twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu February 14th: వెన్నెల ప్రేమ కోసం జానకి కఠిన నిర్ణయం.. మల్లికను చితకబాదిన తలుపులమ్మ

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరగబోతోంది. జ్ఞానాంబ, జానకి మధ్య ప్రేమతోనే జరిగే ఆధిపత్యం ఎలా ఉండబోతోందనేది ఎంతో ఆసక్తిగా మారింది. ఒకవైపు జానకి తన ఐపీఎస్ చదువును పూర్తిగా మర్చిపోయేందుకు సిద్ధమవ్వగా మరోవైపు వెన్నెల తన ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. తల్లి జ్ఞానాంబ ఆ విషయం తెలియక వెన్నలకు పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా మారింది? ఆమెను భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపు మళ్లించాడు అనే కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది.

    ఇక కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 235 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

    వెన్నెల ప్రేమ కథ

    వెన్నెల ప్రేమ కథ

    ఇంట్లో ప్రేమ విషయం తెలియడంతో వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. తల్లి జ్ఞానాంబ ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ విషయాన్ని ఒప్పుకోదని తన లవర్ దిలీప్ తో కలిసి చనిపోయేందుకు వెన్నెల నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆ తరువాత వెన్నెల ఆత్మహత్య చేసుకోబోతొంది అని తెలియగానే రామ వెంటనే జానకి నుంచి ఫోన్ తీసుకొని ఏం జరిగిందని అడుగుతాడు.

    ఇక తన ప్రేమ విషయం అమ్మకు తెలిసిందని రెండు రోజుల్లో నిశ్చితార్థం కూడా అవుతుందని వెన్నెల బాధపడుతూ చెబుతుంది. ఇక దిలీప్ లేకుండా తాను బ్రతకలేను అంటూ చెప్పిన వెన్నెల చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది.

    వెన్నలను కాపాడిన జానకి రామ

    వెన్నలను కాపాడిన జానకి రామ

    వెన్నలను ఎలాగైనా కాపాడాలని జానకి రామ ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుంటారు. వెన్నెల ఫోన్ మాట్లాడేటప్పుడు శంఖం సౌండ్ వచ్చింది కాబట్టి శివాలయం దగ్గర ఉన్నట్లుగా జానకికి డౌట్ వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న కొండల దగ్గరకు వెళ్లగా అప్పుడే వెన్నెల దిలీప్ ఇద్దరు కూడా కొండపై నుంచి దుకెందుకు సిద్ధంగా ఉంటారు. ఇక దగ్గరకు వెళ్లి వాళ్ళని సూసైడ్ చేసుకొనివ్వకుండా అడ్డుకుంటారు. అంతే కాకుండా అమ్మతో మేము మాట్లాడతాము అంటూ రామ జానకి భరోసా ఇస్తారు.

    మాట ఇచ్చేసిన జానకి

    మాట ఇచ్చేసిన జానకి

    అయితే వెన్నెలకు పెళ్లి చేయాలని తల్లి జ్ఞానాంబ సిద్ధమవుతు ఉంటారు. నిశ్చితార్థం కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు. పెళ్లి వారు మీ కూతురు నిర్ణయం అడగమని చెప్పగా అలాంటివి మా ఇంట్లో ఉండవని నా నిర్ణయమే తన కూతురు నిర్ణయం అని చెబుతుంది. ఒక వైపు దిలీప్ తో నీ పెళ్లి జరిపించేందుకు నేను హామీ ఇస్తున్నాను అని జానకి మాట్లాడగా మరోవైపు జ్ఞానాంబ పరువు కోసం ప్రాణాలు కూడా లెక్క చేయము అని అంటుంది. ఇక జానకి vs జ్ఞానాంబ ఘట్టం మరోసారి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా వెన్నెలకు నిశ్చితార్థం డేట్ ను కూడా జ్ఞానాంబ ఫిక్స్ చేస్తుంది.

    ట్విస్ట్ ఇచ్చిన తలుపులమ్మ

    ట్విస్ట్ ఇచ్చిన తలుపులమ్మ

    ఇక చిన్న కోడలు మల్లిక తన నానమ్మ తలుపులమ్మకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి ఎంజాయ్ చేయడానికి భర్తతో కలిసి సిటీకి వెళుతుంది. కానీ ఈ క్రమంలో వెంటనే మనవరాలిని చూసేందుకు తలుపులమ్మ జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. ఇక ఆమెను చూసిన జ్ఞానాంబ, గోవింద రాజులు షాక్ అవుతారు. మీకు ఆరోగ్యం బాగోలేదని మీ మనవరాలు మీ దగ్గరికి వచ్చింది అంటూ చెప్పగా.. అందుకు ఆమె షాక్ అవుతుంది. వెంటనే పనిమనిషి నెంబర్ తో ఫోన్ చేయించగా మల్లిక మళ్ళీ అబద్ధాలు చెబుతుంది. మా నానమ్మను నేను చూడగానే తిరిగి బ్రతికిందని అంటుంది.

    మల్లికను చితోకట్టిన తలుపులమ్మ

    మల్లికను చితోకట్టిన తలుపులమ్మ

    ఇక మరికొన్ని నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను అని మల్లిక చెప్పడంతో తలుపులమ్మ కోపంతో ఊగిపోతు ఉంటుంది. ఇక మల్లిక రాగానే తలువులమ్మ కోపంతో కొడుతుంది. చాలాసేపు కొట్టిన తరువాత గోవిందరాజులు ఆమెను కంట్రోల్ చేస్తాడు. మరోవైపు జ్ఞానాంబ కోపంతో సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. మల్లిక భర్త విష్ణు మాత్రం నవ్వుతాడు. ఇక అప్పుడే ఇంటికి జానకి రామచంద్ర, వెన్నలను తీసుకు వస్తారు. మళ్ళీ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకోకుండా రామ ఒట్టు వేయించుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగదు. నేను అమ్మతో మత్కడతాను దిలీప్ తో నీ పెళ్లి జరిపించే బాధ్యత మాది అని రామచంద్ర ధైర్యం చెబుతాడు.

    వెన్నెల కోసం జానకి మరో నిర్ణయం

    వెన్నెల కోసం జానకి మరో నిర్ణయం

    ఇక జ్ఞానాంబ వెన్నెల ప్రేమ విషయంలో ఏ మాత్రం ఒప్పుకోదు అని రామచంద్రకు బాగా తెలుసు. మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా ఒప్పుకోదు అని అర్థం అవుతుంది. జానకి కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. ఇక వెంటనే వెన్నలకు జ్ఞానాంబ మాట్లాడిన సంబంధం గురించి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటారు.

    కానీ అబ్బాయి తండ్రి ఆ విషయంలో ఒప్పుకోడు. నిశ్చితార్థం గురించి అందరికి చెప్పుకున్నాము మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అంటే మా పరువు పోతుంది అని అంటారు. ఇక్కడి నుంచి వెళ్లిపోంది లేదంటే జ్ఞానాంబకు చెబుతాను అని అనడంతో జానకి మళ్ళీ సందిగ్ధంలో పడుతుంది. మరి జానకి తన అత్తగారిని మాటను కాదని వెన్నెల పెళ్లి చేస్తుందా? అలాగే జానకి తన ఐపీఎస్ చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే అంశాలు సీరియల్ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 235
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X