Janaki Kalaganaledu December 9th: కన్నబాబు కేసులో మరో ట్విస్ట్.. సునందకు జానకి సీరియస్ వార్నింగ్!
జానకి కలగనలేదు సీరియల్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానాంబ చిన్న కుమారుడు అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేశాడాని ఆ ఘటనను నేను చూశానని జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. అయితే జానకి మాటలను ఫ్యామిలీలో ఎవరు నమ్మరు. ముఖ్యంగా జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 450 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

భయంతో ప్లాన్ వేసిన మల్లిక
జ్ఞానాంబ రెండవ కోడలు మల్లికా తనకు గర్భం రాకపోయినప్పటికీ వచ్చింది అని చెబుతుంది. ఆమె ఇంట్లో వాళ్ళను మోసం చేస్తూ ఏ పని చేయకుండా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అయితే జానకికి మాత్రమే మల్లిక గర్భం దాల్చలేదని తెలుసుకుంటుంది. ఇక ఆ విషయాన్ని ఇంట్లో చెబుతానని నేను చెప్పే కంటే ముందే నువ్వే వెళ్లి అత్తయ్య గారిని క్షమాపణలు కోరాలి అని జానకి కండిషన్ పెడుతుంది. అయితే జానకి ఆ విషయాన్ని ఎక్కడ చెబుతుందో అని మళ్ళీ ఇంట్లో తెలిస్తే తనను పుట్టింటికి పంపించేస్తారు అని భయపడిన మల్లికా నీలావతి తో కలిసి మరొక ప్లాన్ వేస్తుంది.

అబార్షన్ చేయించినట్లుగా..
మల్లిక ముందుగా ఇంట్లో తనంతట తానే ఒక చోట నూనె పోసి దానిమీద నడిచి కింద పడిపోతుంది. ఇక ఆమెకు ఏం జరిగిందో అని ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడే హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. అక్కడికి నీలావతి కూడా వస్తుంది. అయితే అంతకంటే ముందే నీలావతి అక్కడ వైద్యులతో మాట్లాడి అబార్షన్ చేయించినట్లుగా అబద్ధం చెప్పాలి అని వారికి డబ్బులు ఇస్తుంది. ఇక అనుకున్నట్లే డాక్టర్లు కూడా అబార్షన్ చేసినట్లు చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంట్లోకి పాప రాబోతుందని ఎంతో కలలు కన్నా అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు.

మల్లిక దోంగ నాటకం
జ్ఞానాంబ, గోవిందరాజులు అయితే చాలా మనోవేదనకు గురి అవుతారు. ఇక తమ్ముడు విష్ణు బాధపడుతూ ఉంటే రామచంద్ర అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత మల్లిక మాత్రం బాధపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్న ఎంతగానో సంతోషిస్తుంది. తన గదిలో ఆమె ఎగిరి గంతులు కూడా వేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మళ్లీ ఎవరో వస్తున్నారు అనుకొని తన పాప కడుపులోని చనిపోయింది అని బాధపడుతూ దొంగ నాటకం ఆడుతుంది. అయితే జానకికి అసలు విషయం తెలుసు కాబట్టి ఆమె నీ దొంగ నాటకాలు ఆపు అంటూ హెచ్చరిస్తుంది. నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అని ప్రశ్నిస్తుంది.

ఈ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది
ఇక మల్లిక కూడా తనకు మరో దారి లేదు అని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది అని కూడా ఆమె సమాధానం ఇవ్వడంతో మల్లికపై జానకి మరింత కోపాన్ని తెచ్చుకుంటుంది. ఈ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది అని అప్పుడు నిన్ను అత్తయ్య గారు ఏమాత్రం క్షమించాలని కూడా జానకి అంటుంది. ఇక తర్వాత జానకి మళ్ళీ బాధపడుతూ ఇంట్లోకి వస్తుంది. అందరూ బాధపడుతున్నారు అని రామచంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు.

రామచంద్ర ఆగ్రహం
అయితే జానకి మల్లికది నిజమైన ప్రెగ్నెన్సీ కాదు అని జరిగిన విషయం గురించి చెబుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా ఆగ్రహంతో ఇన్నాళ్లు ఎన్నోసార్లు క్షమించాము. కానీ అందరిని బాధపెట్టే విధంగా మల్లిక ఇలా చేస్తూ ఉంటే ఊరుకోను అని అంటాడు. కానీ జానకి అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోవైపు సునంద దేవి కొడుకు కన్నబాబు మాధురిపై హత్యా ప్రయత్నం చేసినట్లుగా జానకి మాధురి తల్లిదండ్రులతో కేసు పెట్టిస్తుంది.

సునందకు జానకి హెచ్చరిక
ఇక పోలీసులు వారి ఇంటికి వచ్చి కన్నబాబుని అరెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ సునంద దేవి మాత్రం కొడుకుని అరెస్ట్ చేస్తే పరువు పోతుందని తన డ్రైవర్ మీద కేసును పెట్టిస్తుంది. ఇక ఆ తరువాత జానకి తన ఇంట్లో మాధురిపై జరిగిన హత్యప్రయత్నం కన్నబాబు చేసినట్లు చెబుతుంది. దీంతో జ్ఞానాంబ అలాగే అందరూ కూడా షాక్ అవుతారు. అలాగే అఖిల్ ఎలాంటి తప్పు చేయలేదు అని నిజం తెలియడంతో అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా రామచంద్ర అయితే తన తమ్ముడు తప్పు చేయడని తనకి ముందే తెలుసని అంటాడు. ఇక జానకి నిజం తెలుసుకొని ఒక ఆడపిల్ల గురించి ఆలోచించడంపై కూడా జ్ఞానాంబ మెచ్చుకుంటుంది. ఇక ఆ తరువాత జానకి సునంద దగ్గరికి వెళ్లి హెచ్చరిక చేస్తుంది. మరి వారి మధ్య జరిగే సంభాషణ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











