Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Janaki Kalaganaledu December 8th: ఊహించని ప్లాన్ తో మల్లిక అబార్షన్.. భర్తకు నిజం చెప్పిన జానకి
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. జానకి చిన్న మరిది అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ ఘటనను కళ్లారా చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. అయితే జానకి మాటలను ఫ్యామిలీలో ఎవరు నమ్మరు. ఇక జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది.
ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 449 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మొదటి కేసు అనుకొని..
జానకి రామచంద్ర మాటలు కారణంగా తన చదువును వదిలేయాలని అనుకుంటుంది. సొంత కుటుంబంలోని వ్యక్తి తప్పు చేసిన కూడా ఏమాత్రం క్షమించకూడదు అప్పుడే మనం చదివే చదువుకి ఒక అర్థం ఉంటుంది అని జానకి అనుకుంటుంది. ఇక అఖిల్ తప్పు చేసినప్పటికీ కూడా ఇంట్లో వారి కారణంగా అతనిపై కేసును వెనక్కి తీసుకోవడంపై జానకి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
అందుకే తన ఐపిఎస్ చదువుకు కూడా న్యాయం చేయలేనేమో అని వెనుకడుగు వేస్తుంది. అయితే రామచంద్ర మాత్రం జానకి చదువును వదిలేయడంపై కొంత అసంతృప్తితో ఉంటాడు. మీరు నేను ఏదో అన్నాను అని మీ చదువుని వదిలేయడం కరెక్ట్ కాదు. అఖిల్ మాధురి ఘటనను మీ మొదటి కేసు అనుకొని అసలు నిజాలు నిజాలు బయటపెట్టాలి అని ఒక సలహా ఇస్తాడు.

ఉంగరం ఎవరిదో..
అయితే జానకి భర్త చెప్పిన మాటలను ఆలోచించి అసలు నిజం తెలుసుకోవాలని ఘటన జరిగిన స్థలానికి మరోసారి వెళుతుంది. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని ఆమె అనుకుంటుంది. అయితే అక్కడ జానకి వెతుకులాడుతూ ఉండగా ఒక ఉంగరం దొరుకుతుంది. వెంటనే ఆ ఉంగరం ఎవరిదో అని తెలుసుకోవాలని ఆమె అనుకుంటుంది. అందుకే సమీపంలో ఉన్న కొన్ని గోల్డ్ షాప్ లకి వెళుతుంది. ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఈ ఉంగరం ఎవరిదై ఉంటుందో మీకు తెలుసా అని అడుగుతుంది.

కన్నబాబుపై అనుమానం
అయితే డబ్బున్న వాళ్ళు తీసుకునే ఉంగరాలు అని ఆ విధంగా వివరాలు మీకు చెప్పలేము అని అంటారు. అయితే జానకి మాత్రం నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబోతున్నాను అని ఒక అమ్మాయి కోసం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను అని చెప్పడంతో ఆ గోల్డ్ షాప్ అధికారి అసలు విషయం చెబుతాడు. ఈ ఉంగరం కన్నబాబుదని, కార్పొరేటర్స్ సునంద దేవి కుమారుడే కన్నబాబు అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఈ విషయంలో కన్నబాబుకు ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తుంది.

నీలావతితో న్యూ ప్లాన్
ఇక మరొకవైపు చిన్న కోడలు మల్లికా తన దొంగ కడుపు విషయం ఎక్కడ బయటపడుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జానకి బయట పెడితే తనను అత్తగారు, భర్త ఇద్దరు కలిసి పుట్టింటికి పంపించేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే అప్పుడే నీలావతి పెద్దమ్మను రంగంలోకి దింపుతుంది. నేను చెప్పిన ఒక ఐడియా ఫాలో అయితే మనం ఈ గండం నుంచి బయట పడవచ్చు అని మల్లిక చెబుతుంది. సరే అని నీలావతి కూడా ఒప్పుకుంటుంది.

మల్లిక అబార్షన్ ప్లాన్
ఇక మల్లికా ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా తన ప్లాన్ ను ఆచరణలో పెడుతుంది. తను వెంట తెచ్చుకున్న ఒక నూనె డబ్బాను ఒక దగ్గర పోసిన మల్లికా దాని మీద కాలు వేసి జారిపడుతుంది. ఎవరో నూనె పోసారు అని నాటకం ఆడుతూ కింద పడిపోతుంది. అయితే అప్పుడే నీలావతి కూడా అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది.
ఇక వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి అని ఆమె స్వయంగా హాస్పిటల్ కు తీసుకు వెళుతుంది. ఇక హాస్పిటల్కు తీసుకువెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే అప్పుడే మల్లికను పరీక్షించి బయటకు వచ్చినా డాక్టర్ ఆమె కింద పడటం కారణంగా అబార్షన్ చేయాల్సి వచ్చింది అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
|
నిజం చెప్పిన జానకి
అంతకుముందు నీలావతి డాక్టర్ కు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పలని అంటుంది. ఇక నీలావతి పై జానకి అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ నీలావతి అప్పుడే అక్కడి నుంచి జంప్ అవుతుంది. ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో మల్లికకు కడుపు పోయిందని అందరూ బాధపడుతూ మల్లికను ఇంటికి తీసుకు వెళతారు. మరో ఐదు నెలల్లో మల్లిక ఇంటికి వారసుడిని తీసుకొస్తుంది అని అందరూ సంతోషంగా ఉండగా ఇలా జరగడం బాధాకరమని రామచంద్ర జానకి తో చెబుతూ ఉంటాడు.
మీరు కూడా ఈ విషయంలో బాధపడి ఉంటారు అని అంటాడు. కానీ జానకి మాత్రం నేను బాధపడలేను అని చెబుతుంది. అసలు మల్లికా ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. మర ఈ విషయాన్ని జానకి అందరికీ ఎలా చెబుతుందో చూడాలి.