Janaki Kalaganaledu December 9th: మరో నిజం తెలుసుకున్న మల్లిక.. జానకిలో మరింత ఆందోళన

జానకి కలగనలేదు సీరియల్ లో కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా లవ్ సీన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి అత్త గారి పకట్టుబాట్లను కాదని ఆ కలను ఎలా సాధించింది అనే అంశం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఆమె అనేక రకాల ఇబ్బందులను దాటి తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది అసలు కథ. ప్రస్తుతం సీరియల్ లో కొనసాగుతున్న ట్విస్టులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

ఇక 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 45వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 45వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 187వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

చదువు ప్రస్తావన రావద్దని

చదువు ప్రస్తావన రావద్దని

జానకి ఉన్నత చదువులు చదువుకున్నట్లు నిజం తెలుసుకున్న జ్ఞానాంబ పెద్దగా అనుమానం చెందకుండా మరోసారి నమ్ముతుంది. తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అనే భయం కొంత ఉన్నప్పటికీ జానకి మంచి తనం వలన జ్ఞానాంబ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు.

ఇక మళ్ళీ ఎప్పటికి చదువు ప్రస్తావన రావద్దని కూడా జ్ఞానాంబ చెప్పడంతో అందుకు జానకి మాట కూడా ఇస్తుంది. కానీ మరోవైపు భర్త రామచంద్ర మాత్రం జానకిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని అనుకుంటాడు.

నాకు ఏమాత్రం ఇష్టం లేదు

నాకు ఏమాత్రం ఇష్టం లేదు

ఇక చిన్న మరిది గిటార్ కొనుకున్న విషయంలో ఆ నిందను జానకిపై వేస్తాడు. ఎలాగైనా జానకిని ఆ వంకతో దెబ్బ కొట్టాలని మల్లిక ప్లాన్ చేస్తుంది. కానీ అప్పుడు కూడా ఆమె ప్లాన్ రివర్స్ అవుతాయి. జ్ఞానాంబ హెచ్చరికతోనే ఆ విషయాన్ని వదిలేస్తుంది. అయితే మరిది కల కోసం నిందను భరించిన మీరు మీ కల కోసం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని రామచంద్ర తన మాటలతో మరింత ధైర్యాన్ని ఇస్తాడు.

కానీ అత్తగారింటికి నేను మళ్ళీ చదువు విషయాన్ని ప్రస్తావించనని మాట ఇచ్చానని జానకి అంటుంది. మళ్లీ ఇప్పుడు నా కారణంగా అందరూ బాధపడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే నా కలను మర్చిపోవాలని అనుకుంటున్నట్లు జానకి చెబుతుంది.

రామ ఉపదేశం

రామ ఉపదేశం

ఎంత చెప్పినా కూడా రామచంద్ర మాత్రం జానకి ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటాడు. ఆ విషయంలో ఏ మాత్రం ఆలోచించకూడదు అంటూ ఉదయాన్నే కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని సూచిస్తాడు. ఇక జానకి మాత్రం భయంతోనే ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. మోసం చేయడం కరెక్ట్ కాదని అనడంతో ఎవరికి ఏ నష్టం కలగనంత వరకు అబద్ధం ఆడినా కూడా మోసం చేసినట్లు కాదని మీరు ఐపీఎస్ అయిన తరువాత మా అమ్మ తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటూ రామ ఉపదేశం ఇస్తాడు.

షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

ఇక భర్త మాటలకు కొంత ఆకర్షితురాలు అయిన జానకి పక్కనే పడుకోవాలని అనుకుంటుంది. అర్థం చేసుకునే భర్త దొరికితే భార్యకు అంతకంటే స్వర్గం మరొకటి ఉండదు అంటూ మా అమ్మ చెప్పారని వాళ్ళు బ్రతికి ఉంటే ఈపాటికే మీకు గుడి కట్టేవారు అని జానకి అంటుంది. ఇక రామచంద్ర భార్యను చూస్తూ అలానే పడుకుంటాడు.

ఇక ఉదయనే జానకి కేకులు నేర్చుకోవాడనికి వెళుతుందని తల్లికి చెప్పడంతో అందుకు ఆమె ఒప్పుకోదు. నా పెద్ద కోడలు కేకులు నేర్చుకోవడం నాకు ఇష్టం లేదని జ్ఞానాంబ చెప్పడంతో రామ షాక్ అవుతాడు. ప్రస్తుతం జనరేషన్ లో మన వ్యాపారం మరొక ఎత్తుకు చేరాలి అంటే తప్పకుండా కేకుల బిజినెస్ కూడా చేయాలని అవి నేర్చుకుంటే జానకి తప్పకుండా మన కుటుంబానికి మరింతగా హెల్ప్ అవుతుందని రామ అబద్దాలు చెబుతాడు.

జానకితో భయం భయం

జానకితో భయం భయం

అయితే ఆ విషయంలో గోవిందరాజులు కూడా జ్ఞానాంబను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. రామ చెప్పింది కూడా కరెక్ట్ అంటూ మన వ్యాపారం స్వీట్స్ దగ్గరనే ఆగిపోవద్దని ఇంకో మెట్టు ఎక్కాలి అంటే జానకు స్వీట్స్ నేర్చుకోవడం ఉత్తమనని అంటాడు. ఇక కొంతసేపు జ్ఞానాంబను బ్రతిమాలి రామ ఒప్పించి జానకిని తీసుకు వెళతాడు. అయినప్పటికీ జానకి మనసులో భయం కలుగుతూనే ఉంటుంది. అత్తయ్యకు అబద్ధం చెప్పి ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లడం కరెక్ట్ కాదని, ఒకవేళ అత్తయ్య గారు కేకులు తయారు చేయించేవారికి ఫోన్ చేస్తే అసలు నిజం బయటకు వస్తుందని అంటుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
మరో నిజం తెలుసుకున్న మల్లిక

మరో నిజం తెలుసుకున్న మల్లిక

అయితే వారి వ్యవహారంపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేసిన మల్లిక ఏదో ఒక రహస్యం దాగి వుందని అనుకుంటుంది. వెంటనే జానకి గుట్టు తెలుసుకోవాలని కేకులు తయారు చేసే షాప్ కు వెళ్లి జానకిని పిలవమని చెబుతుంది. కానీ అక్కడ జానకి ఉండదని గ్రహించిన మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీని వెనుక మరొక పెద్ద రహస్యం దాగి ఉందని దాన్ని వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అనుకుంటుంది. మరి మల్లిక జానకి జీవితంలో ఎలాంయి అలజడి సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X