For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 2nd: కొడుకు బాధపడుతున్న పట్టించుకోని జ్ఞానాంబ.. నీలావతి న్యూ ఎంట్రీ!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మంచి రేటింగ్స్ తో ప్రేక్షకుల ఆదరణను మరింత పెంచుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి ఐపీఎస్ కలను పూర్తి చేయాలని చదువును కొనసాగిస్తుంది. మరోవైపు జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇక తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 358 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  జ్ఞానాంబ మాట తీసుకున్నప్పటికీ..

  జ్ఞానాంబ మాట తీసుకున్నప్పటికీ..

  జానకి చదువు గురించి అసలు నిజం తెలుసుకున్న జ్ఞానాంబ కంగారు పడుతుంది. జానకి చడగువుకోలేదని వారి కుటుంబ సభ్యులు చెప్పడం వల్లనే రామచంద్రకు ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తుంది. కానీ జానకి కుటుంబ సభ్యులు జానకి చదువు గురించి అబద్ధం చెప్పినట్లు ఆ తర్వాత జ్ఞానాంబ నిజం తెలుసుకుంటుంది. అయినప్పటికీ జానకి మంచితనం కారణంగా జ్ఞానాంబ ఆ తరువాత క్షమిస్తుంది. ఇక మధ్యలోనే జ్ఞానాంబ జానకి చదువుకోకూడదు అని తన సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది. అంతేకాకుండా మరోసారి చదువు ప్రస్తావన తీసుకురావద్దు అని మాట కూడా తీసుకుంటుంది. అయినప్పటికీ జానకి తన చదువును కొనసాగిస్తుంది

   గతంలో జరిగిన సంఘటన

  గతంలో జరిగిన సంఘటన

  చదువుకోలేని తన తమ్ముడు చదువుకున్న భార్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని గతంలో జరిగిన ఒక సంఘటన భయంతోనే జ్ఞానాంబ తన కొడుకు విషయంలో కూడా అలానే జరుగుతుందేమో అని కంగారుపడుతూ ఉంటుంది. మళ్ళీ భవిష్యత్తులో జానకి తన చదువు అహంకారాన్ని చూపిస్తే రామచంద్ర తట్టుకోలేడు అని మళ్ళీ తన తమ్ముడికి జరిగిన అన్యాయమే కొడుకు విషయంలో కూడా జరుగుతుందేమో అని ఆమె ఆందోళన చెందుతుంది. అయితే చాలాసార్లు రామచంద్ర ఆ విషయంలో తల్లికి సర్ది చెప్పినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం నమ్మదు కానీ చివరికి జానకి యధావిధిగా తన మాటలను లెక్కచేయకుండా చదువుకున్న కొనసాగించడం పై ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  ఆనందంలో మల్లిక

  ఆనందంలో మల్లిక

  ఇంట్లో ఎంతమంది చెప్పినా కూడా జ్ఞానాంబ కొడుకు కోడలి విషయంలో కోపంగానే ఉంటుంది. వారితో కొంచెం కూడా మాట్లాడకుండా వారి జ్ఞాపకాలు కూడా తన మనసులో ఉండడానికి వీలు లేదు అని గోడలపై ఫోటోలు కూడా ఉండనివ్వకుండా చేస్తుంది. ఇక వరలక్ష్మీ వ్రతం పూజ జరిపిస్తున్న సమయంలో పెద్ద కోడలు జానకికి ఆమె ఎలాంటి పనులు చెప్పదు. అన్ని పనులు కూడా చిన్న కోడలు మల్లిక చూసుకోవాలి అని ఆదేశిస్తుంది ఇక దొరికిందే అవకాశంగా మల్లిక కూడా ఆనందంతో పెద్ద కోడలిపై మరింత పెత్తనం చెలాయించాలని అనుకుంటుంది. జానకి ఏదైనా పని చేస్తున్న కూడా ఆమె సూటిపోటి మాటలతో మళ్ళీ నువ్వు అత్తగారి మోసం చేయాలని అనుకుంటున్నావా అంటూ మాటలతో బాధపెడుతుంది.

   రామచంద్రకు గాయం

  రామచంద్రకు గాయం

  అయితే మల్లికా పొగరును అనగదొక్కెందుకు ఆమె మామగారు గోవిందరాజులు ఎప్పటికప్పుడు మాటలతో కౌంటర్ ఇస్తూనే ఉంటారు. నువ్వు గొడవలు పెట్టే కార్యక్రమం ఆపేసి కాస్త పూజ పనులు చూసుకుంటే మంచిది అంటూ సెటైర్లు కూడా వేస్తూ ఉంటాడు. ఇక పూజా కార్యక్రమాలు అంతా సవ్యంగా జరుగుతున్న క్రమంలోనే రామచంద్ర అనుకోకుండా గాయాల పాలవుతాడు. వంట చేస్తూ ఉండే క్రమంలో వేడిగా ఉండే నూనె అతని చేయి పై పడుతుంది. దీంతో హఠాత్తుగా అమ్మ అని అరుస్తాడు. ఇక పక్కనే ఉన్న జ్ఞానాంబ కొడుకు బాధను చూసి కూడా దగ్గరికి రాలేకపోతుంది.

   తల్లి కొడుకుల బాధ

  తల్లి కొడుకుల బాధ

  తల్లిని అలా చూసిన రామచంద్ర కూడా ఎంతగానో బాధపడతాడు తనకు ఎప్పుడు దెబ్బ తగిలినా కూడా అమ్మ హఠాత్తుగా వచ్చి తనపై ప్రేమను చూపించి మందు రాసేది. కానీ ఇప్పుడు జరిగిన తప్పును గుర్తు పెట్టుకొని నా వద్దకు రావడానికి ఇష్టపడడం లేదు. ఆ విషయంలో అమ్మ ఎంతగా బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను అంటూ.. రామచంద్ర పాజిటివ్ గానే ఆలోచిస్తాడు. మరోవైపు జ్ఞానంబ కూడా అదేవిధంగా ఆలోచించి బాధపడుతుందగి. ఇక జానకి పరుగు పరుగున వచ్చి తన భర్త గాయానికి ముందు రాస్తుంది. ఆ తర్వాత యధావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

   నీలావతి అనుమానాలు

  నీలావతి అనుమానాలు

  అయితే నీలావతి అలాగే మరి కొంతమంది మహిళలు కూడా పూజకు అతిధులుగా వస్తారు. ఈ క్రమంలో నీలావతి మరింత అనుమానంగా కొన్ని ప్రశ్నలను వేస్తుంది. జ్ఞానాంబ పూజ చేయిస్తోంది కానీ మీ మొహంలో ఎలాంటి ఆనందం కనిపించడం లేదు అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు అని జ్ఞానాంబ చెప్పినప్పటికీ కూడా ఆమె గోడమీద ఉన్న ఫోటో ఎక్కడికి వెళ్లింది అని కూడా అడుగుతుంది. ఇక అప్పుడే మల్లికా ప్రత్యేకంగా విగ్రహాన్ని శుద్ధి చేసి తీసుకురాగా ఈ పూజా కార్యక్రమాలు పెద్ద కోడలతో చేయించకుండా చిన్న కోడలతో ఎందుకు చేస్తున్నారు అని కూడా నీలావతి అడగడంతో జ్ఞానాంబ కాస్త విసిగిపోతుంది. మా ఇంట్లో ఎప్పుడెప్పుడు గొడవ జరుగుతుందా అని ఎదురు చూస్తుంటావు కదా అని అడుగుతుంది. అందుకు నీలావతి అలాంటివి ఏమీ లేదు అని చెబుతోంది.

  జ్ఞానాంబ ఎలా స్పందిస్తుందో?

  జ్ఞానాంబ ఎలా స్పందిస్తుందో?

  అయితే భర్త విష్ణు మాత్రం జరిగిన గొడవ గురించి పెద్దగా చెప్పకుండా మా మల్లికా తనే పూజ పనులన్నీ కూడా చూసుకుంటాను అని నిరాహార దీక్ష చేసింది అని అందుకే మా అమ్మగారు ఆమెకు బాధ్యతలు అప్పగించారు అని కామెడీగా చెబుతాడు. దీంతో జ్ఞానాంబ తన భర్త విష్ణు పై మరింత కోపంగా ఉంటుంది. తన భర్త నుంచి తనకు ఏమాత్రం సపోర్ట్ రాదు అని ఆలోచిస్తుంది. ఇక గోవిందరాజులు జానకిని పిలిచి మల్లిక దగ్గర నుంచి విగ్రహం తీసుకుని పూజ మండపంలో పెట్టాలి అని చెబుతాడు. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఏవిధంగా స్పందిస్తుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial Episode from August 2nd
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X