Janaki Kalaganaledu February 11th: వెన్నలను కాపాడిన జానకి.. జ్ఞానాంబ నుంచి మరో సవాల్
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు జానకి తన ఐపీఎస్ చదువును పూర్తిగా మర్చిపోయేందుకు సిద్ధమవ్వగా మరోవైపు వెన్నెల ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ ఆ విషయం తెలియక వెన్నలకు పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా మారింది? ఆమెను భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపుకు తెచ్చాడు అనే కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది.
ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 234 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

నా కంటే నీకు పెళ్లాం ఎక్కువైందా?
కుల దేవత ఆరాధన కోసం జానకి రామచంద్ర ఇద్దరిని గుడికి పంపిన జ్ఞానాంబ ప్రసాదం మార్చిపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెడితేనే పూజకు అర్థం ఉంటుందని ఎంత చెప్పినా కూడా వినలేదు అని నా మాట అంటే జానికికి ఏ మాత్రం లెక్కలేదు అని అంటుంది.
ఇక ఆమె అలా చెప్పగానే రామచంద్ర జానకి కి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేయగా అతన్ని కూడా తిడుతుంది.నా కంటే నీకు పెళ్లాం ఎక్కువైందా అని ఆగ్రహం చూపించడం తో రామ కూడా చాలా సైలెంట్ అవుతాడు.

నా కొడుకు నుంచి దూరం చేస్తావా?
ఇక జానకి తాను చదువుకోవడం మీ అమ్మ గారికి ఇష్టం లేదు సర్టిఫికేట్స్ తీసుకున్నారు అని జానకి చెప్పాలని అనుకుంటుంది. కానీ జానకి జానకి నిజం చెప్పాలని అనుకుంటున్న సమయంలో అక్కడికి జ్ఞానాంబ ఎంట్రీ ఇవ్వడంతో సైలెంట్ అవుతుంది. అదే విషయంపై మరోసారి జ్ఞానాంబ జానకిని ప్రశ్నిస్తుంది. నీ చదువుకు అడ్డు పెడుతున్నాను అని నా కొడుకుతో చెప్పి వాన్ని నన్ను దూరం చేయాలని అనుకుంటున్నావా? అని అంటుంది. ఇక జానకి ఎంత చెప్పినా కూడా పట్టించుకోని జ్ఞానాంబ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. కానీ నా కొడుకు మరోసారి నీ చదువు గురించి బాధపడకూడదు. నన్ను తప్పుగా అర్థం చేసుకునేలా ఆలోచించకూడదు అని జ్ఞానాంబ అదేశిస్తుంది.

మౌనంగానే జానకి..
ఇక సైలెంట్ గా దీపాన్ని నీళ్లలో వదిలేసిక జానకి తన కలను కూడా వదిలేసినట్లుగా బాధ పడుతుంది. ఇక ఆ విషయంలో జానకిని మరోసారి నిజం అడగాలని రామచంద్ర ఎంత ప్రయత్నం చేసినా కూడా జానకి మౌనంగానే ఉంటుంది. అత్తగారికి ఇచ్చిన మాట కోసం జానకి తనకే చదువు ఇష్టం లేదు అన్నట్లుగా సమాధానం ఇస్తుంది. ఇక ఆ తరువాత కారు దిగిన జానకికి వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. రామ చెల్లెలు వెన్నెల తన ప్రియుడు దిలీప్ తో కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా చెబుతుంది.

వెన్నెల ఆత్మహత్య..
వెన్నెల ఆత్మహత్య చేసుకోబోతొంది అని తెలియగానే రామ వెంటనే జానకి నుంచి ఫోన్ తీసుకొని ఏం జరిగిందని అడుగుతాడు. ఇక తన ప్రేమ విషయం అమ్మకు తెలిసిందని రెండు రోజుల్లో నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసిందని వెన్నెల బాధపడుతూ చెబుతుంది. ఇక దిలీప్ లేకుండా తాను బ్రతకలేను అంటూ చెప్పిన వెన్నెల చనిపోవాలని నిర్ణయం తీసుకున్నామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది.

అడ్డుకున్న జానకి
ఇక వెన్నలను ఎలాగైనా కాపాడాలని జానకి రామ ఇద్దరు కూడా ఎంతగానో వెతుకుతారు. వెన్నెల ఫోన్ మాట్లాడేటప్పుడు శంఖం సౌండ్ వచ్చింది కాబట్టి శివాలయం దగ్గర ఉన్నట్లుగా జానకికి డౌట్ వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న కొండల దగ్గరకు వెళ్లగా అప్పుడే వెన్నెల దిలీప్ ఇద్దరు కూడా కొండపై నుంచి దుకెందుకు సిద్ధంగా ఉంటారు. ఇక వెంటనే వెన్నెల రామ ఇద్దరు వాళ్ళ దగ్గరకు వెళ్లి దుకాకుండా అడ్డుకుంటారు. ఇక వెన్నెల తనను చావనివ్వండి అంటూ ఎంతగానో ఏడుస్తుంది. ఇక అమ్మతో మేము మాట్లాడతాము అంటూ రామ జానకి భరోసా ఇస్తారు.

మరో సవాల్..
ఇక మరోవైపు వెన్నెలకు పెళ్లి చేయాలని తండ్రి గోవిందరాజులు, తల్లి జ్ఞానాంబ సిద్ధమవుతు ఉంటారు. నిశ్చితార్థం కోసం ముహూర్తం గురించి పంతులుతో మాట్లాడుతూ ఉంటారు. ఇక జానకి రామ ఇద్దరు కూడా వెన్నలకు ధైర్యం చెబుతారు. దిలీప్ తో నీ పెళ్లి జరిపించేందుకు నేను హామీ ఇస్తున్నాను అని జానకి మాట్లాడగా మరోవైపు జ్ఞానాంబ పరువు కోసం ప్రాణాలు కూడా లెక్క చేయము అని అంటుంది.
ఇక జానకి vs జ్ఞానాంబ ఘట్టం మరోసారి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి జానకి తన అత్త జ్ఞానాంబను కాదని వెన్నెల పెళ్లి చేస్తుందా? ఇక జానకి తన ఐపీఎస్ చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే అంశాలు సీరియల్ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











