Janaki Kalaganaledu December 3rd: మల్లిక కుట్ర విషయంలో జానకి మరో కీలక నిర్ణయం.. ఊహించని ట్విస్ట్

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. కష్టపడి ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది అసలు కథ. ఇక ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 185వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జానకిపై నమ్మకంతో

జానకిపై నమ్మకంతో

జానకి చదువుకున్న విషయం తెలిసినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆమెను ఎంతగానో నమ్ముతుంది. గతంలో తన తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని భయంతో ఉన్నప్పటికీ కూడా జానకి పై పూర్తి నమ్మకంతో ఉంటుంది. ఎవరు ఎన్ని అనుమానాలు కలిగించిన కూడా జ్ఞానాంబ తొందరపడకుండా జానకి వేస్తున్న ప్రతి అడుగును కూడా గమనిస్తుంది. ఇక అత్తా కోడళ్ళ మధ్య అనుబంధాలు చూసిన మల్లిక ఎంతగానో కుళ్ళుకుంటుంది.

పోలీసులను వెనక్కి పంపిన జ్ఞానాంబ

పోలీసులను వెనక్కి పంపిన జ్ఞానాంబ

జానకి, జ్ఞానాంబ మధ్యలో చిచ్చు పెట్టాలని మల్లికా స్వీట్ షాప్ లో తయారు చేసే పూతరేకుల నెయ్యిలో మందు కలుపుతుంది. ఇక పూతరేకులు ఆర్డర్ చేసిన ఫంక్షన్ లో చాలా మంది వాంతులు చేసుకుంటారు. ఆ నెయ్యి తీసుకువెళ్ళింది జానకి అని మల్లికా సీన్ క్రియేట్ చెయ్యాలని అనుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కూడా గొడవపడి విడిపోతారు అని కూడా ఆలోచిస్తుంది. అయితే మల్లిక వేసిన ప్లాన్ చాలా సీరియస్ గా మారుతుంది. పోలీసులు నా జ్ఞానాంబను అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. ఇక పోలీసులను జానకి ఎంతో తెలివిగా మాట్లాడి వెనెక్కి పంపేస్తుంది. కేవలం పూతరేకులు వల్లనే అలా జరగడానికి సాక్ష్యం ఏమిటని? సరైన ఆధారాలు తీసుకు వచ్చి ఆ తర్వాతనే అరెస్టు చేయాలని చెబుతుంది.

సీరియస్ గా తీసుకోవాలి

సీరియస్ గా తీసుకోవాలి

ఇక జానకి మాటలకు పోలీసులు వెనక్కి తిరిగి వెళ్లిపోవడంతో రామచంద్ర కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తాడు. చదువుకున్న కోడలు కారణంగానే ఈ రోజు మన కుటుంబం పరువు దక్కింది అని తన తల్లి ముందు చెబుతాడు. జ్ఞానాంబ కూడా జానకి విషయంలో ఎంతగానో సంతోషిస్తుంది. అయితే పూతరేకులలో ఏదో పొరపాటు జరిగింది అనే అనుమానాలు అందరికీ వస్తాయి. పని చేసే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతారు. తప్పకుండా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అని లేకపోతే మన భవిష్యత్తుకు కూడా ప్రమాదకరంగానే ఉంటుంది అని జ్ఞానాంబ మాట్లాడుతుంది.

జానకి పై నిందలు మోపేలా మల్లిక ప్లాన్

జానకి పై నిందలు మోపేలా మల్లిక ప్లాన్

ఇక అందరూ మాట్లాడుతున్న తరుణంలో మల్లిక కావాలని మధ్యలో దూరి ఆ నిందను జానకి పై వేసే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు నెయ్యి తీసుకువెళ్ళింది జానకి అంటూ అత్తగారి మీద కోపంతో ఏదైనా కలిపి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తుంది. తన చదువును మధ్యలో ఆపించేశారు అని కోపంతో కూడా అత్త గారి పై నిందలు మోపి అవకాశం ఉంది అని మల్లిక కావాలని మాట్లాడుతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరూ నమ్మరు. నిజానిజాలు తెలుసుకోకుండా జానకి తప్పు చేసింది అంటే నేను నమ్మలేను అని జ్ఞానాంబ చెబుతుంది. సరైన ఆధారాలతోనే నిజం తెలుసుకున్న తర్వాత అసలు విషయాన్ని తేలుస్తాను అని అంటుంది.

జానకి కంట పడిన మల్లిక కుట్ర

జానకి కంట పడిన మల్లిక కుట్ర

ఇక మరో వైపు జానకి కూడా మల్లికా మాటలకు కౌంటర్ కూడా ఇస్తుంది. నువ్వు ఏమి టెన్షన్ పడకు ఈ విషయంలో అసలు నిజం నేను తెలుసుకుంటాను. నిందితులు ఎవరో కూడా త్వరలోనే బయటకు వస్తారు అని చెబుతోంది. జానకి మాటలకు మల్లికలో ఆందోళన మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ నే జానకి మాటలతో వెనక్కి పంపించేసింది. ఇక ఈ విషయంలో ఆమెకు నిజం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ భయపడుతుంది. ఇక ఆ తర్వాత మల్లిక నెయ్యి కలిపిన బాటిల్ ను ఇంట్లోనే పొరపాటున పెట్టుకొని ఉంటుంది. ఇక వెంటనే ఆ బాటిల్ తీసి బయట పడేస్తూ ఉండగా జానకి చూస్తుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
 జానకి మరో కీలక నిర్ణయం

జానకి మరో కీలక నిర్ణయం

వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి ఆ మందు ఎందుకు ఉపయోగిస్తారు అని అడుగుతుంది. వాంతులు అయ్యేందుకు ఉపయోగిస్తారని తెలియడంతో మల్లిక ఈ కుట్ర చేసినట్లు తన భర్త రామచంద్రకు కూడా చెబుతుంది. దీంతో రామచంద్ర వెంటనే ఈ విషయాన్ని అమ్మకు చెప్పాలి అని అనడంతో జానకి అతని అడ్డుకుంటుంది.. అత్తయ్య గారికి ఈ నిజం తెలిస్తే మల్లికను తప్పకుండా ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఆ తరువాత విష్ణు కూడా బాధపడతాడు. ఇదంతా జరిగితే మన ఇంట్లో ప్రశాంతంగా ఉండదు. ఎవరు కూడా సంతోషంగా ఉండరు. కాబట్టి మల్లికకు ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే విష్ణు ద్వారా బుద్ధి వచ్చేలా చేయాలని జానకి చెబుతుంది. అందుకు విష్ణు కూడా జానకి మంచి మనసుకు దండం పెట్టి తప్పకుండా బుద్ధి చెబుతాను అని అంటాడు. ఇక జానకి చదువు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో ఆమెను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని భర్త రామచంద్ర ఆలోచిస్తాడు. పోలీస్ క్యాప్ ను కూడా జానకి తలపై పెట్టి ఎంతగానో సంతోషిస్తాడు. మరి ఐపీఎస్ కావాలననే విషయంలో జానకి ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X