Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu December 16th: డాక్టర్ రిపోర్టులతో మల్లిక వేషాలు.. అడ్డుకునేందుకు జానకి ప్లాన్
జానకి కలగనలేదు సీరియల్ కథ మరో కీలక మలుపు తిరుగుతోంది. ఇంట్లో రెండవ కోడలు మల్లిక అబద్ధపు ప్రెగ్నెన్సీతో ఇన్నాళ్లు అందరిని మోసం చేస్తుంటుంది. ఏ పని చేయకుండా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. కానీ చివరికి ఆ కడుపు విషయం తెలిసే సందర్భం ఎదురవుతుంది అని కడుపే పోయినట్లుగా అబార్షన్ అయినట్లుగా నాటకం ఆడుతుంది. ఇక ఇంట్లో అందరూ నమ్ముతారు. కానీ జనాకికి ముందే ఆ విషయం తెలిసినప్పటికీ కూడా బయటకు చెప్పదు. ఇక మరోవైపు చిన్న కోడలు జెస్సికి సీమంతం చేయాలని అనుకుంటారు. కానీ ఆమె కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక జానకి ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 455 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
కలలో రామచంద్ర
జెస్సికి ప్రత్యేకంగా సీమంతం వేడుకను నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలో సీమంతం వేడుకను చూస్తూ రామచంద్ర ఒక డ్రీమ్ లోకి వెళ్లిపోతాడు. తన భార్య జానకికి కూడా సీమంత వేడుక చేస్తే ఎలా ఉంటుందని కలలు కంటూ ఉంటాడు. ఇక ఆ కలలో రామచంద్ర జానకిని చూసి ఎంతగానో మురిసిపోతాడు. అంతేకాకుండా ఆమెకు ప్రేమతో ముద్దులు కూడా పెడుతూ ఉంటాడు. ఇక జానకి కూడా కలలో అదే తరహాలో ప్రేమను చూపిస్తుంది. ఇక ఆ కల నుంచి తేరుకోగానే జానకి ఏమీ ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. మీకు కూడా ఇలానే జరిగితే ఎలా ఉంటుందా? అని కలలు కంటున్నాను అని అంటాడు. ఇక జానకి ఆ మాటలకు సిగ్గు పడిపోతుంది.
దొంగలా రిపోర్ట్స్ తీసుకున్న మల్లిక
అయితే మరోవైపు జానకి జెస్సి రిపోర్ట్స్ ఎవరికి కనిపించకుండా తన గదిలో దాచుకుంటుంది. అయితే జానకి అంత సీక్రెట్ గా రిపోర్ట్ ఎందుకు దాచింది. అసలు అందులో ఏముంది అనే విషయాన్ని మల్లిక తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక జానకి ఏదో విషయాన్ని దాస్తోంది అని కూడా ఆమె అనుమానంతో ఆలోచిస్తుంది ఇక అందరూ కూడా సీమంతం వేడుకలో బిజీగా ఉండే సమయంలో మల్లిక ఎలాగైనా జానకి దాచిపెట్టిన రిపోర్ట్స్ తీసుకోవాలని అనుకుంటుంది. అయితే ఫైనల్ గా అందరి కళ్ళు కప్పి మల్లిక మెల్లగా జానకి గదిలోకి చేరుకుంటుంది. అనుమానం పడకుండా బీరువాలో జానకి దాచిన రిపోర్ట్స్ తీసుకొని తన గదికి వెళ్ళిపోతుంది.
రిపోర్ట్స్ కనిపించవు.
ఇక మరోవైపు జానకి మల్లిక తీరుపై కాస్త ముందుగానే అనుమానంతో ఉంటుంది. రిపోర్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా మల్లికా గమనిస్తూ ఉండడంతో ఆమె ఏం చేస్తుందో అని అనుకుంటుంది. అయితే రిపోర్ట్స్ ఉన్నాయో లేవో తన గదికి వెళ్లి చూడాలని ఉంటుంది. అయితే జానకి అలా గదిలోకి వెళ్ళగానే అక్కడ రిపోర్ట్స్ కనిపించవు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీంతో మళ్ళీ వెంటనే మల్లికపై అనుమానంతో ఉంటుంది. బయటకు వెళ్లి చూడగా అందరూ కూడా ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. మరోవైపు మల్లికా కూడా చాలా యాక్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఏమీ తెలియనట్టుగా అందరితోనూ మాట్లాడుతుంది.
అదే ఆలోచనలో జానకి
ఇక జానకి రిపోర్ట్స్ కనిపించడం లేదు అనే ఆలోచనతోనే ఉండిపోతుంది. జెస్సీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలలో కొన్ని సమస్యలు ఉన్నాయి అని 80% కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఏర్పడినట్లుగా వైద్యులు చెబుతారు. అందుకే ఆ రిపోర్ట్స్ ఎవరికంట పడకూడదు. వాటిని చూస్తే అందరూ కూడా మళ్లీ బాధపడతారు అని జానకి అనుకుంటుంది. అయితే అసలు విషయం తెలియక జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా జెస్సీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగానే ఉందని, ఎలాంటి సమస్య లేదు అని జానకి చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటుంది.
రిపోర్ట్స్ గురించి తెలిస్తే
నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మనకు మనవడో మనవరాలో పుడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది అని గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక తర్వాత వారిని గమనించిన జానకి మరింత ఆందోళన చెందుతుంది. అసలే అత్త మామ గారు ఇద్దరు కూడా జెస్సి ఆరోగ్యం గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సమయంలో వారికి రిపోర్ట్స్ గురించి తెలిస్తే మాత్రం తట్టుకోలేరు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోసారి గదికి వెళ్లి రిపోర్ట్స్ ఎక్కడైనా పడిపోయాయేమో అని గమనిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ కనిపించవు.
జెస్సికి రిపోర్ట్స్ ఇవ్వాలని..
ఇక ఆ తర్వాత మల్లిక తన గదిలో దాచిపెట్టిన రిపోర్ట్స్ ను తీసుకొని వాటిలో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే ఆమెకు ఇంగ్లీష్ రాకపోవడంతో వాటిని ఎవరి చేత చదివించాలి.. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది. ఇక తర్వాత ఈ విషయాన్ని డైరెక్ట్ గా జెస్సిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అని చూస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ జెస్సి కంటపడితే తట్టుకోలేదు అని జానకి అనుకుంటుంది. మరి మల్లికను ఆమె ఎలా అడ్డుకుంటుందో చూడాలి. అలాగే అఖిల్ విషయంలో కూడా జానకి రామచంద్రకు ఒక సలహా ఇస్తుంది. కానీ అతను సీరియస్ అవుతాడు. మరి ఈ పరిస్థితులను ఆమె ఎలా దాటుకుంటూ వెళ్తుందో చూడాలి.