Janaki Kalaganaledu November 4th: అఖిల్ తప్పుల విషయంలో జానకి టెన్షన్.. ఊహించని కౌంటర్

జానకి కలగనలేదు సీరియల్ లో ఉహించని ట్విస్టులు కథను మలువు తిప్పుతున్నాయి. జ్ఞానాంబ కుటుంబంలో గొడవల వలన విడిపోయే పరిస్థితికి వస్తుంది. ఇక పెద్ద కోడలు జానకి ఎవరిని విడిపోనివ్వకుండా చూసుకుంటుంది. జానకి తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 425 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అబద్ధాలు చెప్పి

అబద్ధాలు చెప్పి

జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ డబ్బు సంపాదించాలి అనే ఆశతో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. మొదట అతను ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండడంతో రామచంద్ర భార్య అఖిల్ కు బుద్ధి చెప్పాలి అని సరైన కెరీర్ సెట్ చేసుకోవాలి అని సలహా ఇస్తుంది. అందుకు మొదట ఆమె మాటలను విన్న అఖిల్ ఆ తర్వాత చిరాకుతో తప్పుడు దారిలో ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి వీరందరినోళ్లు మూయించాలి అనుకుంటాడు. అయితే అఖిల్ తన స్నేహితుడు కలిసి డ్రగ్స్ వ్యాపారం లోకి దిగుతాడు. ముందుగా పెట్టుబడి కింద కొంత డబ్బులు కూడా పెట్టాలి అని చెప్పడంతో తన భార్య బంగారం కూడా తీసుకుంటాడు. అయితే అఖిల్ పూర్తిస్థాయిలో చదువుపై ఫోకస్ చేస్తున్నాను అని స్పెషల్ కోర్స్ కూడా చేస్తున్నట్లు ఇంట్లో అబద్ధాలు చెబుతాడు. ఇక అది నిజమనుకున్న జానకి అతనికి 5000 రూపాయలు కూడా ఇస్తుంది.

డ్రగ్స్ వలన అఖిల్ తప్పటడుగు

డ్రగ్స్ వలన అఖిల్ తప్పటడుగు

అయితే అఖిల్ తన కాలేజీలోనే డ్రగ్స్ అమ్ముతూ ఒక అమ్మాయికి కనిపిస్తాడు. ఆమె అఖిల్ క్లోజ్ ఫ్రెండ్ మాధురి. ఇక అఖిల్ తప్పు చేస్తున్నాడు అని ఆమె అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఈ విషయాన్ని మీ ఇంట్లో చెబుతాను అని నువ్వు ఇలా తప్పుడు పనులు చేస్తుంటే ఒక ఫ్రెండ్ గా చూస్తూ ఊరుకోలేను అని అంటుంది. అయితే మాధురికి మొదట నచ్చచెప్పాలి అని చూసిన అఖిల్ ఆ తర్వాత ఆమెపై కోపాన్ని తెచ్చుకుంటాడు. ఇక మాధురి పరిగెత్తుతూ ఉంటే ఒక కట్టె తీసుకుని ఆమె తలపై కొడతాడు. దీంతో తీవ్రంగా గాయపడుతుంది.

 హాస్పిటల్ కు మాధురి తల్లిదండ్రులు

హాస్పిటల్ కు మాధురి తల్లిదండ్రులు

అయితే అఖిల్ ఆమెను కొట్టడం జానకి చూస్తుంది. ఇక మాధురి కింద పడిపోవడంతో ఆమెను హాస్పిటల్ లో కూడా జాయిన్ చేస్తుంది. ఇక మాధురిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించిన జానకి మాధురి ఆరోగ్య విషయంలో కొంత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వారి తల్లిదండ్రులు కూడా హాస్పిటల్ కి వచ్చి తీవ్ర స్థాయిలో బాధపడుతూ ఉంటారు. అసలు మా అమ్మాయి ఎవరి జోలికి వెళ్లదు అని ఇల్లు కాలేజీ తప్పితే తనకు మరొక ప్రపంచం తెలియదని అలాంటిది ఎవరు ఆమెను కొట్టారు అని జానకిని అడుగుతారు.

 నిజాలు తెలుసుకోవాలి

నిజాలు తెలుసుకోవాలి

అయితే జానకి అప్పుడే అఖిల్ పేరు చేప్పకూడదని అనుకుంటుంది. అసలు తప్పు ఏం జరిగింది అని నిజాన్ని నిజాలు తెలుసుకోవాలి అని ఆ తర్వాత ఇంట్లో చర్చించిన తర్వాత అఖిల్ గురించి చెప్పాలని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత మాధురి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ వివరణ ఇస్తుంది. ఆమె పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉంది అని కొంత సమయం గడిస్తే గాని ఏమీ చెప్పలేము అని అంటారు. ఇక జానకి హాస్పటల్ నుంచి ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో అంతకు ముందు నుంచే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

 టెన్షన్ పెట్టకూడదు అని

టెన్షన్ పెట్టకూడదు అని

ఇక జానకి జరిగిన విషయాన్ని చెప్పకుండా కొన్ని పుస్తకాలు అవసరమయ్యాయి అని వాటిని కొనుక్కోడానికి వెళ్లడం వలన ఆలస్యమైనట్లుగా చెబుతుంది. ఇక జానకి అలా చెబుతున్నప్పుడే ఇంట్లోకి అఖిల్ కూడా వస్తాడు అతను ఏమీ తెలియనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళిన జానకి అఖిల్ పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటుంది రామచంద్ర వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. కానీ ఇప్పుడే అతనికి నిజం చెప్పి టెన్షన్ పెట్టకూడదు అని జానకి ఆలోచిస్తుంది.

అఖిల్ కు జానకి కౌంటర్

ఇక తర్వాత జానకి అఖిల్ తో మాట్లాడాలి అని అనుకుంటుంది. అఖిల్ మాధురిని కొట్టిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అని జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక తాను మారిపోయాను అని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటున్నట్లు అఖిల్ బిల్డప్ ఇస్తాడు. ఇక జానకి అతన్ని మరింత అనుమానిస్తుంది. నీకోసం బయట ఎవరో వచ్చారు అని మాధురి గురించి అడిగారు అని చెప్పడంతో అతను ఒక్కసారిగా టెన్షన్ పడతాడు. ఇక అఖిల్ బయటకు వెళ్లి చూస్తే ఎవరూ ఉండరు. కానీ జానకి అప్పుడే ఎవరు రాలేదు అని అంటుంది. మరి వీరి మధ్య సంభాషణ ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X