Janaki Kalaganaledu December 6th: జానకి ఐపీఎస్ కల నిజమవ్వాలి.. భార్య కోసం రామచంద్ర మరో నిర్ణయం!

జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరగబోతోంది. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి అత్త పకట్టుబాట్ల మధ్యలో ఆ కలను వదిలేయాలని అనుకుంటుంది. అయితే అనేక రకాల ఇబ్బందులను దాటి తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది అసలు కథ. ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 45వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 45వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 186వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎవరు ఎన్ని చెప్పినా కూడా

ఎవరు ఎన్ని చెప్పినా కూడా

చదువుకున్న కొడులు వద్దని అనుకున్న జ్ఞానాంబ జానకి చదువుకున్న విషయం తెలిసినప్పటికీ కూడా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆమెను ఎంతగానో నమ్ముతుంది. తన తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే గత చేదు అనుభవాల కారణంగా కొంత భయం ఉన్నప్పటికీ జానకి మంచి తనం వల్ల పూర్తి నమ్మకంతో ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా కూడా జ్ఞానాంబ తొందరపడకుండా జానకి వేస్తున్న ప్రతి అడుగును కూడా గమనిస్తుంది. ఇక అత్తా కోడళ్ళ మధ్య అనుబంధాలు చూసిన మల్లిక ఎంతగానో కుళ్ళుకుంటుంది.

అత్తను కాపాడిన జానకి

అత్తను కాపాడిన జానకి

పోలీసులు అరెస్టు చేయకుండా కాపాడిన జానకి జ్ఞానాంబ ఎంతగానో మెచ్చుకుంది. మల్లికా స్వీట్ షాప్ లో తయారు చేసే పూతరేకుల నెయ్యిలో మందు కలపడంతో ఆర్డర్ చేసిన ఫంక్షన్ లో చాలా మంది వాంతులు చేసుకుంటారు. ఇక అందులో నెయ్యి తీసుకువెళ్ళింది జానకి అని మల్లికా సీన్ క్రియేట్ చెయ్యాలని అనుకుంటుంది.

ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కూడా గొడవపడి విడిపోతారు అని కూడా ఆలోచిస్తుంది. షాప్ జ్ఞానాంబ పేరు మీద ఉంది కాబట్టి ఆమెను అరెస్టు చేయాలని పోలీసులు అనుకుంటారు కానీ జానకి తన ఐపీఎస్ చదువులు అక్కడ ఉపయోగిస్తుంది. సరైన ఆధారాలతో అరెస్టు చేయాలని అప్పటి వరకు ఏమీ చేయడానికి మీకు అధికారం లేదని చెప్పడంతో జానకిని అందరూ మెచ్చుకుంటారు.

గొడవలు జరుగుతాయని..

గొడవలు జరుగుతాయని..

ఇక నిజంగానే పూతరేకుల కారణంగా వారు అందరూ అస్వస్థతకు గురయ్యారు అనే విషయంతక్ అందరూ ఆశ్చర్యపోతారు. దీనికి ఎవరు కారణం అయ్యారు అనే విషయాన్ని కూడా కనుగొనాలని జ్ఞానాంబ ఆలోచిస్తుంది. అంతేకాకుండా జానకి కూడా అదే ఆలోచిస్తూ ఉండగా మల్లిక ఆ తప్పు చేసినట్లు తెలుస్తుంది. మందు కలిపిన సీసాను బయటపడేస్తుంది.

ఆ విషయం తెలుసుకున్న జానకి, రామచంద్రకు చెప్పగా అతను తల్లికి చెప్పాలని అనుకుంటాడు. కానీ గొడవలు జరుగుతాయని కారణం చేత జానకి ఆ విషయాన్ని అత్తగారికి చెప్పకుండా మల్లిక భర్త విష్ణుతో చెప్పిస్తే అతని బుద్ధి చెబుతారని జానకి సలహా ఇస్తుంది. విష్ణు కూడా తప్పకుండా తన భార్య ఇలాంటి పనులు మరొకసారి చేయకుండా చూసుకుంటారు అని చెబుతాడు.

ఆ కలలు మర్చిపోవాలి..

ఆ కలలు మర్చిపోవాలి..

ఇక భార్య తలపై పోలీస్ టోపీ పెట్టిన రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు. తన భార్య ఐపీఎస్ అయినట్లు పగటి కలలు కంటూ ఉంటాడు. అయితే ఆ కలలు మర్చిపోవాలి అని జానకి మరొకసారి చెప్పడంతో రామచంద్ర బాధపడతాడు. ఇంతలో జానకి అన్నయ్య యోగి ఫోన్ చేసి నాన్నగారి నెల మాసం అని రమ్మని చెబుతాడు. అంతే కాకుండా తాము అమెరికా వెళ్లిపోతున్నామని అంటాడు. ఇక జానకి అన్నయ్య కార్యక్రమంలో తల్లి దండ్రులకు పిండం పెడుతూ ఉండగా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.

మీరు ఐపీఎస్ అవ్వాలని..

మీరు ఐపీఎస్ అవ్వాలని..

ఒకప్పుడు జానకి తండ్రి చనిపోతూ ఉండగా ఇచ్చిన పెన్నును రామచంద్ర ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇక జానకితో మాట్లాడుతూ.. ఎలాగైనా మిమ్మల్ని మీ నాన్నగారు ఐపీఎస్ చదివించాలని అన్నారు. ఆయన చనిపోయేటప్పుడు ఈ పెన్ను నాకు ఇచ్చారు అంటూ జానకి చేతిలో పెన్ను పెడతాడు. అయితే తల్లిదండ్రుల ఫోటోలను చూస్తూ ఏడుస్తూ కూర్చున్న జానకిని రామచంద్ర ఓదారుస్తాడు. అయితే ఆ పెన్ను జానకి చేతికి ఇచ్చి.. మీరు ఐపీఎస్ అవ్వాలని అనుకుంటే మీ నాన్న గారి ఫోటో దగ్గర పెట్టుకోండి.. లేదా మీ నాన్నగారు తనువు చాలించిన ఇదే గోదావరిలో పెన్నును పడేయండి అని రామచంద్ర చెబుతాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రామచంద్ర చెప్పడంతో జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
 మల్లిక మరో ప్రయత్నం

మల్లిక మరో ప్రయత్నం

ప్రస్తుతం ఇంటి కోడలిగా తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని భవిష్యత్తులో తాను చదువు గురించి ప్రస్తావన తీసుకురానని, అత్తయ్య గారికి మాట ఇచ్చినట్లు జానకి తండ్రి ఫోటోలు చూస్తూ ఏడుస్తుంది. ఆ పెన్నును జారవిడుస్తూ ఉండడంతో మరొకసారి రామచంద్ర పట్టుకుంటాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ కూడా మీరు మీ కలలను వదులుకోవడానికి ప్రయత్నించవద్దు అంటూ మీ కలను నేను నేరవేరుస్తాను అంటూ భరోసా భరోసా ఇస్తాడు. ఇక మరోవైపు మల్లిక జానకి విషయంలో మరొక నింద వేసేందుకు ప్రయత్నం చేస్తుంది.

చిన్న మరిది అఖిల్ కు జానకి గిటార్ కొనిపించిందని మల్లిక అత్తగారికి చెబుతుంది. ఇదివరకే ఒకసారి కొనుక్కుంటాను అని తల్లి అని అడిగినప్పుడు చదువుకు ఆటంకం కలుగుతుందని ఆమె కొనిపించదు. ఇక జానకి కొనిచ్చినట్లు అఖిల్ కూడా చెప్పడంతో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X