Janaki Kalaganaledu December 31st: అభి గుడ్ న్యూస్ చెప్పడంతో.. జానకిని ముద్దుల్లో తడిపేసిన రామ!

జానకి కలగనలేదు సీరియల్ కథలో అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో చాలా తొందరగా జనాలకి కనెక్ట్ అయిన సీరియల్స్ లలో జానకి కలగనలేదు టాప్ లిస్టులో చేరిపోయింది. ఐపీఎస్ కు సంబంధించిన చదువును పూర్తి చేయాలని తపన పడే కోడలు ఎలాంటి సమస్యలను దాటి తన కలను నిజం చేసుకుంది అనే అంశం జనాలకు బాగా కనెక్ట్ అవుతోంది. కథలో సరికొత్త ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది.

ఇక మరోవైపు మల్లిక నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 47వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 46వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 47వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 205 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 జానకి ఇంటికి వచ్చిన అభి

జానకి ఇంటికి వచ్చిన అభి

అంతా సంతోషంగా కొనసాగుతున్న సమయంలో ఇంట్లోకి అనుకోకుండా జానకి స్నేహితుడు అభిరామ్ వస్తాడు. జానకి ఇటీవల రాసిన పరీక్షల్లో రెండవ ర్యాంకు సాధించింది అని ఆ విషయాన్ని చెప్పడానికి ఇంటి వరకు వస్తాడు. అయితే జానకి ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటున్నట్లు ఇంట్లో తెలియదని గ్రహించిన అభి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలని అనుకుంటాడు. ఇక మల్లిక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ అభిరామ్ చాలా తెలివిగా మీ ఇంట్లో పూతరేకులు తీసుకువెళ్లడానికి వచ్చాను అని అంటాడు.

పరీక్షల్లో రెండవ ర్యాంక్

పరీక్షల్లో రెండవ ర్యాంక్

ఇంకా ఆ విషయం నమ్మిన జ్ఞానాంబ పెద్దగా అనుమానం వ్యక్తం చేయదు. ఇక ఆ తర్వాత రామచంద్ర జానకి అసలు అసలు విషయం అడిగి తెలుసుకుంటారు. జానకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రెండవ ర్యాంక్ సాధించింది అని కేవలం ఒక్క మార్క్ తోనే మొదటి ర్యాంక్ కోల్పోయింది అంటాడు. ఇక సంతోషంలో జానకి మునిగితేలుతోంది. దీనికి కారణం మీరే అంటూ రామచంద్రను ఎంతగానో పొగుడుతుంది. మీరే లేకపోతే నేను ఇప్పటివరకు ఇలా ధైర్యంగా ముందుకు వెళ్ళేదాన్ని కాదు అని చెబుతుంది.

జానకిపై రామ ముద్దుల వర్షం

జానకిపై రామ ముద్దుల వర్షం

ఆ తర్వాత రామచంద్ర కూడా సంతోషంతో అభిని వెనక్కి తిరగమని చెప్పి జానకినీ ముద్దులతో ముంచెత్తుతాడు. అంతే కాకుండా మరో సారి కూడా భార్యను ఎత్తుకొని పైకి తిప్పుతూ ముద్దాడుతూ ఉంటాడు. ఆ ముద్దుల వర్షాన్ని తట్టుకోలేక జానకి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అభిరామ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక జానకి అత్తమామలకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఆ తరుణంలో జ్ఞానాంబ హఠాత్తుగా మల్లికను పిలవాలని, తనే వడ్డిస్తోందిలే అని చెప్పడంతో జానకి మొదట కొంత కంగారు పడుతుంది. అలాంటిది ఏమీ లేదు అని కొంచెం మాట్లాడేది కూడా ఉంది అని చెబుతోంది.

మల్లిక వంకర బుద్ధి

మల్లిక వంకర బుద్ధి

మల్లికకు ఎంత మంచిగా చెప్పినా కూడా మారే రకం కాదని మరోవైపు గోవిందరాజులు కూడా చెబుతాడు. కానీ చెప్పకుండా ఉంటే మరింత తప్పు చేసినట్లు అవుతుందని ఆమెకు మరొకసారి ప్రాబ్లం ఏమిటి అనే విషయంపై ఆరా తీయాలని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ మల్లికను అసలు సమస్య ఏమిటని అడగ్గానే? తన వంకర మాటలతో ఆశ్చర్యపరుస్తుంది. జానకి విషయంలో అలాగే ఆమె కుటుంబం గురించి కూడా మంచి వాళ్ళు అంటూనే చెడుగా మాట్లాడుతుంది.

 షాక్ ఇచ్చిన రామ

షాక్ ఇచ్చిన రామ

పెద్ద కోడలు అంటే మీకు ఇష్టం కదా అంటూ ఆమె కుటుంబ సభ్యులు కూడా చాలా మంచివారని మోసం కూడా తెలియదు అని మల్లిక నెగిటివ్ గా మాట్లాడుతుంది. ఇక ఇప్పుడే రామచంద్ర వచ్చి జరిగిపోయిన విషయాలు ఎందుకు బయటకి తీసావు అంటూ మల్లికను అంటాడు. అంతేకాకుండా నువ్వు చేసిన మోసాల గురించి చెప్పమంటావా అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అందరూ షాక్ అవుతారు.

 మ్యానేజ్ చేసిన విష్ణు

మ్యానేజ్ చేసిన విష్ణు

ఇక వెంటనే జ్ఞానాంబ ఏం మోసం చేసింది అని అడుగుతుంది. ఇక రామచంద్రను వెంటనే జానకి ఆపుతుంది. ఏమీ లేదు అని రామచంద్ర చెప్పినప్పటికీ గోవిందరాజులు అనుమానంతో ఏదో డాస్తున్నారు అని గట్టిగా అడుగుతాడు. ఇక అంతలోనే మల్లిక భర్త విష్ణు ఏమీ లేదు అని కేవలం ఈ రోజు మల్లిక అమ్మ చీర ఉతక లేదు అని మరొక అబద్ధం చెబుతాడు. కానీ అందులో నిజం లేదు అని ఏదో దాస్తున్నారని అనుకుంటారు.

అందరూ అలా చెప్పడంతో..

అందరూ అలా చెప్పడంతో..

రామచంద్ర చెప్పినదానికి విష్ణు చెప్పే దానికి సంబంధం లేదు అని జ్ఞానాంబ అనుమానం వ్యక్తం చేస్తున్న సమయంలో అదే నిజమని రామచంద్ర కూడా చెబుతాడు జానికి కూడా మళ్లీ మరోసారి మల్లికను కాపాడాలని అదే నిజం అంటూ సమాధానం ఇస్తుంది. అయినప్పటికీ మల్లిక బుద్ధి మారాదు. బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే భర్తను ఎడాపెడా వాయించేస్తుంది. ఇక జానకి విషయంలో మల్లిక ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X