Janaki Kalaganaledu December 7th: మాధురి గాయంపై మరో ట్విస్ట్.. ఉంగరంతో జానకి ఇన్వెస్టిగేషన్

జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకోగా ఆ ఘటనను చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. అయితే జానకి మాటలను ఫ్యామిలీలో ఎవరు నమ్మరు. ఇక జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది.

ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 448 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

నిజాలను బయటపెట్టాలి

నిజాలను బయటపెట్టాలి

జానకి తన ఐపీఎస్ చదువు విషయంలో మళ్ళీ ఆలోచనలో పడేవిధంగా రామచంద్ర మాట్లాడతాడు. ఒక పోలీస్ అధికారిగా మీరు ఆలోచించాలి అని అఖిల్ గురించి అసలు నిజం తెలుసుకొని నిజాలను బయటపెట్టాలి అని అంటాడు. దీంతో జానకి ఒక పోలీసు అధికారి గానే అఖిల్ మాధురి ఘటనను తను మొదటి కేసుగా భావిస్తుంది. ఇక మరోవైపు జానకి మళ్ళీ పుస్తకం పట్టుకోవడం పై మల్లిక అసంతృప్తితో ఉంటుంది. ఆమె చదువుకుంటే తన స్థాయి తగ్గిపోతుంది అని అలాగే ప్రెగ్నెన్సీ గురించి కూడా జానకి ఇంట్లో చెబుతుందేమో అని మల్లికా అనుకుంటుంది.

కొట్టుకుంటే మంచిది అని..

కొట్టుకుంటే మంచిది అని..

మల్లికకు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో తలబాదుకుంటూ ఉంటుంది. విష్ణు కూడా వచ్చి ఎందుకు అలా తల కొట్టుకుంటున్నావు అని అడుగుతాడు. దీంతో చిరాకుతో మల్లికా ఇలా కొట్టుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు చాలా మంచిది అని మల్లిక అబద్ధాలు చెబుతూ ఉంటుంది. అయితే నువ్వు సరిగా కొట్టుకోలేవు అని నేను కొడతాను అని విష్ణు కూడా అదే తరహాలో ఆమెకు కౌంటర్ ఇస్తాడు. కానీ మల్లికా మరింత తెలివిగా తండ్రి కూడా కొట్టుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు చాలా మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

పండంటి పిల్లలు పుట్టాలని

పండంటి పిల్లలు పుట్టాలని

ఇక మరోవైపు ఇంట్లో ఇద్దరు కోడళ్ళు కడుపుతో ఉండడంతో జ్ఞానాంబ వారికి పండంటి పిల్లలు పుట్టాలని కోరుకుంటుంది. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన చిన్న పిల్లల ఫోటోలను తీసుకువచ్చి వారి గదిలో పెట్టుకోవాలి అని ఇద్దరికోడళ్ళకు చెబుతుంది. అయితే మల్లిక అక్కడికి రాగానే చాలా వినయంగా మాట్లాడుతుంది.

ఇక గోవిందరాజులు విష్ణును పిలిచి మీకు కూతురు కావాలా బాబు కావాలా అని అడుగుతారు. నాకు అమ్మలాంటి కూతురు కావాలని ఆమెకు మా అమ్మ పేరు పెట్టుకుంటాను అని కూడా చెప్పడంతో జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది.

ఒక బాబు ఒక పాప

ఒక బాబు ఒక పాప

ఇక మరోవైపు జెస్సి నాకు బాబు పుడితే మామయ్య గారి పేరు పెట్టుకుంటాను అని చెప్పడంతో అందరూ కూడా సంతోషపడతారు. ఇంట్లో ఒక బాబు ఒక పాప ఉంటే ఆ సంతోషమే వేరు అని గోవిందరాజులు సరదాగా చెప్పుకుంటారు. ఇక మల్లికా మాటలను చూసిన జానకి కోపంగా కనిపిస్తుంది. మల్లిక గదిలోకి రాగానే జానకి వచ్చి తలుపులు వేస్తుంది.

నువ్వు నిజంగానే ప్రెగ్నెన్సీ తో ఉన్నావని ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది అబద్ధమని తెలిస్తే అత్తయ్య గారు కోపం ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నీ భర్త విష్ణు కూడా చాలా సీరియస్ అవుతాడు అని పరిస్థితి మరింత దూరం పోకముందే నువ్వే ఇంట్లో ఈ విషయాన్ని చెప్పాలి అని జానకి చెబుతుంది.

కలలో ఉలిక్కిపడిన జానకి

కలలో ఉలిక్కిపడిన జానకి

అయితే మల్లికా నిజంగానే చెప్పాలని అనుకుని అత్తగారికి చెబితే ఎలా ఉంటుందో అనే కల కంటుంది. అయితే ఆ కలలో జ్ఞానాంబ మల్లిక చెంపలు వాయిస్తుంది. దీంతో ఉలిక్కిపడిన మల్లికా కలలోనే ఇంత భయంకరంగా ఉంది అంటే నిజం చెబితే ఎలా ఉంటుందో అని కంగారుపడుతుంది. ఇక మరోవైపు జానకి అసలు మాధురికి ఎలా ఉందో తెలుసుకోవాలి అని హాస్పిటల్ కు వెళుతుంది.

కన్నబాబు ఉంగరం

మాధురి తలకు ముందు భాగంలో ఎవరో రాడ్డుతో కొట్టడం వలన మరింత తీవ్రంగా గాయాలు అయ్యాయి అని అందుకే ఆమె కోమల్లోకి వెళ్ళింది అని డాక్టర్ చెబుతుంది. అయితే అఖిల్ మాత్రం వెనకాల నుంచి కర్రతో కొట్టాడు కదా అని జానకి చెబుతుంది. మళ్ళీ సందిగ్ధంలో పడిన జానకి అసలు విషయం తెలుసుకోవడానికి మాధురి కింద పడిపోయిన స్థలానికి ఒకసారి వెళుతుంది. అక్కడ ఆమె పరీక్షించిన తర్వాత ఒక ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం ఎవరిదాని కనుక్కోవడానికి ఆమె ఒక గోల్డ్ షాప్ దగ్గరకు వెళుతుంది. ఆ ఉంగరం కన్నబాబుది అని తెలిసి షాక్ అవుతుంది. మరి జానకి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X