాత్రం తన ప్రేమ విషయాన్ని దాచిపెడుతుంది. ఆ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చాలా భయపడుతుంది. ఇక ఆమె ప్రేమికుడు కూడా నిత్యం ఆమెను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరికి ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారని అతనికి చెప్పడంతో ఇంట్లో వాళ్లతో మాట్లాడుతానని అంటాడు.

    కానీ వెన్నెల మాత్రం ఆ విషయంలో చాలా కంగారు పడుతుంది. ఇక ముందుగానే జానకి నుంచి సహాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఇంతలోనే వెన్నెల లవర్ వచ్చి ప్రత్యేకంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. వెంటనే పక్కన తోట లోకి రావాలని కూడా చెప్పడంతో ఆమె కంగారుగా అక్కడికి వస్తుంది. ఇక అదే తరుణంలో కార్పొరేటర్ సునందాది కొడుకు కన్నబాబు కూడా వారికి షాక్ ఇస్తాడు.

    షాక్ ఇచ్చిన కన్నబాబు

    షాక్ ఇచ్చిన కన్నబాబు

    ఇంట్లో ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలో అని అనుకుంటున్న తరుణంలో కన్నబాబు సడన్ గా వచ్చి వారిద్దరు మాట్లాడుకుంటున్న పాత వీడియో చూపిస్తాడు. ఈ వీడియోను మీ అమ్మానాన్నలకు చూపించాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఊరందరికీ చూపించాలని నిర్ణయం మార్చుకున్నాను.

    ఎందుకంటే మీ వదిన జానకి నన్ను గతంలో చెంప మీద కొట్టింది. అంతేకాకుండా మీ అమ్మ మా అమ్మను అవమానించింది. ఇక మీ అన్నయ్య రామచంద్ర తో తనకు చాలా గొడవలు ఉన్నాయి అని అందుకే మీ కుటుంబం పై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు కన్నబాబు వివరణ ఇస్తాడు.

    వెన్నలపై కన్నేసిన కన్నబాబు

    వెన్నలపై కన్నేసిన కన్నబాబు

    ఇక ఆ విషయంలో భయపడిపోయిన జ్ఞానాంబ అలా ఎంతమాత్రం చేయకూడదు అని బ్రతిమాలుకుంటు ఉండడంతో కన్నబాబు చాలా తప్పుగా ఆలోచిస్తాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు సాయంత్రం మా తోటలో కి తప్పకుండా రావాలి అని అక్కడ మనం ఒంటరిగా చర్చించుకుందాం అంటూ ఆమెపై కన్నేస్తాడు.. ఆ విషయంలో వెన్నెల చాలా భయపడుతూ ఉంటుంది.

    జానకి ఇంటికి అభి

    జానకి ఇంటికి అభి

    ఇక మరోవైపు జానకి కోసం ఇంటికి ఆమె సివిల్ కోచింగ్ క్లాస్మేట్ అభి వస్తాడు. అతను ఎవరు అని ఆరా తీసే ప్రయత్నంలో మల్లిక ఏదైనా గొడవ సృష్టించాలని అనుకుంటుంది. అతను జానకి క్లాస్మేట్ అని చెప్పగానే ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చిన జ్ఞానాంబ గోవిందరాజులు అభిని చూసి ఎవరు అని ప్రశ్నిస్తారు. ఇక అభి కంగారుపడుతూ ఉండగా ఇక ఇంతలోనే జానకి రామ చంద్ర అతన్ని చూసి టెన్షన్ పడతారు. అయితే ముందుగానే జానకి గురించి వాళ్ళ ఇంట్లో పరిస్థితుల గురించి తెలుసుకున్న అభి అసలు నిజం చెప్పకుండా ఇక్కడికి పూతరేకుల కోసం వచ్చాను అని మీ షాపు లో అమ్మే పూతరేకులు చాలా బాగా ఉంటాయని అందుకే మా అమ్మ గారి కోసం తీసుకువెళ్లడానికి వచ్చానని చెబుతాడు.

    మోసం గురించి చెప్పాలా?

    మోసం గురించి చెప్పాలా?

    అభి చెప్పిన మాటలను జ్ఞానాంబ కూడా నమ్ముతుంది. ఆ తర్వాత రామచంద్ర అతన్ని పక్కకు తీసుకు వచ్చి ఎందుకు వచ్చారు అని చాలా ఆందోళనగా అడుగుతాడు. అయితే ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో జానకి రెండవ స్థానంలో ర్యాంకు వచ్చింది అని సంతోషకరమైన వార్తను చెబుతాడు. ఇక ఆ తరువాత మల్లిక జానకి వాళ్ళ ఇంట్లో గురించి మోసం చేశారు అని పదేపదే మాట్లాడుతూ ఉంటుంది.

    ఇక అప్పుడే వచ్చిన రామచంద్ర నువ్వు చేసిన మోసం గురించి చెప్పాలా అని అంటాడు.. దీంతో అందరూ షాక్ అవుతారు. జ్ఞానాంబ కూడా ఆమె చేసిన మోసం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. మరి ఆ విషయంలో రామచంద్ర అసలు నిజం చెబుతాడా లేదా మల్లికను మళ్ళీ తప్పిస్తాడా? అనేది చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 204
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X