For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 18th: జానకి చేతికి రామ డబ్బులు.. వీడియో తీసిన మల్లిక.. న్యూ ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మంచి కంటెంట్ తో జనాల్లో ఆదరణను పెంచుకుంటోంది. భర్త రామ సహాయంతో ఎలాగైనా తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని జానకి అనుకుంటుంది. ఈ క్రమంలో అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 412 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఎవరికి చెప్పకూడదు అని

  ఎవరికి చెప్పకూడదు అని

  జ్ఞానాంబ చిన్న కోడలు జెస్సికి హఠాత్తుగా కడుపులో నొప్పి రావడంతో వెంటనే పెద్ద కోడలు జానకి ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళుతుంది. అయితే జెస్సిని వైద్యులు పరీక్షించిన తర్వాత ఆమె ఒక సమస్య ఎదుర్కొంటుంది అని కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు ప్రాబ్లం ఉంది అని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెబుతారు. అయితే భవిష్యత్తులో మాత్రం ట్రీట్మెంట్ చేయిస్తే తల్లి బిడ్డలకు ఇద్దరికీ మంచిది అని కూడా వైద్యులు చెబుతారు. ఇక ఆ విషయాన్ని ఇంట్లో చెబితే అందరూ కంగారు పడతారు అని జానకి రామచంద్ర ఇద్దరూ కూడా ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటారు.

  ట్రీట్మెంట్ కోసం డబ్బు

  ట్రీట్మెంట్ కోసం డబ్బు

  అంతేకాకుండా ట్రీట్మెంట్ కోసం డబ్బు అవసరం పడుతుంది కాబట్టి ఇప్పటినుంచే స్వీట్ షాప్ లో వచ్చే సంపాదనలో కొంత ఆధా చేయిస్తే బాగుంటుంది అని కూడా జానకి రామచంద్ర కు సలహా ఇస్తుంది. దీంతో రామ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఇక తర్వాత జెస్సి వచ్చి డాక్టర్ ఏమన్నారో అని అడిగినప్పుడు కూడా వాళ్ళు అసలు విషయం చెప్పరు.

  ఆటంకం కలుగుకుండా

  ఆటంకం కలుగుకుండా

  ఇక తర్వాత ఇంట్లో ఉండే రెండవ కోడలు మల్లిక పండ్లు తింటూ ఉంటుంది. అప్పుడే జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు వచ్చి జానకి ఇకనుంచి ఇంట్లో పనులు చేయడానికి వీలు లేదు అని తన చదువుకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా చూసుకోవాలి అని పనిమనిషి చికిత్తకు చెబుతుంది. అలాగే జ్యూస్ కూడా తీసుకువెళ్లి ఇవ్వాలి అని పని మనిషికి చెప్పడంతో.. జానకి గారు ఇంట్లో లేరు అని చికిత్త చెబుతుంది. ఉదయాన్నే జెస్సీని తీసుకొని బయటకు వెళ్లారు అని చెప్పడంతో చదువుకోకుండా జానకి ఎందుకు బయటకు వెళ్ళింది అని జ్ఞానాంబ ఆశ్చర్యపోతుంది.

  జానకి పై కోపం వచ్చేలా

  జానకి పై కోపం వచ్చేలా

  ఇక అదే సమయంలో మల్లిక జానకి పై కోపం వచ్చేలా చేయాలి అని మరిన్ని అబద్ధాలు చెబుతుంది. అసలు జానకికి చదువుకోవాలని లేదు అని సమయం వృధా చేస్తోంది అని అంటుంది. అయితే జానికి చదువుకోకుండానే మొన్న రాసిన పరీక్షల్లో మొదటి ర్యాంకు సంపాదిస్తుందా అని మామ గోవిందరాజులు కౌంటర్ ఇస్తాడు. ఇక అదే సమయంలో జానకి వస్తుంది. అప్పుడు జ్ఞానాంబ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. బయటకి వెళ్లి నోట్స్ కొనుక్కోడాలని అనుకున్నాను అని అందుకోసం జెస్సిని తోడుగా తీసుకువెళ్లినట్లుగా జానకి చెబుతోంది.

  ఇంట్లోనే ఉండి చదువుకోవాలి

  ఇంట్లోనే ఉండి చదువుకోవాలి

  ఇక బయటకు వెళ్తే నోట్స్ ఏవి అని మల్లిక మళ్లీ అనుమానిస్తుంది. షాప్ మూసేసి ఉంది అని మళ్ళీ జానకి చెబుతుంది. ఇక అప్పుడే కొంతమంది వచ్చి దసరా మామూలు అని అంటారు. ఇక వారికి జ్ఞానాంబ జానకి చేత డబ్బులు ఇప్పిస్తుంది. అది చూసిన మల్లికా మళ్ళీ షాక్ అవుతుంది. అలాగే జ్ఞానాంబ జానకికి మరోసారి వివరంగా చెబుతోంది. ఇంకోసారి నువ్వు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకోవాలి అని.. ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో వాళ్ళను అడగాలి అని సలహా ఇస్తుంది.

  డబ్బులు ఆదా చేస్తే బాగుంటుంది

  డబ్బులు ఆదా చేస్తే బాగుంటుంది

  ఇక తర్వాత ఇంటికి వచ్చిన రామచంద్ర నెల మొత్తంలో వచ్చిన స్వీట్ షాప్ సంపాదనను తల్లికి ఇవ్వాలని అనుకుంటాడు. అయితే అదే సమయంలో మన ఇంట్లోకి ఇద్దరు వారసులు రాబోతున్నారు కాబట్టి వారి భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే డబ్బులు ఆదా చేస్తే బాగుంటుంది అని రామచంద్ర తల్లికి చెబుతాడు. అందుకు గోవిందరాజులు కూడా అతని మెచ్చుకుంటాడు. ఇది జానకి గారి ఆలోచన అని అనగానే జ్ఞానాంబ మెచ్చుకుంటుంది.

  కోపంగా మాట్లాడిన మల్లిక

  కోపంగా మాట్లాడిన మల్లిక

  ఇక తర్వాత ఆ డబ్బులు తీసుకువెళ్లి రామచంద్ర తన భార్యకు ఇస్తాడు. ఉదయాన్నే బ్యాంకులో డిపాజిట్ చేయాలి అని అంటాడు. ఇక ఆ డబ్బులు జానకికి ఇస్తున్న సమయంలోనే మల్లిక వీడియో తీస్తుంది. వాళ్లు సొంతంగా డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు అని అనుమానిస్తూనే ఆ తర్వాత అదే విషయాన్ని తన భర్త విష్ణుకు చెబుతుంది. ఇక విష్ణు దగ్గర నుంచి కూడా రామచంద్ర డబ్బులు తీసుకొని వాటిని కూడా డిపాజిట్ చేయాలని అనుకుంటాడు. కానీ అప్పుడు మల్లిక ఒప్పుకోదు. మీరు మాత్రం డబ్బులు ఆదా చేసుకుని మా డబ్బులు ఇంట్లో వాడాలని అనుకుంటారా అని కోపంతో మాట్లాడుతుంది. మరి వారికి జానకి ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial Episode from October 18th
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X