For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 6th: జానకి ఐపీఎస్ కోసం రామ ఐడియా.. బయటపడిన మల్లిక నాటకం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ కథనం మరో కీలక మలుపు తిరుగుతోంది. రామ, తమ్ముడు అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకోగా ఆ ఘటనను చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి మాటలను ఫ్యామిలీలో ఎవరు నమ్మరు. ఇక జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 447 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  బానమ్మ దగ్గరకు రామ, జానకి

  బానమ్మ దగ్గరకు రామ, జానకి

  జ్ఞానాంబ తన కొడుకును జానకిని కూడా బానమ్మ ఇంటికి వెళ్ళమని చెబుతుంది. జ్ఞానాంబ చిన్ననాటి స్నేహితురాలు అయిన బానమ్మ రామచంద్రాని చూసి చాలా రోజులు కావడంతో ఇంటికి రావాలి అని చెబుతుంది. ఇక తన భార్యతో కలిసి వెళ్ళిన రామచంద్ర అక్కడ బానమ్మను చూసి ఎంతగానో సంతోషిస్తాడు. అంతేకాకుండా జానకి కూడా అక్కడ ఆప్యాయతలను చూసి ఎంతగానో ఆనందపడుతుంది. అయితే ఆ చోట రామచంద్ర తో కూడా ఆమె సరదాగా ఉంటుంది.

  ఎందుకు వదిలేసారు?

  ఎందుకు వదిలేసారు?

  ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మా అమ్మ నాన్న అని ఈరోజు వారి పెళ్లి రోజు అని గుర్తు చేసుకుంటుంది. వాళ్లు పైన ఉండి నా ఆనందాన్ని కోరుకుంటున్నారు అని నాకు అర్థమైంది అని చెబుతుంది. అయితే తల్లిదండ్రుల ఆనందం కోసం ఆలోచించే మీరు వారి డ్రీమ్ అయినటువంటి ఐపీఎస్ చదవడం ఎందుకు వదిలేసారు అని రామచంద్ర అంటాడు. ఒక విధంగా నేను చేసింది తప్పే కావచ్చు అయితే మీరు మాత్రం అలా ఒక కారణం చేత లేదా ఒక మాట కారణంగా మీ చదువును వదిలేయడం కరెక్ట్ కాదు అని రామ అంటాడు.

  మొదటి కేసు అనుకోండి

  మొదటి కేసు అనుకోండి

  మీరు ఒక పోలీసుగా ఆలోచించి అఖిల్ మాధురి కేసు మీ మొదటి కేసు అనుకోండి అని రామచంద్ర అంటాడు. అసలు ఏం జరిగిందో పూర్తిగా మీరు ఒక పోలీస్ అధికారిగా తెలుసుకోండి. ఆ తర్వాత నిజాలు అన్నీ బయటకు వస్తాయి కదా అని అంటాడు. ఇక రామచంద్ర చెప్పిన మాటలకు జానకి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ఇక బానమ్మ మాత్రం జానకి రామచంద్ర ఇద్దరు వెళ్లడం వలన కొంత ఎమోషనల్ అవుతుంది. ఉదయాన్నే వచ్చి మళ్లీ ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అని అంటుంది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంటామని రామచంద్ర చెబుతాడు.

  జానకి..నీ అదృష్టం

  జానకి..నీ అదృష్టం

  ఇక జానకి లాంటి భార్య దొరకడం నీ అదృష్టమని బానమ్మ రామచంద్రకు చెబుతుంది. ఇక తర్వాత జ్ఞానాంబ కోసం ఆమె ప్రత్యేకంగా కొన్ని వంటకాలు చేసి పంపిస్తుంది. ఇక మరొకవైపు చిన్న కోడలు మల్లిక, జానకి రామచంద్ర ఊరికి వెళ్లడం ఏమాత్రం సహించలేకపోతుంది. మళ్ళీ జానకి పై ఏదో ఒక నింద వేయాలని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర జానకి ఇంటికి రాగానే తల్లిదండ్రులను కలిసి ఎంతో సంతోషంగా బాణమ్మ గురించి చెబుతారు. జానకి లాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టం అని బాణమ్మ చెప్పింది అని రామచంద్ర తన తల్లికి చెబుతాడు.

  జానకి ఎమోషనల్

  జానకి ఎమోషనల్

  అంతేకాకుండా నీకోసం ప్రత్యేకంగా ఆమె కొన్ని వంటకాలు తయారు చేసి ఇచ్చింది అని తల్లికి రామా చెబుతాడు. ఇక తర్వాత వెళ్లి మీరు రెస్ట్ తీసుకోండి అని తండ్రి చెప్పడంతో జానకి రామచంద్ర గదికి వెళ్లి పోతారు. అయితే ఆ గదిలో జానకి తన ఐపిఎస్ పుస్తకాలను చూస్తుంది. అలాగే భర్త చెప్పిన మాటలు కూడా ఆమెకు గుర్తుకు వస్తాయి. ఇక వాటిని తీసి పక్కన పెట్టాలని అనుకున్నప్పటికీ అప్పుడే వచ్చిన రామచంద్ర ఒక్క మాట కోసం మీరు ఎందుకు చదువుపై ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని మరోసారి ఆలోచించండి అని రామచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి కూడా పుస్తకాలను పట్టుకుని కొంత సేపు ఏడుస్తుంది.

  మల్లిక క్షమాపణ నిజమేనా?

  మల్లిక క్షమాపణ నిజమేనా?

  ఇక మరోవైపు మల్లిక జానకి ఎక్కడ తన దొంగ ప్రెగ్నెన్సీ గురించి చెబుతుందో అని భయపడుతూ ఉంటుంది. మరొక వివాదంలో జానకిని ఇరికిస్తే తన గొడవ మరిచిపోతుంది అని అనుకుంటుంది. అయితే జానకి ఏం చేయాలని ఆలోచిస్తున్నా సమయంలో ఆమె పుస్తకాలు పట్టుకోవడం చూస్తుంది. జానకి మళ్ళీ చదివింది అంటే సమస్య మొదలైనట్లే అని ఇప్పుడు ఏం చేయాలో అని ఆమె బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక మల్లిక దొంగ ప్రెగ్నెన్సీ విషయంలో జానకి మరొక కీలక నిర్ణయం తీసుకుంటుంది. నువ్వే స్వయంగా వెళ్లి అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెబుతూ నీ దొంగ ప్రెగ్నెన్సీ నాటకం బయట పెట్టాలి అని హెచ్చరిస్తుంది. మల్లిక కూడా అత్తగారికి అసలు విషయం చెబుతుంది. మరి ఇది నిజమా లేక గతంలో వచ్చినట్లుగా కలగా చూపిస్తారా? అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial December 6th Episode 447
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X