For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 23rd: రామచంద్రలో లోపం ఉందేమో.. ఆ మాటలకు షాక్ అయిన జ్ఞానాంబ

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 372వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  అందరిలో సంతోషం

  అందరిలో సంతోషం

  జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక నెల తప్పినట్లుగా పక్కింటి నీలావతి తెలియజేస్తుంది. మల్లికా హఠాత్తుగా వాంతులు చేసుకుంటూ ఉండడంతో అప్పుడే ఆ ఇంటికి వచ్చిన నీలావతి మల్లిక చేయి పట్టుకుని త్వరలోనే నువ్వు నానమ్మవు కాబోతున్నావు జ్ఞానాంబ అంటూ ఒక మంచి శుభవార్త తెలియజేస్తుంది. ఇక ఆ మాటలు వినగానే జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. అంతేకాకుండా ఆమె భర్త గోవిందరాజులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ తరుణంలో అక్కడికి వచ్చిన జానకి రామచంద్రతో పాటు మల్లికా భర్త విష్ణు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక ఈ సంతోషాలను ఒక పండగల సెలబ్రేట్ చేసుకోవాలి అనే జ్ఞానాంబ కూడా అనుకుంటుంది.

  నెలతప్పిన మల్లిక

  నెలతప్పిన మల్లిక

  చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ప్రత్యేకంగా మల్లికకు ఆశీర్వాదం వచ్చేలా చేయాలి అని వాళ్ళందరి దీవెనలు ఉంటే పండంటి బిడ్డకు జన్మనిస్తుంది అని ఆమె ఆలోచిస్తుంది. అయితే గోవిందరాజులు మాత్రం ఆ విషయంలో మరోసారి ఆలోచించమని అడుగుతాడు. ఎందుకంటే పెద్ద కోడలు కడుపు పండకముందే చిన్నకోడలు నెల తప్పడంపై వేరే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు.. అని ఆ తర్వాత నువ్వు ఆ మాటలను తట్టుకోలేవు అని గోవిందరాజులు తన భార్యకు తెలియజేస్తాడు.

   ఆ మాటలు విన్న జానకి

  ఆ మాటలు విన్న జానకి

  అయితే జానకి గురించి ఆలోచించి మల్లికకు దక్కాల్సిన సంతోషాన్ని ఆమెకు లేకుండా చేస్తే న్యాయం కాదు అని అందరినీ పిలిపించి భోజనాలు పెట్టించాలని అనుకుంటారు. అయితే గోవిందరాజులు జ్ఞానాంబ మాట్లాడుకుంటున్న మాటలు జానకి కూడా వింటుంది. తన చదువు విషయం కారణంగా ఈ ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితి ఎదురయింది అని ముఖ్యంగా తండ్రి కావాలి అనే తన భర్త కోరికను కూడా నెరవేర్చలేక పోతున్నాను అని జానకి ఆలోచిస్తుంది.

   ట్విస్ట్ ఇచ్చిన మల్లిక

  ట్విస్ట్ ఇచ్చిన మల్లిక

  ఇక మరోవైపు మల్లికా ఊహించని విధంగా ఒక షాక్ ఇస్తుంది. నీలావతి దగ్గరికి వెళ్లిన మల్లికా అనకు ఒక పట్టు చీర ఇస్తుంది. తనకోసం ఒక మంచి అబద్ధం చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు అని అంటుంది. ఎందుకంటే ముందుగానే మల్లిక తాను నెలతప్పినట్లుగా ఇంట్లో వాళ్లకు చెప్పాలి అని ప్లాన్ వేస్తుంది. అందుకు తగ్గట్టుగానే నీలావతి ఆ విధంగా మళ్ళీ నెల తప్పినట్లుగా చెబుతుంది. అయితే ఇలాంటి నిజం ఎప్పుడైనా తెలిసే అవకాశం ఉంది అని నిజం తెలిస్తే మీ అత్తగారు నిన్ను నన్ను కొడతారు అని నీలావతి అంటుంది. అయితే ఇక కొన్ని రోజుల తర్వాత తన కడుపు పెరగకుండా పోతే అందుకు కారణం జానకి అని తన కడుపు పండకుండా చేసింది అని నింద వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మల్లికా ప్లాన్ గురించి చెబుతుంది. ఇక దాంతో నీలావతి మరింత షాక్ అవుతుంది.

   సపోర్ట్ చేసిన జానకి

  సపోర్ట్ చేసిన జానకి

  మరోవైపు జానకి తన చదువు కారణంగా పిల్లలు వద్దనుకుంటున్న విషయం గురించి ఆలోచిస్తుంది. భర్తతో కూడా మాట్లాడుతుంది. మీరు ఈ విషయంలో ఏమైనా బాధపడుతున్నారా అని అనగానే.. అందుకు రామ అలంటిదేమి లేదని అంటాడు. మీ చదువు కోసం మనం పిల్లలను వద్దు అని ముందే అనుకున్నము.. దాంట్లో బాధపడడానికి ఏముంది అని రామ సపోర్ట్ చేస్తాడు.

  రామచంద్రలో లోపం ఉందేమో..

  రామచంద్రలో లోపం ఉందేమో..

  ఇక ఆ తరువాత మల్లికాను దీవించడానికి చుట్టూ పక్కల వాళ్ళు ఇంట్లోకి వస్తారు. అయితే అదే సమయంలో నీలావతి మరిన్ని మాటలతో బాధపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీ పెద్ద కోడలు కూడా తొందరగా నెల తప్పితే బాగుంటుంది అని అనడంతో తోటి వాళ్లు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ కి చూపించుకోవడం బెటర్ అని సలహాలు ఇస్తారు. అంతేకాకుండా అమ్మాయిలో కాకుండా అబ్బాయిలు కూడా ఏదైనా లోపం ఉందేమో అని అనుమానాలు వచ్చేలా మాట్లాడడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.

  జ్ఞానాంబ అందుకు భిన్నంగా

  జ్ఞానాంబ అందుకు భిన్నంగా

  ఇక గోవిందరాజులు వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని భోజనాలు చేసి వెళ్లిపోండి అని అంటాడు. ఇక తర్వాత జ్ఞానాంబ.. ఆ విషయంలో పెద్దగా కోప్పడకుండా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. జానకి పై తప్పకుండా జ్ఞానాంబ ఆగ్రహం వ్యక్తం చేస్తుందేమో అని మరోవైపు మల్లికా ఎదురుచూస్తుండగా.. జ్ఞానాంబ అందుకు భిన్నంగా స్పందిస్తుంది. ప్రేమగా మాట్లాడడంతో ఆశ్చర్యపోతుంది. మరి ఈ పరిణామాలు ఇంకా ఎలాంటి మలుపులను క్రియేట్ చేస్తాయి చూడాలి

  English summary
  Janaki Kalaganaledu Today Episode 372
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X