For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 21st: అఖిల్ జెస్సిల పెళ్లి చేసిన జానకి.. జ్ఞానాంబ ఊహించని ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు ట్విస్ట్ లతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక రామచంద్ర సహకారంతోనే అతని భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 393 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  అఖిల్ మాట తప్పడంతో..

  అఖిల్ మాట తప్పడంతో..

  రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్, జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ తర్వాత గర్భం వచ్చేలా చేస్తాడు. అయితే ఆ తరువాత అఖిల్ తల్లికి భయపడే ప్రేమ విషయాన్ని చెప్పడానికి వెనుకడుగు వేస్తాడు. మరోవైపు జెస్సి ప్రెగ్నెన్సీ అయిన విషయం వారి ఇంట్లో తెలియడంతో ఒత్తిడి పెంచుతూ ఉంటారు. ఇక జానకి ఎలాగైనా జెస్సికి అఖిల్ కు పెళ్లి చేసి న్యాయం చేయాలి అని అనుకుంటుంది. అయితే అఖిల్ మాత్రం ఇంతలోనే మాట తప్పుతాడు. తనకు జెస్సి కి ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెబుతాడు. అంతే కాకుండా ఇంట్లో తన మాటలను నెమ్మేలా కూడా ప్రవర్తిస్తాడు. జానకి ఎంత చెప్పినప్పటికీ కూడా అఖిల్ నిజం ఒప్పుకోకపోవడంతో జెస్సి తల్లిదండ్రులు కూడా సీరియస్ అవుతారు.

   కొడుకుని నమ్మిన జ్ఞానాంబ

  కొడుకుని నమ్మిన జ్ఞానాంబ

  అయితే జ్ఞానాంబ మాత్రం కొడుకు మాటలు నమ్ముతుంది. అతను సూసైడ్ నాటకం కూడా ఆడడంతో తప్పి చేయలేదేమో అని తల్లి అనుకుంటుంది. జెస్సి తల్లిదండ్రులకు మల్లిక ఫోన్ చేసి జానకి రామ చంద్ర ఇద్దరు కూడా మిమ్మల్ని ఇన్ని రోజులు మోసం చేశారని పెళ్లి చేస్తామని అబద్ధం చెప్పారని, మీ నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నట్లు కూడా చెబుతుంది. ఇక మల్లికా ఎవరు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా జెస్సి తల్లిదండ్రులు ఆమె చెప్పింది కూడా నిజమే అని ఇన్ని రోజులు మనం జానకి రామచంద్ర మాటలు నమ్మము అని అనుకుంటారు. ఇక ఆ తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా జ్ఞానాంబ ఇంటికి వెళ్లాలని డిసైడ్ అవుతారు.

   అసలు విషయం తేల్చాలని

  అసలు విషయం తేల్చాలని

  ఇక జ్ఞానాంబ ఇంటికి రాగానే జెస్సీ తండ్రి అసలు విషయం తేల్చాలని అడుగుతాడు. అయినప్పటికీ జ్ఞానాంబ అతని మాటలు నమ్మదు. నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అతను చేయని తప్పుకు ఎలా ఒప్పుకుంటాడు అని అంటుంది. ఇక జెస్సీ తండ్రి మరింత కోపానికి లోనవుతాడు. రేపు ఉదయం కల్లా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము ఏం చేయాలో అది చేస్తాము అని సీరియస్ గా చెబుతారు. ఇక జెసి వాళ్ళ పేరెంట్స్ వెళ్లిపోయిన తర్వాత జానకి రామచంద్రన్ మళ్ళీ ఆలోచనలో పడతారు. ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఏమి మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉంటారు. ఫైనల్ గా జ్ఞానాంబ జనాకికి ఇచ్చిన గడువు ఒకరోజు మాత్రమే ఉంది అని ఈ ఒక్క రోజులో అఖిల్ తప్పు చేశాడు అనేది నీరూపించకుంటే జెస్సి పేరుఇంట్లో వినిపించ కూడదు అని చెబుతుంది.

   ఆలోచనలో పడిన అఖిల్

  ఆలోచనలో పడిన అఖిల్

  ఇక ఎలాగైనా నిజం నిరూపించాలి అని జానకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి వరకు నిజం నిరూపించకపోతే జెస్సిని కలిసే అవకాశం ఉండదు అని ఆ తర్వాత పరిస్థితులు కూడా సీరియస్ గా మారవచ్చు అని అనుకుంటుంది. ఒకసారి అఖిల్ తో మాట్లాడాలని జానకి అనుకుంటుంది. ఇక మరోవైపు అఖిల్ ఇంకా ఒక రోజు గడిస్తే అమ్మ ఎవరి మాట వినదు అని జెస్సి టెన్షన్ కూడా తీరిపోతుంది అని అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా బయట ఉండగా జానకి అతనితో వెళ్లి మాట్లాడాలని అనుకుంటుంది. ఇక అఖిల్ అక్కడి నుంచి కూడా తప్పించుకోవాలని అనుకుంటాడు. ఇక ఫైనల్ గా జానకికి మరో అవకాశం ఇస్తున్నామని నిజం చెబితే నీకు ఏ టెన్షన్ లేకుండా అంటుంది అని అంటుంది.

   ఎప్పటికైనా నిజం బయట పడుతుంది

  ఎప్పటికైనా నిజం బయట పడుతుంది

  అయితే జానకి చెబుతున్నా కూడా అఖిల్ మొదట ఏ మాత్రం ఒప్పుకోడు. రేపు ఒక్కరోజు గడిచిపోతే అమ్మ ఎవరి మాట వినదు కాబట్టి వదిన ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక వదిన అని అఖిల్ చెబుతాడు. అలా జరిగితే ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అని ఆ తర్వాత జెస్సి ఏమవుతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించావా అని జానకి అర్థమయ్యేలా చెబుతోంది. ఇప్పుడు నువ్వు తప్పించుకుంటే ఎప్పటికైనా నిజం బయట పడుతుంది. మరింత తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజం తెలిసిన రోజు అత్తయ్య గారు నిన్ను ఏమాత్రం క్షమించారు అనే జానకి అఖిల్ కు చెందుతుంది.

  గొడవను మరింత పెద్దది చేయాలి

  గొడవను మరింత పెద్దది చేయాలి

  ఇక ఆ తర్వాత ఉదయం అందరూ గణేష్ నిమజ్జనం లో చాలా బిజీగా ఉంటారు. మల్లిక అప్పుడే ఈరోజు ఎలాగైనా గొడవను మరింత పెద్దది చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అఖిల్ జానకి రామచంద్రలను చూస్తూ ఉండగా వారు ఇంట్లో కనిపించరు. ఇంటి బయట గణేష్ వేడుకలు మొదలై పోతాయి. అందరూ కలిసి ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు జ్ఞానాంబ తన ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరు అనే విషయాన్ని అత్తగారికి చెప్పాలి అని కూడా మల్లికా ఆలోచిస్తుంది. కానీ మళ్ళీ వెనకడుగు వేస్తుంది.

   ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  ఇక గణేష్ నిమజ్జనం వేడుకలు జరుగుతున్న సమయంలోనే అప్పుడే కారులో నుంచి అఖిల్ జెస్సి పెళ్లి దండలతో కనిపిస్తారు. ఆ విషయాన్ని వెంటనే మల్లిక అత్తగారికి చెందుతుంది. ఇక వారిద్దరినీ అలా చూసిన జ్ఞానాంబ హారతి తీసుకురా అని పని మనిషికి చెబుతుంది. దీంతో ఆ మాటకు మల్లిక కూడా షాక్ అవుతుంది. వాళ్లని బయటకు పంపకుండా ఇంట్లోకి పంపుతున్నారు అని ఆచార్య పోతుంది. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మల్లిక కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అయితే గత రాత్రి జానకి అఖిల్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అఖిల్ తప్పు చేశాడు అనే విషయాన్ని జ్ఞానాంబ గ్రహిస్తుంది. ఆమె ఆలోచన ద్వారా అఖిల్ జెస్సి వివాహం జరుగుతుంది. ఇక జ్ఞానాంబ అఖిల్ పై చేయి చేసుకుంటుంది. నిన్ను నమ్మి జానకి రామచంద్రలను కూడా అనుమానించాని అని జ్ఞానాంబ అఖిల్ ను కొడుతుంది. మరి ఈ పరిస్థితులలో జెస్సి జ్ఞానాంబ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial Episode from September 21st
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X