twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu February 10th: చనిపోవాలని వెన్నెల ప్రయత్నం.. జానకికి మరో సీరియస్ కండిషన్

    |

    జానకి కలగనలేదు సీరియల్ మొదట్లో కంటే ఇప్పుడే ప్రేక్షకుల మన్ననలను ఎక్కువగా అందుకుంటోంది. విజయవంతంగా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని జానకి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. కానీ జానకి సీక్రెట్ గా కోచింగ్ సెంటర్ కు వెళ్లిన అనంతరం జ్ఞానాంబ మరొక ట్విస్ట్ ఇచ్చింది. ఇక జానకి తన అత్తగారి కోసం చదువును వదులుకోవాలి అనుకుంటుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా మారింది? ఆమెను భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపుకు తెచ్చాడు అనే కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 234 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

     కుల దేవత ఆరాధన..

    కుల దేవత ఆరాధన..

    ఇంట్లో అశుభలు అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయని జ్ఞానాంబ కులదేవత ఆరాధన చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. అయితే పూజలో అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం కూడా పెట్టాలని జ్ఞానాంబ ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. ఇక పూజను రామచంద్ర జానకి జరిపించాలని కూడా జ్ఞానాంబ చెప్పడంతో వారు గుడికి వెళతారు. ఇక సమయంలో వారు ఇద్దరు కూడా ప్రసాదం మర్చిపోతారు. ఇక ఆ తరువాత జ్ఞానాంబ నిజం తెలుసుకొని ఆ ప్రసాదం గుడికి తీసుకు వెళుతుంది. ఇక మధ్యలో జ్ఞానాంబ ఫోన్ చేసినప్పటికీ జానకి ఇప్పుడే ప్రసాదం నైవేద్యంగా పెడుతోందని కూడా రామ అబద్ధం చెబుతాడు.

    నిజం చెప్పాలని అనుకున్న జానకి

    నిజం చెప్పాలని అనుకున్న జానకి

    మరోవైపు రామ చంద్ర జానకి నుంచి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. అసలు నువ్వు ఎందుకు ఐపీఎస్ చధవను అని అంటున్నారో అర్థం కావడం లేదు అని అమ్మ చదువుకొమ్మని చెప్పినా కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నిస్తాడు. అంతే కాకుండా తన మీద ప్రమాణం చేసి చెప్పాలని అనడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జ్ఞానాంబ రామచంద్రకు నిజం చెప్పకూడదని అనడంతో ఆ విషయంలో జానకి సందిగ్ధంలో పడుతుంది. ఇక తాను చదువుకోవడం మీ అమ్మ గారికి ఇష్టం లేదు సర్టిఫికేట్స్ తీసుకున్నారు అని జానకి చెప్పాలని అనుకుంటుంది. కానీ జానకి జానకి నిజం చెప్పాలని అనుకుంటున్న సమయంలో అక్కడికి జ్ఞానాంబ ఎంట్రీ ఇస్తుంది.

     జ్ఞానాంబ సీరియస్

    జ్ఞానాంబ సీరియస్

    ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అని మొదట జ్ఞానాంబ జానకిని ప్రశ్నిస్తుంది. ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెడితేనే మీరు చేసిన పూజకు ఫలితం ఉంటుందని ఎంతో జాగ్రత్తలు చెప్పాను. అయినా కూడా నా మాట అంటే మీకు ఏ మాత్రం లెక్కలేదు అని జ్ఞానాంబ జానకిని ప్రశ్నిస్తుంది. ఇక జానకి తన నుంచి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేయగా ఆమె ఏ మాత్రం ప్రయత్నం చేయదు. మరొకవైపు రామచంద్ర కూడా జానకి గురించి మంచి చెప్పేందుకు ప్రయత్నం చేయగా జ్ఞానాంబ అతనిపై కూడా సీరియస్ అవుతుంది. ప్రసాదం నైవేద్యంగా పెడుతున్నారని నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? నీకు తల్లి కంటే పెళ్ళాం ఎక్కువయ్యిందని అంటుంది. ఇక నువ్వు బాధపడవద్దని రామ అర్థం చేసుకోవాలని అంటాడు.

    మరో కండిషన్

    మరో కండిషన్

    ఇక కొడుకు కొడలిపై సీరియస్ అయిన జ్ఞానాంబ పంతులు గారు రావడంతో పూజను పూర్తి చేయిస్తుంది. ఇక ఆ తరువాత కొనేటిలో జానకి దీపాన్ని వదిలేయాలని పూజారి చెప్పడంతో జానకి అక్కడికి వెళుతుంది. ఇక ఆ దీపంతో పాటు నీ చదువును కూడా వదిలేయాలని జ్ఞానాంబ అదేశిస్తుంది. నా కొడుకును నన్ను విడదియ్యాలని అనుకుంటున్నవా? అంటూ కొప్పుడుతుంది. ఇక ఆ తరువాత జానకి తన వివరణ ఇస్తుంది. మీ కొడుకు ప్రమాణం చేసుకొని నాతో కోపంగా ఉండేసరికి నిజం చెప్పాలని అనుకున్నట్లు జానకి అంటుంది. ఇక జానకి ఎంత చెప్పినా కూడా పట్టించుకోని జ్ఞానాంబ నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. కానీ నా కొడుకు మరోసారి నీ చదువు గురించి బాధపడకూడదు. నన్ను తప్పుగా అర్థం చేసుకునేలా ఆలోచించకూడదు అని జ్ఞానాంబ చెబుతుంది.

    చనిపోవాలని వెన్నెల ప్రయత్నం..

    చనిపోవాలని వెన్నెల ప్రయత్నం..

    ఇక జానకి నీటిలో దీపాన్ని వదిలేస్తుండగా అప్పుడే రామచంద్ర అక్కడికి వస్తాడు. జానకి కన్నీళ్లతో దీపాన్ని వదిలేస్తున్నాను అని బాదపడుతుంది. ఇక మరోవైపు మల్లిక తన భర్తతో కలిసి హైదరాబాద్ ఎంజాయ్ చేస్తుంటుంది. ఇదే క్రమంలో జ్ఞానాంబ చిన్న కూతురు ప్రేమ విషయంలో తల్లి తిరస్కరించిందని ప్రియుడితో కలిసి చనిపోవాలని అనుకుంటుంది. ఇక చనిపోయే చివరి క్షణంలో జానకి వదినకు ఫోన్ చేయాలని వెన్నెల అనుకుంటుంది. ఇక జరిగిన తప్పుల కారణంగా నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు. అందుకే నీతో చివరగా మాట్లాడాలని ఉందని వెన్నెల జానకికి ఫోన్ చేస్తుంది. ఇక రామచంద్ర కూడా కంగారు పడతాడు. మరి వెన్నెలను జానకి రామ ఎలా సేవ్ చేస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu February 10th:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X