For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 7th: మరోసారి ఇబ్బందుల్లో పడిన జానకి.. మల్లిక గిటార్ గొడవ!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో ముందుకు సాగుతోంది. ఐపీఎస్ కావాలని కలలు కనే జానకి అత్త గారి పకట్టుబాట్ల మధ్యలో ఆ కలను ఎలా సాధించింది అనే కథ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఆమె అనేక రకాల ఇబ్బందులను దాటి తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది అసలు కథ. ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

  ఇక 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 45వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 45వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 187వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

  ఆందోళన చెందకుండా..

  ఆందోళన చెందకుండా..

  ఫైనల్ గా జానకి చదువుకున్న విషయం తెలిసినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమాత్రం ఆందోళన చెందకుండా ఎంతగానో నమ్ముతుంది. తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే భయం ఉన్నప్పటికీ జానకి మంచి తనంతో ఆ భయాన్ని దాచేస్తుంది. ఇక మళ్ళీ ఎప్పటికి చదువు ప్రస్తావన రావద్దని కూడా జ్ఞానాంబ చెప్పడంతో అందుకు జానకి మాట కూడా ఇస్తుంది.

  పగటి కలలు..

  పగటి కలలు..

  ఇక మరోవైపు తన భార్య కలను చాలా బలవంతంగా బాధతో మర్చిపోయేందుకు ఒప్పుకుంది అని భర్త రామచంద్ర అప్సెట్ అవుతాడు. జానకి పడుకొని ఉండగా తలపై పోలీస్ టోపీ పెట్టిన రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు. తన భార్య ఐపీఎస్ అయినట్లు పగటి కలలు కంటూ ఉండగా ఆ కలలు మర్చిపోవాలి అని జానకి మరొకసారి గట్టిగానే చెబుతుంది. ఇంతలో జానకి అన్నయ్య యోగి ఫోన్ చేసి నాన్నగారి నెల మాసం అని రమ్మని చెబుతాడు. ఇక జానకి అన్నయ్య కార్యక్రమంలో తల్లి దండ్రులకు పిండం పెడుతూ ఉండగా జానకి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.

  మాట ఇచ్చాను..

  మాట ఇచ్చాను..

  జానకి తండ్రి చనిపోతూ.. ఇచ్చిన పెన్నును రామచంద్ర ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇక జానకితో మాట్లాడుతూ.. ఎలాగైనా మిమ్మల్ని మీ నాన్నగారు ఐపీఎస్ చదివించాలని అన్నారు. ఆయన చనిపోయేటప్పుడు ఈ పెన్ను నాకు ఇచ్చారు. ఇప్పుడు ఆ పెన్నును మీ చేతిలో పెడుతున్నాను అని.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రామచంద్ర చెప్పడంతో జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

  అయితే జానకి మాత్రం అత్తగారింటికి నేను మళ్ళీ చదువు విషయాన్ని ప్రస్తావించనని మాట ఇచ్చానని అంటుంది. మళ్లీ ఇప్పుడు నా కారణంగా అందరూ బాధపడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే నా కలను మర్చిపోవాలని అనుకుంటున్నట్లు జానకి చెబుతుంది.

  భరోసా ఇచ్చిన రామ

  భరోసా ఇచ్చిన రామ

  కానీ అందుకు రామచంద్ర జానకి నిర్ణయానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఐపీఎస్ కలను వదులుకోవడానికి ప్రయత్నం చేయవద్దని అంటూ ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా మరొకరికి జీవిత ఆశయాన్ని అడ్డుకునే హక్కు లేదని ఆఖరికి భర్తగా నాకు కూడా అధికారం లేదని రామచంద్ర చెబుతాడు.

  అంతే కాకుండా కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా మీకు అండగా నేను ఉంటాను అని మరొకసారి భరోసా ఇస్తాడు. అయినప్పటికీ జానాకి అత్తగారికి ఇచ్చిన మాటను గుర్తుచేసుకుంటూ సందిగ్దంలో పడుతుంది. డిగ్రీ చదువుకున్నాను అనే కారణం చేత ఎంతగానో ఆందోళన చెందిన అత్తగారు ఇప్పుడు ఐపీఎస్ చఫువుకుంటున్నాను అనే విషయం తెలిస్తే ఎమవుతారో అని జానకి ఆందోళన చెందుతుంది.

  గిటార్ గొడవ

  గిటార్ గొడవ

  అయితే ఎప్పటిలానే మల్లిక జానకి విషయంలో మరొక నింద వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. చిన్న మరిది అఖిల్ కు జానకి గిటార్ కొనిపించిందని మల్లిక గ్రహిస్తుంది. అసలు అఖిల్ దగ్గరకు గిరాట్ ఎలా వచ్చింది అని అతన్ని అడుగుతుంది. ఇక అఖిల్ జానకి వదిన గాజులు తాకట్టు పెట్టి కొనిచ్చినట్లు చెబుతాడు. అదే విషయాన్ని మల్లిక జ్ఞానాంబ కు చెబుతుంది. ఇక ఆ విషయంలో జ్ఞానాంబ మనసులో మరింత చిచ్చు రాజేసే ప్రయత్నం చేసేలా మాట్లాడుతుంది. గిటార్ నేర్చుకోకూడదు అని అఖిల్ కు చెప్పినప్పటికీ జానకి మొండి పట్టు తో తన పంతం నెగ్గించుకున్నారు అని మల్లికా చాడీలు చెబుతుంది.

  మరోసారి చిక్కుల్లో జానకి

  మరోసారి చిక్కుల్లో జానకి

  ఇక మల్లికా చెప్పింది నిజమేనా అంటూ అఖిల్ ను అడగడంతో అతను కూడా నిజమే అని చెబుతాడు. ఇక ఆ తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అదే సమయంలో అక్కడే ఉన్న రామచంద్ర కూడా కంగారు పడుతూ ఉంటాడు. కానీ జానకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడుతుంది.

  జానకి విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక జానకి రామచంద్ర మరింత దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతోంది. వారసులను ఇస్తానని జ్ఞానాంబకు మాట ఇచ్చిన జానకి భర్తకు దగ్గరగా ఉంటుంది. ఇక సందిగ్ధంలో జానకి ఐపీఎస్ కలను ఎలా నిజం చేసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 187
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X